Teenmaar Mallanna Press Meet

Teenmaar Mallanna Press Meet : తెలంగాణ‌లో యుద్ధం మిగిలే ఉందంటున్న తీన్మార్ మ‌ల్ల‌న్న

తెలంగాణ‌

త‌న‌కు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు!
టిఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించుతాం!
నాగార్జునసాగ‌ర్ ఉప ఎన్నిక‌లో పోటీ?

Teenmaar Mallanna Press Meet : Nalgonda : నాకోసం అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డి ప‌నిచేసి ఓటు వేసిన నా సోద‌రుల‌కు, ఉద్యోగుల‌కు , మేధావులుకు ధ‌న్య‌వాదాలు చేస్తున్నాన‌ని తెలంగాణ ఎమ్మెల్సీ స్వ‌తంత్య్ర అభ్య‌ర్థి తీన్మార్ మ‌ల్ల‌న్న(Teenmaar Mallanna) అన్నారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు త‌ర్వాత టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి ప‌ల్లా రాజేశ్వ‌ర రెడ్డి గెలుపు ఖాయం కావ‌డంతో శ‌నివారం మీడియా స‌మావేశంలో తీన్మార్ మ‌ల్ల‌న్న మాట్లాడారు.

ముందుగా ఎమ్మెల్సీగా ఎన్నికైన ప‌ల్లా రాజేశ్వ‌ర రెడ్డికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. త‌న‌ను న‌మ్మి త‌న వెంట న‌డిచిన ప్ర‌తి ఒక్క‌రూ తాను గెల‌వాల‌ని ఎంతో క‌ష్ట‌ప‌డ్డార‌ని పేర్కొన్నారు. ఓట‌మి వ‌చ్చిన‌ప్ప‌టికీ నైతికంగా తాము ప్ర‌జ‌ల్లో గెలిచామ‌ని తీన్మార్ మ‌ల్ల‌న్న అన్నారు. ప‌ల్లా రాజేశ్వ‌ర రెడ్డి దొంగ ఓట్ల‌తో, 100 కోట్ల‌తో గెలుపొందార‌ని ఆరోపించారు. టిఆర్ఎస్ ప్ర‌భుత్వంపై ఇంకా యుద్ధం జ‌రుగుతూనే ఉంటుంద‌ని అన్నారు. ఈ ఎన్నిక‌ల్లో ఒక సాధార‌ణ వ్య‌క్తిగా అధికార ప‌క్షానికి గ‌ట్టి పోటీ నివ్వ‌డానికి కార‌ణం కేవ‌లం ప్ర‌జ‌లేన‌ని, త‌న వెంట ప్ర‌జ‌లు ఉన్నార‌ని తెలిపారు. కేవ‌లం 3శాతం ఓట్లతోనే తాము గెల‌వ‌లేక‌పోయామ‌ని ఆ మూడు శాతం ఓట్లు దొంగ ఓట్లేన‌ని అవి ప‌ల్లా రాజేశ్వ‌రి రెడ్డికి ప‌డ్డాయ‌ని అన్నారు.తాము ఎన్నిక‌ల ముందునుంచే దొంగ ఓట్లు సృష్టిస్తున్నార‌ని ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కు ప‌లు మార్లు ఫిర్యాదు చేశామ‌ని అన్నారు. ఈ దేశంలో డా. బిఆర్ అంబేద్క‌ర్ ఇచ్చిన రాజ్యంగం ప్ర‌కారం ప్ర‌తి ఒక్క‌రూ పోటీ లో నిల‌బ‌డ‌వ‌చ్చ‌ని, ఓటు మాత్ర‌మే కాద‌ని ప్ర‌తి ఒక్క‌రూ రాజ‌కీయ నాయ‌కుడిగా కావాల‌నేదే త‌న ధ్యేయ‌మ‌న్నారు.

యుద్ధం మిగిలే ఉంది తెలంగాణ‌లో..

తెలంగాణ రాష్ట్రంలో ఇంకా యుద్ధం మిగిలే ఉంద‌ని త‌మ పోరాటం రెట్టింపు చేస్తామ‌ని తీన్మార్ మ‌ల్ల‌న్న అన్నారు. తాము కేవ‌లం రాజ‌కీయాల్లో 10 శాతం మాత్ర‌మే ప‌నిచేశామ‌ని, మిగిలిన 90 శాతం భ‌విష్య‌త్తు రాజ‌కీయాల్లోకి రాబోతున్నామ‌ని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌తి సామాన్య వ్య‌క్తి రాజ‌కీయాల్లోకి రావాల‌ని, రానున్న ప‌దేళ్ల‌లో తెలంగాణ సీఎం సీటులో ఓ సామాన్యుడు కూర్చునే విధంగా త‌మ పోరాటం ఉంటుంద‌న్నారు. త‌న ఓట‌మితో త‌న‌కు స‌హ‌క‌రించిన ప్ర‌తి సోద‌రుడు, ఉద్యోగులు, మేధావులు ఎవ్వ‌రూ అధైర్య ప‌డ‌వ‌ద్ద‌ని, త‌మ‌కు ప్ర‌జ‌లు మంచి మ‌ద్ధ‌తు ఇచ్చార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఒక సామాన్య వ్య‌క్తి ఈ రోజు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు న‌డిచే విధంగా త‌మ‌కు ప్ర‌జ‌లు స‌హ‌కారం అందించార‌న్నారు.

ఇప్ప‌టికైనా విప‌క్షాల ధోర‌ణి మార్చుకోవాలి!

ఈ ఎన్నిక‌ల‌తోనైనా విప‌క్ష పార్టీలు త‌మ ధోర‌ణి మార్చుకోవాల‌ని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాల పార్టీల పాత్ర ప్ర‌జ‌లు చేస్తున్నార‌ని, ప్ర‌తిప‌క్షాలు మాత్రం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై గ‌ట్టిగా గ‌ళ‌మెత్త‌డం లేద‌న్నారు. ఈ ఎన్నిక‌ల్లో ఓ సామాన్యుడు పార్టీల క‌తీతంగా వ‌చ్చి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతో అధికార పార్టీకి గట్టిపోటీ ఇవ్వ‌డం చూసైనా ప్ర‌తిప‌క్ష పార్టీలు త‌మ ధోర‌ణిలో మార్చులు చేసుకోవాల‌న్నారు. ప్ర‌జల స‌మ‌స్య‌ల‌పై పోరాడాల‌న్నారు. టిఆర్ఎస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించేందుకు త‌న‌తో ఏ పార్టీ వ‌చ్చినా తాను క‌లిసి పోరాడ‌తామ‌న్నారు. అంతే కానీ తాను మాత్రం ఏ పార్టీలోనూ చేర‌బోన‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌కు మీడియా స‌పోర్టు కూడా చాలా త‌క్కువగా ఉంద‌ని, కేవ‌లం ప్ర‌జ‌లు సోష‌ల్ మీడియా వేదిక‌గానే త‌న గ‌ళాన్ని ప్ర‌పంచానికి తీసుకెళ్లార‌ని, తాను 1600 కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేసిన‌ప్పుడు ఏ ఒక్క ప్ర‌ధాన మీడియా యాజమాన్యం కూడా స‌హ‌క‌రించ‌లేద‌ని అన్నారు. ఖ‌ద్ద‌రు చొక్కా వేసుకొని కారులో దిగిన వాడే నాయ‌కుడు కాద‌ని, సామాన్య‌డు కూడా నాయ‌కుడ‌వుతాడ‌నే న‌మ్మ‌కం త‌మ ఎన్నిక‌ల్లో తేలింద‌ని ఇది మీడియా గ‌మ‌నించాల‌ని సూచించారు.

Teenmaar Mallanna Press Meet
ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతున్న తీన్మార్ మ‌ల్ల‌న్న‌

నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో పోటీ!

క‌చ్చితంగా నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో పోటీ చేయ‌డానికి త‌మ బృందంతో చ‌ర్చ‌లు జరుపుతామ‌ని అన్నారు. తాను పోటీ చేయాలా? త‌మ టీంలో ఒక‌రిని పోటీ చేపించాలా? అనేది త్వ‌ర‌లో చెబుతామ‌న్నారు. ఇక భ‌విష్య‌త్తు రాజ‌కీయాల్లో తెలంగాణ‌లో ఏ ఎన్నిక జ‌రిగినా తీన్మార్ మ‌ల్ల‌న్న టీం పోటీ చేస్త‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లు గ‌ట్టి బుద్ధి చెప్పార‌నేది ప్ర‌త్య‌క్షంగా తేలింద‌న్నారు. ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి గెలుపు కేవ‌లం డ‌బ్బుతోనూ, దొంగ ఓట్ల‌తోనే జ‌రిగింద‌ని ఆరోపించారు. ఇక నుంచి ఎప్ప‌టిలాగానే త‌మ పోరాటం కొన‌సాగిస్తామ‌ని, ప్ర‌జ‌లు ఇచ్చిన మ‌ద్దతుతో మ‌రింత ఉత్సాహంగా ప్ర‌జ‌ల్లోకి వెళ‌తామ‌న్నారు. తీన్మార్ మ‌ల్ల‌న్న టీం కేవ‌లం రాష్ట్రంలో 10 శాతం మాత్ర‌మే ఉంద‌ని, దానిని 100 శాతం చేసేందుకు రానున్న కాలంలో అనేక కార్యాచ‌ర‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తామ‌న్నారు. త‌న‌కు మ‌ద్ద‌తు తెలిపిన ప్ర‌తి ఒక్క తెలంగాణ బిడ్డ‌కు, మీడియా మిత్రుల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్టు ముగించారు.

Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *