CM KCR clarity On KTR as next CM? : సీఎం మార్పుపై కేసీఆర్ ఉగ్రరూపం!
CM KCR clarity On KTR as next CM? :Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది నెలలుగా వార్తల్లో పుంకానుపుంకలుగా తెలంగాణలో కొత్త సీఎం కేటీఆర్, ఈటెల రాజేందర్ అంటూ వస్తున్న ఆరోపణలపై సీఎం కేసీఆర్ మౌనం వీడారు. ఆదివారం తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. మరో పదేళ్లు నేనే సీఎంగా ఉంటానని పార్టీ మంత్రి వర్గం సాక్షిగా తేల్చి చెప్పారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, ఎమ్మెల్యేలు అనవసర వ్యాఖ్యలు చేయవద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ నెల 12వ తేదీ నుంచి టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో 50 వేల సభ్యుత్వాలు చేయాలని ఆ బాధ్యత ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు తీసుకోవాలని సూచించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని తెలిపారు. టిఆర్ఎస్ మేయర్ అభ్యర్థిని ఎన్నిక రోజే షీల్డ్ కవర్ ద్వారా మేయర్ అభ్యర్థిని తెలియజేస్తామని ప్రకటించారు.
సీఎం గురించి మాట్లాడితే ‘బండకేసి కొడతా’!
సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్వరూపం ప్రదర్శించారు. ఇకపై సీఎం మార్పు గురించి మాట్లాడితే ‘బండకేసి కొడతా’ అని హెచ్చరిం చారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్న ఈటెల రాజేందర్, ఎర్రబెల్లి, పద్మారావు, శ్రీనివాస్ గౌడ్లను గట్టిగా మందలించారు. సీఎం కేసీఆర్ ఉగ్రరూపాన్ని చూసిన పార్టీ నాయకులు, మంత్రులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. అనవసరంగా మాట్లాడొద్దని ఎమ్మెల్యేలకు, మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు. నేతలెవ్వరూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడొద్దని, బయట నుంచి వచ్చే వార్తలను ఖండించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను అధికారంలోనే ఉండగానే ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారా? అంటూ గర్జించారు. ఇంకో సారి ఆయన సీఎం, ఈయన సీఎం అని ఎవరైనా అంటే పార్టీ నుండి పీకేస్తానని అన్నారు. వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఆగం కావద్దనే సీఎం అయ్యాయని అన్నారు.నేను రాజీనామా చేయాలని కోరుకుంటున్నారా? అని పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించారు.

ఆరోపణలు శృతి మించడంతోనే!
కొంత కాలంగా సీఎం కేటీఆర్ అంటూ వస్తున్న ఊహాంగనాల నేపథ్యంలో అసలు బయట ఏమి ప్రచారం జరుగుతున్నదో , ఎవరు ఏమి మాట్లాడుతున్నారో, ఎలా స్పందిస్తూ ఉన్నారో అన్నింటినీ సీఎం కేసీఆర్ పరిశీలించినట్టు తెలుస్తోంది. వాస్తవంగా 2018 ఎన్నికల నాటి నుంచే తన స్థానంలో సీఎంగా కేటీఆర్‌ను ఉంచాలనే వార్తలు అప్పటిలోనే బహిరంగమయ్యాయి. సీఎం గా కేటీఆర్‌ను ఉంచి, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతారని ప్రచారం జరిగింది. అయితే 2018, 2019 లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అంచనాలు తారుమారు కావడంతో ఢిల్లీలో తన పాత్ర లేదని కేసీఆర్ నిర్థారించుకున్నట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణమే తన రాజకీయ శాశ్వత తల్లిగా నిర్ణయించుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ ఆయనను నిరాశపరిచింది.
ఢిల్లీకి వెళ్లి వచ్చి మౌనంగా ఉన్న కేసీఆర్!
జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసి తర్వాత ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ, అమిత్‌షాలను కలిసి వచ్చారు. అప్పటి నుండి మౌనంగానే ఉన్నారు. సీఎం మార్పు విషయమై పక్కా వ్యూహంతోనే, సందేహాలు, అనుమానాలు, ఊహాగనాలు, వదంతులు బయటకు వచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం మార్పు వార్తలు తారాస్థాయికి పోవడంతో ఆదివారం పార్టీ సమావేశంలో నేనే సీఎంగా ఉంటాను అంటూ తెగేసి చెప్పారు. అయితే కేటీఆర్ సీఎం కాబోతున్నారని బహిరంగ స్టేట్మెంట్లు ఇచ్చిన మంత్రుల సంగతి ఏమిటి? అనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది.
CM KCR clarity On KTR: రాష్ట్ర రాజకీయాల్లో
ఆసక్తికరంగా మారిన వైనం!
ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ స్వయాన ఆ పార్టీ మంత్రులే మాట్లాడటంతో రాష్ట్ర రాజకీయాల్లో ఇదో ఆసక్తికరమైన అంశంగా ఇప్పటి వరకు కొనసాగింది. కేటీఆర్‌కు సొంత పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా జై కొడుతూ వచ్చారు. సొంత పార్టీ నేతలే బహిరంగ వేదికలపైన వ్యాఖ్యానించడం పట్ట సీఎం కేసీఆర్ కు చిర్రెత్తిన ట్టయ్యింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఒకడుగు ముందుకేసి కాబోయే సీఎంకి అభినందనలు అంటూ సభాముఖంగా బహిరంగంగానే ప్రకటించడంతో మరింత బలం చేకూరినట్ట య్యాయింది. ఇక కేటీఆరే సీఎం, ముహూర్తం కూడా ఖరారు అయినట్టు ప్రచారం సాగింది. అయితే ఈ కథ తెర వెనుక మాత్రం కేసీఆర్ మార్క్ ఉంటుందన్న ప్రచారం కొనసాగుతుంది. ఏదేమైనా సీఎం కేసీఆర్ మాత్రం మరో పదేళ్లు సీఎంగా ప్రకటించుకోవడం ఆ పార్టీ నేతల్లో బలంగా పాతుకుపోయినప్పటికీ, సీఎం మార్పు విషయంలో మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్ ఉగ్రరూపాన్ని ప్రత్యక్షంగా చూసి షాక్ తిన్నట్టయ్యింది.

ఇది చదవండి:మరో పవన్ కళ్యాణ్ లా వస్తున్న ఉప్పెన వైష్టవ్ తేజ్
ఇది చదవండి:బ్లాక్ మెయిల్‌కు పాల్పడిన మాజీ విలేఖరి అరెస్టు
ఇది చదవండి:కార్పొరేట్ సంస్థల సేవకుడు మోడీ!
ఇది చదవండి:ఇంక్యూబేషన్ సెంటర్లతో ఉద్యోగావకాశాలు: గవర్నర్
ఇది చదవండి:నిగ్గదీసి అడగటానికి నీకెందుకు భయం?
ఇది చదవండి:10న నల్గొండకు సీఎం కేసీఆర్
ఇది చదవండి: సమస్యాత్మక గ్రామాల్లో పర్యటించిన ఎస్పీ రవీంద్రబాబు