Teenmar Mallanna Padayatra I MLC Elections I తీన్మార్ మ‌ల్ల‌న్న‌గెలుపు షురూ అయ్యేనా?

ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా మ‌ల్ల‌న్న‌కు పెరుగుతున్న మ‌ద్ద‌తు!

వ‌రంగ‌ల్: తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో జ‌ర్న‌లిస్టు, క్యూ న్యూస్ అధినేత‌ తీన్మార్ మ‌ల్ల‌న్న సంచ‌ల‌నంగా మారారు. ఖ‌మ్మం, న‌ల్గొండ‌, వ‌రంగ‌ల్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న తీన్మార్ మ‌ల్ల‌న్న ప్ర‌జ‌ల‌కు చెప్పిన విధంగానే జ‌న‌గాం నుంచి భ‌ద్రాచ‌లం వ‌ర‌కు పాద‌యాత్ర చేప‌ట్టారు. మ‌ల్ల‌న్నకు ప్ర‌తి గ్రామంలోనూ, పట్ట‌ణంలోనూ ప్ర‌జ‌లు, మేధావులు, ప‌లు సామాజిక కార్య‌క‌ర్త‌లు స్వాగ‌తం ప‌లుకుతున్నారు. రాష్ట్రంలో ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై రోజుకో సంచ‌లంనంతో క్యూ న్యూస్ లో ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తున్న తీన్మార్ మ‌ల్ల‌న్న పై ప్ర‌భుత్వం ఎన్ని ఒత్తిళ్లు, కేసులు న‌మోదు చేసినా భ‌య‌ప‌డ‌కుండా పోరాడుతున్న తీరు తెలంగాణ ప్ర‌జానికాన్ని ఆలోచింప చేసింది. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డి 7 సంవ‌త్స‌రాలు కావ‌స్తున్న సామాన్య మాన‌వుడికి తెలంగాణ‌లో ఒరిగిందేమీ లేదంటూ టిఆర్ఎస్ ప్ర‌భుత్వంపై మ‌ల్ల‌న్న రాజ‌కీయ విమ‌ర్శ‌లు ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. మ‌ల్ల‌న్న పాద‌యాత్ర‌లో అడుగ‌డున బ‌హుజ‌న స‌మ‌స‌మాజ  స్థాప‌న‌కు కృషి చేసి పోరాడిన ఎంద‌రో మ‌హ‌నీయుల‌కు నివాళ్ల‌ర్పిస్తూ , మ‌ద్ద‌తు దారుల‌తోనూ, ప్ర‌జ‌ల‌తో , అభిమానుల‌తోనూ జై..జైలు ప‌లుకుతున్న విధానంలో తెలంగాణంలో ఇంకా యుద్ధం మిగిలే ఉంద‌న్న సంకేతాలు వినిపిస్తున్న సంద‌ర్భంగా తీన్మార్ మ‌ల్ల‌న్న త‌న పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల‌కు ఏం చెబుతున్నారు? త‌న గెలుపు త‌థ్య‌మేనా? అనేది ఒక‌సారి మ‌ల్ల‌న్న మాట‌ల్లోనే చ‌దువుదాం..!

Teenmar Mallanna Paadhayatra 

జ‌న‌గాంలో న‌వంబ‌ర్ 1వ తేదీన మొట్ట‌మొద‌టి ప్ర‌స‌గంలో తీన్మార్ మ‌ల్ల‌న్న మాట్లాడుతూ ..”జ‌న‌గామ న‌డిగ‌డ్డ‌మీద నిల‌బ‌డి తీన్మార్ మ‌ల్ల‌న్న ఏంచెబ్త‌డు. అస‌లు ఎందుకోసం వ‌చ్చిండు. ఆయ‌న ఉద్ధేశ్యం ఏంది?ఆయ‌న ఎందుకు ప్ర‌తిరోజూ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తాఉంట‌డు. త‌ప్పు చేసిన వారిని ఎందుకు  బెదిరిస్తా..ఉంట‌డు అని కూడా మీకు ఆలోచ‌న వ‌చ్చి ఈడ నిల‌బ‌డ్డ‌రు. ఇవ్వ‌న్నీటికి నేను స‌మాధానం చెబుతున్నా, చెప్ప‌బోతున్నా ముందుగాల‌.” 

”మిత్రులారా! ఇప్ప‌టి దాకా ఉమేష్ చంద్ర‌న్న మాట్లాడి తీన్మార్ మ‌ల్ల‌న్న ముఖ్య‌మంత్రి అవుత‌డ‌ని చెప్తున్న‌డు. తీన్మార్ మ‌ల్ల‌న్న ముఖ్య‌మంత్రి కావ‌డానికో, మంత్ర‌లు కావ‌డానికో తిరుగ‌త‌లేడు. ఈ ప్ర‌జ‌ల‌ను రాజులుగా చేయ‌డానికి తిరుగుతున్నాడు త‌ప్ప‌(ప్ర‌జ‌ల హ‌ర్ష‌ధ్వ‌నుల మ‌ధ్య‌) నా కోసం తిర‌త‌లేను.”

”ఈ ప్ర‌జ‌లు ఇవాళ అణ‌గారిన వ‌ర్గాల ప్ర‌జ‌లు అన్ని ర‌కాల కులాలో ఉన్న‌టు వంటి పేద‌వాళ్ల‌ను, ఈ రాష్ట్ర ప్ర‌భుత్వం దోపిడి చేసి కేవ‌లం ఒక‌టే కుటుంబం బ్ర‌తుకుతున్న‌టు వంటి సంద‌ర్భంలో ఈ 5 ల‌క్ష‌ల కోట్ల బ‌డ్జెట్‌లో నా పేద వాళ్ల వాటా ఎటు పోయింది?  నిరుద్యోగుల వాటా ఎటుపోయింది? అని ప్ర‌శ్నించ‌డం కోసం వ‌చ్చినా!”

చ‌ద‌వండి :  Mallu Bhatti fire : పేద‌ల‌కు ఇచ్చిన జీవోల‌తో భూములు ఆక్ర‌మ‌ణ‌

”మిత్రులారా! ఈ వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ‌, ఖ‌మ్మం ప‌ట్ట భ‌ద్రుల ఎన్నిక ఒక ఆయుధం. ఇక నేను ఒక‌రొక‌రు గురించి చెప్పుకొస్తా. ఈ ఎన్నిక‌ల్లో ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి గారు అని ఒక డ‌మ్మీ క్యాండెట్ వ‌స్త‌డు. ఆయ‌న డ‌మ్మీ క్యాటెండ్ ఎట్ల‌నో చెప్తా. టిఆర్ఎస్ అభ్య‌ర్థి కోదండ‌రామి రెడ్డి అన్న సంగ‌తి మీ అంద‌రికీ తెలుసా మీకు. కోదండ‌రామిరెడ్డి గారు టిఆర్ఎస్ అభ్య‌ర్థి అని మీకు తెలుసా?  సాక్షి టివి ఆఫీసులో జ‌రిగిన కుట్ర ఇది. ఒక టివి చాన‌ల్ ఆఫీసులో విజ‌య‌సాయి రెడ్డి స‌మ‌క్షంలో అటువైపు ఒకాయిన ఇటు వైపు ఒకాయ‌న రూపం మార్చుకొని కేసీఆర్ వ‌స్తున్నాడ‌ని చెప్పిన‌. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రిగిన మీటింగ్ కు సంబంధించిన కుట్ర‌ను కూడా నేను బ‌య‌ట పెట్టిన‌.”

”మిత్రులారా ! ఇక ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి గారు  గెలిస్తే చ‌ట్ట‌స‌భ‌ల్లో ఇంకో క‌ట్ట‌ప్ప ఉంట‌డు త‌ప్ప ఇంకేమైనా అయిత‌దా?  కోదండ‌రాం గారు గెలిస్తే గింత‌క‌న్న గొప్ప రాజ‌కీయం ఏమైనా మాట్లాడ‌త‌డా?  తీన్మార్ మ‌ల్ల‌న్న గెలిస్తే… ల‌క్ష‌లాది గొంతులా ఆడ ఉంట‌ది?  మైక్ ఈయ్య‌క‌పోతే మాట్ల‌డ‌త‌డు? అది తీన్మార్ మ‌ల్ల‌న్న‌. తీన్మార్ మ‌ల్ల‌న్న గెలిస్తే నిరుద్యోగులు గెలిచిన‌ట్టు, ప్ర‌భుత్వ ఉద్యోగులు గెలిచిన‌ట్టు, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు గెలిచిన‌ట్టు,ప్రైవేటు యాజ‌మాన్యాలు గెలిచిన‌ట్టు, ప్ర‌తి స‌మ‌స్త మానువుడు గెలిచిన‌ట్టు తీన్మార్ మ‌ల్ల‌న్న గెలిస్తే. ఏం చెబుతాఉన్న‌డు తీన్మార్ మ‌ల్ల‌న్న..గెలిస్తే ఎవ‌రికైనా ప‌ద‌వీ కాలం ఎన్ని రోజులు ఉంట‌ది. ఎమ్మెల్సీ అయితే ఆరేళ్లు, ఎమ్మెల్యే అయితే ఐదేళ్లు. తీన్మార్ మ‌ల్ల‌న్న ఏంచెబుతుండూ ఆరేళ్లు కాదు. రెండున్న‌రేళ్లు నేను ప‌నిస‌క్క‌గా చేయ‌క‌పోతే రాజీనామా చేసి మీకిచ్చి పోతావున్నా అంటున్న‌. ఈ ద‌మ్ము, ధైర్యం ఎవ‌రికైనా ఉందా చెప్ప‌డానికి. రెఫ‌రెండానికి నేను రెడీ అని ప్ర‌క‌టించినా!”

”మిత్రులారా! తీన్మార్ మ‌ల్ల‌న్న ల‌క్ష్య‌మేంది?  నేను ఇంట్లో అన్నీ ఒదిలేసుకున్నా. అన్నీ ఒదిలేసుకొని ఒక్క‌నిగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఇయ్యాలా!ఎందుకొచ్చినా ఈ రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తునటువంటి కుట్ర‌లు, కేసీఆర్ చెబుతాఉన్న‌డు ల‌క్షా 59 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేశామ‌ని చెబుతాఉన్న‌రు. చేసిరా ఎక్క‌డన్న ఉద్యోగాలు. ఒక వేళ ల‌క్షా 59 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తే ఈ జ‌న‌గామ చౌరాస్తాకు ఆ ల‌క్షా 59 వేల‌ను పిలువు.మ‌ళ్లీ నీ గురించి మాట్ల‌డ‌నిగ‌. ఇట్లా ర‌క‌ర‌కాలుగా మోసం చేస్తున్న‌రు. మొన్న‌నే ఇక్క‌డ‌కు వ‌చ్చిపోయిండు. ఏం చెబుతున్న‌రు వ‌చ్చి. కేంద్ర ప్ర‌భుత్వం పింఛ‌ను ఇస్తుందంటే నేను రాజీనామా చేసిపోతా అని చెప్పిండు. నువ్వు నిరుద్యోగుల పొట్ట గొట్టిన‌వ‌ని నిరూపిస్తా రాజీనామా చేద్దువుదా.” 

చ‌ద‌వండి :  Telangana లో Summer Holidays ప్ర‌క‌టించిన విద్యాశాఖ‌

”నీవు మా పేదోళ్ల గొంతు కోసిన‌వ‌ని చెబుతున్నా రాజీనామా చేద్దువుదా?  మా ప్ర‌భుత్వ ఉద్యోగుల పీఆర్‌సీని నాశ‌నం చేసిన‌వు రాజీనామా చేద్దువు దా..!ఈ రోజు ప్ర‌తి ఎమ్మెల్యే పేదోళ్ల భూముల‌ను క‌బ్జా చేస్తున్న‌రు. అన్నా మీరొక్క‌సారి చూడుర్రి. కేసీఆర్ ఒక ప్ర‌క్క‌న ఉంటే మేమంతా ఒక ప‌క్క ఉన్నాం. ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఏం చేస్తున్నాయో మీ అంద‌రికీ తెలుసు. అమ్ముడుపోతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో భూ కుంభ‌కోణం బ‌య‌ట పెట్టింది ఎవ‌రూ తీన్మార్ మ‌ల్ల‌న్న బ‌య‌ట‌పెట్టాడు. అనేక కుంభ‌కోణాలు బ‌య‌ట పెట్టిన‌, అందుక‌నే ప్ర‌జ‌లారా మీ బిడ్డ మ‌ల్ల‌న్న ఉన్న‌డు. మీకు ఏ ఆప‌ద వ‌చ్చినా మా బిడ్డ మ‌ల్ల‌న్న ఉన్న‌డు అని చెప్పుర్రి. మ‌ల్ల‌న్న టీంకు ఫోన్ చేయ్యిరి.” అంటూ ప్ర‌సంగాన్ని ముగించారు తీన్మార్ మ‌ల్ల‌న్న‌. 

Teenmar Mallanna Paadhayatra 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *