CM KCR Visiting The New Secretariat Workes | నూతన సచివాలయం నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం కొత్త సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించారు. సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్ని కొద్ది సేపు కలియ దిరిగారు. అక్కడ నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజెన్సీ ప్రతినిధులతో మాట్లాడారు. పనులు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ప్రధాన గేట్‌తో పాటు, ఇతర గేట్లు నిర్మించే ప్రాంతాలను, భవన సముదాయం నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించారు. డిజైన్లను పరిశీలన చేశారు. నిర్మాణాల్లో పనుల వేగం పెంచాలని, అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, తదితర అధికారులు ఉన్నారు.
ఇది చదవండి: ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఇది చదవండి:పంచాయతీ ఎన్నికలు జరిగే జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల వివరాలు