Electric Vehicles : తెలంగాణ స‌ర్కార్ బంప‌ర్ ఆఫ‌ర్‌ | ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై నో ట్యాక్సీ, నో రిజిస్ట్రేష‌న్‌!

Electric Vehicles :Hyderabad: తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం వాతావ‌ర‌ణ కాలుష్యాన్ని త‌గ్గించే దిశ‌గా కృష్టి చేస్తోంది. ఇందులో భాగంగా వాహ‌నాల నుండి వ‌చ్చే పొగ కాలుష్యాన్ని నియం‌త్రించేందుకు తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు డీజిల్‌, పెట్రోల్ తో న‌డిచే వాహ‌నాల వ‌ల్ల రాజ‌ధానితో పాటు ఇత‌ర ప‌ట్ట‌ణాల్లో వాయు కాలుష్యం పెరిగి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. వాహ‌నాల నుండి వెలువ‌డే పొగ వ‌ల్ల ఊపిరితిత్తుల‌కు సంబంధించిన వ్యాధులు, క్యాన్స‌ర్ లాంటివి వ‌చ్చి ప్ర‌జ‌లు ఆసుప‌త్రుల పాల‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో సాధ్య‌మైనంత వ‌ర‌కు వాయు కాలుష్యాన్ని త‌గ్గించేందుకు ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టిం చింది. రాష్ట్రంలో ఎల‌క్ట్రిక్‌ వాహ‌నాల‌ను ప్రోత్స‌హిస్తూ వాటికి ఎలాంటి రిజిస్ట్రేష‌న్లు గానీ, రోడ్డు ట్యాక్సీ గానీ క‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని స‌ర్కారు స్ప‌ష్టం చేసింది.

Electric Vehicles
ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది. ఆ ఉత్త‌ర్వుల ప్ర‌కారం రాష్ట్రంలో తొలి 2 ల‌క్ష‌ల ఎల‌క్ట్రిక్(Electric Vehicles )ద్విచ‌క్ర వాహ‌నాల‌కు 100 శాతం రోడ్ ట్యాక్స్ ఫ్రీ తో పాటు, రిజిస్ట్రేష‌న్ కూడా ఉచితంగా క‌ల్పిస్తామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఎక్కువుగా సొంత వాహ‌నాలు కొనుగోలు చేసేటువంటి వారిలో ద్విచ‌క్ర వాహ‌నాల‌తో పాటు, ఇత‌ర వాహ‌నాల‌కూ ఈ ఆఫ‌ర్ వ‌ర్తించ‌నుంది. తొలి 20 వేల మూడు చ‌క్రాల వాహ‌నాలు, తొలి 10 వేల ఎల‌క్ట్రిక్ లైట్ గూడ్స్ క్యారియ‌ర్ వాహ‌ నాలు, తొలి 5 వేల ప్రైవేటు కార్లు, 5 వేల ఫోర్ వీల‌ర్ వాహ‌నాల‌కు ఉచిత రోడ్ ట్యాక్స్‌, ఫ్రీ రిజిస్టేష‌న్ స‌దుపాయం ఉంటుంద‌ని తెలంగాణ స‌ర్కారు పేర్కొంది.

ఇది చ‌ద‌వండి:నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి ఖాతాలోకి గోక‌రాజుప‌ల్లి

ఇది చ‌ద‌వండి:భ‌వ‌నంపై నుంచి ప‌సిపాప‌తో దూకి త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌

ఇది చ‌ద‌వండి:మొట్ట మొద‌టి సారి మెట్రోలో గుండె త‌ర‌లింపు!

ఇది చ‌ద‌వండి: స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ (మెడిక్లాసిక్‌) పాల‌సీ గురించి తెలుసుకోండి!

ఇది చ‌ద‌వండి: టిడిపి నేత ప‌ట్టాభిపై కారుదాడి, ‌గాయాలు

ఇది చ‌ద‌వండి: అచ్చెన్నాయుడు అరెస్టు | నిమ్మాడ‌లో ఉద్రిక్త‌త

 

చ‌ద‌వండి :  Current Shock accident | ఐదు పాడి గేదెలు మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *