Telangana agriculture

Telangana agriculture: dalitha bandhu స‌రే..మోసం జ‌ర‌గ‌కుండా చూడ‌గ‌ల‌రా?: వ్యవసాయ కార్మిక సంఘం

Spread the love

Telangana agriculture: ఖమ్మం: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం మంచికంటి మీటింగ్ హాల్లో సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అర్హులందరికీ దళిత బందు వర్తింపజేయాలని కూలీల అందరికీ కూలి బందు కూలి బీమా పథకం తేవాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్ సిఐటియు జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వర రావు డి హెచ్ పి ఎస్ రాష్ట్ర నాయకులు మంద వెంకటేశ్వర్లు మాట్ల‌డారు.(Telangana agriculture)

సీఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం మోసపూరిత పథకంగా మిగలకూడదని అర్హులైన దళితులు అందరికీ దళిత బంధు పథకం అమలు చేయాలని అన్నారు. కాంట్రాక్టర్ లేబర్ ని పర్మినెంట్ ఉద్యోగాలు మారుస్తానని గతంలో ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలుగా మిగిలాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి దళితులు గిరిజనులు పేదల అభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయించి సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా ఉండాల‌ని అన్నారు.

స‌మావేశంలో మాట్లాడుతున్న పొన్నం వెంక‌టేశ్వ‌ర‌రావు

ఇప్పటికైనా ఈ దళిత పథకం దళితులను మోసం చేసే పథకంగా ఉండకూడదని వారు కేసీఆర్కి హితవు పలికారు. ఈ నెల 19, 20 తేదీల్లో మండల కేంద్రాల్లో రౌండ్టేబుల్ సమావేశాలు జరపాలని, నెలాఖరు వరకు గ్రామస్థాయిలో సమావేశాలు జరిపి దళితులను కూలీలను ఐక్యం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు మల్సూర్, పి సంగయ్య, బందెల వెంకయ్య, వి నాగేశ్వరరావు, బంధం శ్రీను, మత్స్య కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ పగడాల నాగేశ్వరరావు, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భూక్య కృష్ణ ,సిఐటియు జిల్లా నాయకులు మాచర్ల గోపాల్, కెవిపిఎస్ జిల్లా నాయకులు విద్యాసాగర్, యుటిఎఫ్ జిల్లా నాయకులు కె రమేష్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు కూరపాటి శ్రీనివాస్, జిల్లా ఎకడమిక్ సెల్ కన్వీనర్ బండారు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

MLA Seethakka: తెలంగాణ‌లో నీళ్లేవూ..నిధులూ లేవూ!

MLA Seethakka | నీళ్లు, నిధులు నియామ‌కాలు అనే వాదంలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ‌లో నీళ్లు లేవు, నిధులు లేవు, నియామ‌కాలు లేవ‌ని 1200 మంది విద్యార్థుల Read more

NIA: Nursing స్టూడెంట్ను Maoistల్లో చేర్పించారా? మూడేళ్న త‌ర్వాత న్యాయ‌వాది ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

NIA | రాష్ట్ర రాజ‌ధాని హైదారాబాద్‌లో ప‌లువురు లాయ‌ర్లు, సామాజిక కార్య‌క‌ర్త‌ల ఇళ్ల‌ల్లో ఎన్ఐఏ గురువారం సోదాలు చేసింది. గ‌తంలో క‌నిపించ‌కుండా పోయిన న‌ర్సింగ్ విద్యార్థిని రాధ Read more

Maha Annadanam: ఖ‌మ్మం న‌గ‌రంలో Saibaba mandirలో మ‌హా అన్న‌దాన కార్య‌క్ర‌మం

Maha Annadanam | ఖ‌మ్మం న‌గ‌రంలో గురువారం Khanapuram హ‌వేలి విజ‌య‌న‌గ‌ర్ కాల‌నీ లో షిరిడీ Sai Baba మందిరం 15వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ఉద‌యం నుండి Read more

Hyundai Company: తెలంగాణ‌లో భారీ పెట్టుబ‌డి పెట్ట‌నున్న పెద్ద కంపెనీ!

Hyundai Company | తెలంగాణ రాష్ట్రానికి మ‌రో భారీ పెట్టుబ‌డి వ‌చ్చింది. World Economic Forum స‌మావేశాల నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్తో స‌మావేశ‌మైన హ్యుండై గ్రూప్ గురువారం Read more

Leave a Comment

Your email address will not be published.