Telangana liberation day: తెలంగాణ రాష్ట్రంలో శనివారం కేంద్ర ప్రభుత్వం నిర్వహించే విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి నాయకులు సాదర స్వాగతం పలికారు.
తెలంగాణలో విమోచన దినోత్సవం కార్యక్రమంలో హోం మంత్రి Amit Shah పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అమిత్ షా TRS ప్రభుత్వంపై విమర్శలు చేసేలా ప్రసంగంలో మాట్లాడారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పాలన ఉండేదని, అప్పుడు ప్రజలు 13 నెలల పాటు రజాకార్ల ఆరాచకాలను భరించారని అమిత్ షా గుర్తు చేశారు.
తెలంగాణలో ప్రజలకు విమోచన దినోత్సవం (Telangana liberation day) ను జరుపుకోవాలనే కోరిక ఉండేదని, ఇందుకు అన్ని పార్టీల వారు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటు బ్యాంకు రాజకీయాలను తెరమీదకు తెస్తూ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు వెనుకడుగు వేశాయని అమిత్ షా అన్నారు. నాటి రజాకార్ల అరాచకాలు ఇప్పటికీ తెలంగాణ ప్రజల గుండెల్లో జ్ఞాపకాలు సజీవంగానే ఉన్నాయన్నారు. ఇక నుంచి రజకార్ల అరాచకాల గురించి జరిగిన పలు అధ్యయానాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేసి వీరుల కథలు తెలియజేస్తామన్నారు. ప్రధాని మోడీ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించినందుకు అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు.
Telangana liberation day | అమిత్ షా రాక..నగరంలో వ్యంగ్యంగా ఫ్లెక్సీలు!
అయితే తెలంగాణ రాష్ట్రంకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం సాయంత్రం నగరంకు వచ్చారు. ఈ సందర్భంగా అమిత్ షా రాకను నిరసిస్తూ వ్యంగ్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు Hyd City లో పలు బస్టాండ్ల కూడళ్లలో ఈ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో ఏముందంటే? తెలంగాణ అనే చేపకు అమిత్ షా గేలం వేసి, నీకు నేను భరోసా ఇస్తున్నా.. అని చెబుతున్నట్టుగా రాశారు. వాటితో పాటు bye bye modi అంటూ రాశారు. ఇలాంటి వ్యంగమైన ఫ్లెక్సీలు హైదరాబాద్ నగరంలో గతంలో మోడీ పైనా కూడా పెట్టారు.

