Telangana MLC Election Counting

Telangana MLC Election Counting : ఎమ్మెల్సీగా ఎవ‌రు గెలుస్తారు? రేపే ఓట్ల లెక్కింపు

తెలంగాణ‌

క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త న‌డుమ ఓట్ల లెక్కంపు
అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
లెక్కింపు రెండ్రోజులు ప‌ట్టే అవ‌కాశం?

Telangana MLC Election Counting : Hyderabad : తెలంగాణ రాష్ట్రంలో వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం- న‌ల్గొండ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కొద్ది రోజుల కింద‌ట పోలింగ్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే బుధ‌వారం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కార్య‌క్ర‌మానికి అధికారులు ఏర్పాట్లు స‌ర్వం సిద్ధం చేశారు. వ‌రంగ‌ల్ – ఖ‌మ్మం – న‌ల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నిక‌లకు భారీ పోలింగ్ న‌మ‌దైంది. మూడు ఉమ్మ‌డి జిల్లాల ఓట‌ర్లు ఇచ్చిన తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో భ‌ద్రంగా న‌ల్గొండ ప‌ట్ట‌ణం ఆర్జాల‌బావి ప‌రిధిలోని స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లోని స్ట్రాంగ్ రూముల‌కు చేరింది.

బుధ‌వారం ఉద‌యం 8 గంట‌ల‌కు లెక్కింపు ప్ర‌క్రియ మొదలు కానున్న‌ది. ఈ లెక్కింపు సుమారు 48 గంట‌ల పాటు కొన‌సాగ‌వ‌చ్చ‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. సాధార‌ణ ఎన్నిక‌ల మాదిరిగా కాకుండా ఈ ఎన్నిక‌ల్లో కౌంటింగ్ ప్ర‌క్రియ పూర్తి భిన్నంగా కొన‌సాగనుంది. ఓటింగ్ లో ప్రాధాన్య‌త ప్ర‌కారం ఓట‌ర్లు ఓటు వేయ‌గా కౌంటింగ్ కూడా అదే విధంగా జ‌ర‌గ‌నుంది.

తొలి ప్రాధాన్య‌త ఓట్ల‌ను మొద‌లు లెక్కించి అదే స‌మ‌యంలో చెల్ల‌ని ఓట్ల‌ను ప‌క్క‌కు వేస్తారు. చెల్లిన ఓట్ల‌ను మాత్ర‌మే ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటూ విజేత‌కు అవ‌స‌ర‌మైన కోటాను నిర్ణ‌యిస్తారు. చెల్లిన ఓట్ల‌లో 50 శాతం ఫ్ల‌స్ ఒక‌టి క‌లిపి విజేత‌కు అవ‌స‌ర‌మైన గెలుపు కోటాను నిర్ణారించ‌నున్నారు. తొలి ప్రాధాన్య‌త ఓట్ల‌లోనే ఈ గెలుపు కోటాను అభ్య‌ర్థులు సాధిస్తే స‌రేస‌రి. లేకుంటే ఎలిమినేష‌న్ ప‌ద్ధ‌తిలో రెండో ప్రాధాన్య‌త ఓట్ల‌ను లెక్కిస్తారు.

అభ్య‌ర్థులు లేదా వారి ఏజెంట్ల స‌మ‌క్షంలో వీటికి సీల్ వేసి క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. బుధ‌వారం ఉద‌యం న‌ల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాల బావి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేష‌న్ గోదాముల ప్రాంగ‌ణంలో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

బ్యాలెట్ బాక్స్

ఈ సారి ఓట‌ర్ల సంఖ్య గ‌ణ‌నీయంగా పెర‌గ‌డంతో పోలింగ్ కూడా పెరుగుతుంద‌ని అంచ‌నా వేసిన అధికారులు ముంద‌స్తుగానే కౌంటింగ్ ప్ర‌క్రియ‌పై ప్ర‌త్యేక దృష్టి సారించారు. మొత్తం 8 రూములను కౌటింగ్ కోసం సిద్ధం చేశారు. ఒక్కో రూం లో ఏడు టేబుళ్ల‌ను ఏర్పాటు చేశారు. వీటికి అనుగుణంగా 3,500 మంది సిబ్బందిని ఎంపిక చేసి నాలుగు షిప్టులుగా వీరికి విదులు కేటాయించారు. వీరికి ఇప్ప‌టికే రెండు సార్లు శిక్ష‌ణ ఇచ్చి మాక్ కౌంటంగ్ కూడా చేప‌ట్టారు. కౌంటింగ్ స‌జావుగా సాగేలా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేప‌ట్టారు.

Telangana MLC Election Counting : బండిల్ ప్రక్రియ‌కు 12 గంట‌ల స‌మ‌యం

ఓట్ల లెక్కింపు స‌రిగ్గా బుధ‌వారం ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌వుతున్న నేప‌థ్యంలో 8 గ‌దుల్లో గ‌దికి 7 చొప్పున 56 కౌంటింగ్ టేబుళ్ల‌ను ఏర్పాటు చేశారు. ముందుగా వీటిపై బ్యాలెట్ ప‌త్రాల‌ను క‌ట్ట‌లు క‌ట్టే కార్య‌క్ర‌మం చేప‌డ‌తారు. మొత్తం 731 పోలింగ్ కేంద్రాల నుంచి వ‌చ్చిన బ్యాలెట్ బాక్స్ ల‌ను వ‌రుస క్ర‌మంలో టేబుల్ కు ఒక‌టి ఇచ్చి ఓపెన్ చేస్తారు. బ్యాలెట్ బాక్సుల్లోని బ్యాలెట్ పేప‌ర్ల‌ను టేబుల్‌పై కుప్ప‌గా పోసి 25 పేప‌ర్ల‌ను ఒక క‌ట్ట‌గా చేసి బండిల్స్ చేస్తారు. ఇలా మొత్తం బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి క‌ట్ట‌లు క‌డుతారు. పోస్ట‌ల్ బ్యాలెట్ల‌ను కూడా ఇదే స‌మ‌యంలో వీటితో క‌లిపేస్తారు. ఎప్ప‌టిక‌ప్పుడు వీట‌న్నింటినీ తీసుకెళ్లి ఓ పెద్ద డ్ర‌మ్ములో వేస్తారు.

బండిల్ కార్య‌క్ర‌మం మొత్తం పూర్త‌య్యాక అస‌లు లెక్కింపు మొద‌లువుతుంది. ఇలా బండిల్ కార్య‌క్ర‌మా నికి క‌నీసం 12 గంట‌ల స‌మ‌యం ప‌ట్టొచ్చ‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఉద‌యం 8 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ఇది కొన‌సాగుతుండ‌వ‌చ్చని రిట‌ర్నింగ్ అధికారి, క‌లెక్ట‌ర్ ప్ర‌శాంత్ జీవ‌న్ పాటిల్ వెల్ల‌డించారు. ఆ త‌ర్వాతే అస‌లు ఓట్ల లెక్కింపు మొద‌లు కానుంది. తొలి ప్రాధాన్య‌త ఓట్ల‌ను ముందుగా లెక్కిస్తారు.

Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *