Telangana govt jobs-80039 vacancies 2022 | తెలంగాణలో లక్ష ఉద్యోగాల భర్తీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో 91,142 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని అసెంబ్లీ సమావేశంలో తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు స్పష్టం చేవారు. విద్యాశాఖలో 20 వేల నుంచి 30 వేల పోస్టులకు నోటిఫికేషన్లు వదిలామన్నారు. రాష్ట్రంలో 11,103 మంది ఒప్పంద ఉద్యోగులున్నారన్నారు. వీరందర్నీ క్రమం బద్ధీకరిస్తామన్నారు. అదే విధంగా రాష్ట్రంలో ఇక నుంచి స్థానిక రిజర్వేషన్లు అమలవుతాయని స్పష్టం చేవారు.
తెలంగాణ రాష్ట్రంలో అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకు 90 శాతం రిజర్వేషన్ సౌకర్యం ఉందన్నారు. ఈ నియామకాల్లో 95 శాతం రిజర్వేషన్లు సాధించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని తెలిపారు. అన్ని పోస్టులకు 95 శాతం స్థానిక రిజర్వేషన్ల వర్తిస్తాయిని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ రోజు నుంచే అన్ని శాఖల ద్వారా నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ఆదేశాలు పంపామన్నారు. కింద తెలిపిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు 2022 ఇలా ఉన్నాయి. వీటిని పరిశీలించగలరు.
Telangana govt jobs-80039 vacancies 2022
క్ర. సం. | డిపార్మెంట్ | డైరెక్టర్ రిక్రూట్మెంట్ వేకెన్సీలు |
1. | హోం | 18,334 |
2. | సెకండరీ ఎడ్యుకేషన్ | 13,086 |
3. | హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ | 12,755 |
4. | హయ్యర్ ఎడ్యుకేషన్ | 7,878 |
5. | బీసీల సంక్షేమం | 4,311 |
6. | రెవెన్యూ డిపార్మెంట్ | 3,560 |
7. | షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్ డిపార్మెంట్ | 2,879 |
8. | ఇరిగేషన్ మరియు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ | 2,692 |
9. | ట్రైబల్ వెల్ఫేర్ | 2,399 |
10. | మైనారిటీస్ వెల్ఫేర్ | 1,825 |
11. | ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ | 1,598 |
12. | పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ | 1,455 |
13. | లేబర్ మరియు ఎంప్లాయిమెంట్ | 1,221 |
14. | పైనాన్స్ | 1,146 |
15. | మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ | 895 |
16. | మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ | 859 |
17. | అగ్రికల్చర్ మరియు కో-ఆపరేషన్ | 801 |
18. | ట్రాన్‌పోర్ట్, రోడ్స్ మరియు బిల్డింగ్స్ డిపార్మంఎట్ | 563 |
19. | న్యాయశాఖ | 386 |
20. | పశుపోషణ మరియు మత్స్య విభాగం | 353 |
21. | జనరల్ అడ్మినిస్టేషన్ | 343 |
22. | ఇండస్ట్రీస్ మరియు కామర్స్ | 233 |
23. | యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం మరియు కల్చర్ | 184 |
24. | ప్లానింగ్ | 136 |
25. | ఫుడ్ మరియు సివిల్ సప్లయిస్ | 106 |
26. | లెజిస్ల్లేచర్ | 25 |
27. | ఎనర్జీ | 16 |
మొత్తం | 80,039 |
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్