vacancies

Telangana govt jobs-80039 vacancies 2022: తెలంగాణ‌లో ప్ర‌భుత్వ ఉద్యోగాల ఖాళీలు

Job Notifications

Telangana govt jobs-80039 vacancies 2022 | తెలంగాణలో ల‌క్ష ఉద్యోగాల భ‌ర్తీ కార్య‌క్ర‌మానికి సీఎం కేసీఆర్ శ్రీ‌కారం చుట్టారు. రాష్ట్రంలో 91,142 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయ‌ని అసెంబ్లీ స‌మావేశంలో తెలిపారు. యుద్ధ ప్రాతిప‌దిక‌న 80,039 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన‌ట్టు స్ప‌ష్టం చేవారు. విద్యాశాఖ‌లో 20 వేల నుంచి 30 వేల పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు వ‌దిలామ‌న్నారు. రాష్ట్రంలో 11,103 మంది ఒప్పంద ఉద్యోగులున్నార‌న్నారు. వీరంద‌ర్నీ క్ర‌మం బ‌ద్ధీక‌రిస్తామ‌న్నారు. అదే విధంగా రాష్ట్రంలో ఇక నుంచి స్థానిక రిజ‌ర్వేష‌న్లు అమ‌ల‌వుతాయ‌ని స్ప‌ష్టం చేవారు.

తెలంగాణ రాష్ట్రంలో అటెండ‌ర్ నుంచి ఆర్డీవో వ‌ర‌కు స్థానికుల‌కు 90 శాతం రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యం ఉంద‌న్నారు. ఈ నియామ‌కాల్లో 95 శాతం రిజ‌ర్వేష‌న్లు సాధించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుంద‌ని తెలిపారు. అన్ని పోస్టుల‌కు 95 శాతం స్థానిక రిజ‌ర్వేష‌న్ల వ‌ర్తిస్తాయిని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఈ రోజు నుంచే అన్ని శాఖ‌ల ద్వారా నోటిఫికేష‌న్లు జారీ చేసేందుకు ఆదేశాలు పంపామ‌న్నారు. కింద తెలిపిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఉద్యోగాల ఖాళీలు 2022 ఇలా ఉన్నాయి. వీటిని ప‌రిశీలించ‌గ‌ల‌రు.

Telangana govt jobs-80039 vacancies 2022

క్ర‌. సం.డిపార్మెంట్డైరెక్ట‌ర్ రిక్రూట్మెంట్ వేకెన్సీలు
1.హోం18,334
2.సెకండ‌రీ ఎడ్యుకేష‌న్13,086
3.హెల్త్‌, మెడిక‌ల్‌, ఫ్యామిలీ వెల్ఫేర్12,755
4.హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్7,878
5.బీసీల సంక్షేమం4,311
6.రెవెన్యూ డిపార్మెంట్3,560
7.షెడ్యూల్డ్ కాస్ట్ డెవ‌ల‌ప్మెంట్ డిపార్మెంట్2,879
8.ఇరిగేష‌న్ మ‌రియు క‌మాండ్ ఏరియా డెవ‌ల‌ప్మెంట్2,692
9.ట్రైబ‌ల్ వెల్ఫేర్2,399
10.మైనారిటీస్ వెల్ఫేర్1,825
11.ఎన్విరాన్మెంట్‌, ఫారెస్ట్‌, సైన్స్ మ‌రియు టెక్నాల‌జీ1,598
12.పంచాయ‌తీరాజ్ మ‌రియు రూర‌ల్ డెవ‌లప్మెంట్1,455
13.లేబ‌ర్ మ‌రియు ఎంప్లాయిమెంట్1,221
14.పైనాన్స్1,146
15.మ‌హిళ‌లు, పిల్ల‌లు, దివ్యాంగులు మ‌రియు సీనియ‌ర్ సిటిజ‌న్స్895
16.మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ మ‌రియు అర్బ‌న్ డెవ‌ల‌ప్మెంట్859
17.అగ్రిక‌ల్చ‌ర్ మ‌రియు కో-ఆప‌రేష‌న్801
18.ట్రాన్పోర్ట్‌, రోడ్స్ మ‌రియు బిల్డింగ్స్ డిపార్మంఎట్563
19.న్యాయ‌శాఖ386
20.పశుపోష‌ణ మ‌రియు మ‌త్స్య విభాగం353
21.జ‌న‌ర‌ల్ అడ్మినిస్టేష‌న్343
22.ఇండ‌స్ట్రీస్ మ‌రియు కామ‌ర్స్233
23.యూత్ అడ్వాన్స్మెంట్‌, టూరిజం మ‌రియు క‌ల్చ‌ర్184
24.ప్లానింగ్136
25.ఫుడ్ మ‌రియు సివిల్ సప్ల‌యిస్106
26.లెజిస్ల్లేచ‌ర్25
27.ఎన‌ర్జీ16
మొత్తం80,039
Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *