University Vice Chancellor Posts | యూనివర్శిటీ వైస్ చాన్సలర్ పోస్టులను భర్తీ చేయాండి: గవర్నర్
Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న యూనివర్శిటీ వైస్ చాన్సలర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తెలంగాణ సర్కార్‌కు సూచించారు. ఇప్పటికే వీసీల నియామకంపై పలుమార్లు సర్కారు దృష్టికి తీసుకు పోయినా, స్పందన లేకపోవడం పట్ల గవర్నర్ అసంతృప్తిలో ఉన్నట్టు తెలిసింది. ఏడాదిన్నర నుంచి అన్ని స్టేట్ యూనివర్శిటీల్లో వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పలుమార్లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వీసీలను నియమించాలని సూచించారు. గతేడాది సీఎం కేసీఆర్ కూడా మూడు వార్తలో నియామయక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు వీసీల రిక్రూట్మెంట్ చేయలేదు, కాగా యూని వర్శిటీల్లో ఫిజికల్ క్లాసులు ప్రారంభం పై ఇటీవల వర్శిటీ ఇన్ఛార్జ్ వీసీలు, రిజిస్ట్రార్లతో గవర్నర్ వర్చువల్ లో మీటింగ్ ఏర్పాటు చేశారు. కరోనా గైడ్ లైన్స్ పాటిస్తూ, వర్శిటీ హాస్టళ్ల రీఓపెన్‌పై సర్కారు నుంచి స్పష్టత లేకపోవడం గురించి పలువురు ఇన్చార్జ్ వీసీలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. పలు ఇతర సమస్యలను కూడా వివరించారు.
ఈ సమావేశంలో వచ్చిన సూచనలు, సమస్యలను విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీకి రెండు రోజుల క్రితం మినిట్స్ రూపంలో గవర్నర్ ఆఫీసు నుంచి పంపించినట్టు తెలుస్తోంది. హాస్టళ్ల రీఓపెన్‌పై రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పాలసీ అమలు చేయాలని, సర్కారుకు గవర్నర్ సూచించినట్టు సమాచారం.
ఇది చదవండి:తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్
ఇది చదవండి:నందిగామ నియోజకవర్గంలో టిడిపి ఖాతాలోకి గోకరాజుపల్లి
ఇది చదవండి:భవనంపై నుంచి పసిపాపతో దూకి తల్లి ఆత్మహత్య
ఇది చదవండి:మొట్ట మొదటి సారి మెట్రోలో గుండె తరలింపు!
ఇది చదవండి: స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ (మెడిక్లాసిక్) పాలసీ గురించి తెలుసుకోండి!
ఇది చదవండి: టిడిపి నేత పట్టాభిపై కారుదాడి, గాయాలు
ఇది చదవండి: అచ్చెన్నాయుడు అరెస్టు | నిమ్మాడలో ఉద్రిక్తత