teenmaar mallanna: నిరుపేద తల్లి కలను నెరవేర్చిన తీన్మార్ మల్లన్న|గృహ ప్రవేశం చేసిన తీన్మార్ మల్లన్న
teenmaar mallanna: నిరుపేద తల్లి కలను నెరవేర్చిన తీన్మార్ మల్లన్న|గృహ ప్రవేశం చేసిన తీన్మార్ మల్లన్నHyderabad: తెలంగాణ బిడ్డ..ప్రజల తరపున దెబ్బలాడే గొంతుక.. అన్యాయాన్ని నిగ్గదీసే దమ్మున్నజర్నలిస్టు, క్యూ న్యూస్ అధినేత, ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ఓ నిరుపేద కుటుంబం ఆశను నెరవేర్చారు.
కరోనా సమయంలో ఎంతో మంది కూడు, గుడ్డ లేక నిరాశ్రాయులైన పేద ప్రజల్లో ఒక కుటుంబం అన్నా అంటూ తీన్మార్ మల్లన్నను కొద్ది నెలలు కిందట ఆశ్రయించింది. ఒక ఒంటరి మహిళ తన కొడుకు, కూతురుతో కలిసి వచ్చి తీన్మార్ మల్లనకు తన బాధలు చెప్పుకుటూ కన్నీటి పర్యాతమైంది. ఇద్దరు పిల్లలతో కనీసం తలదాచుకోవడానికి ఇల్లు కూడా సరిగ్గా లేని ఆ కుటుంబాన్ని తీన్మార్ మల్లన్న స్వయంగా వెళ్లి పరిశీలించారు. నడుం ఒంచుకని ఆ డేరాలో కి ప్రవేశించి దయనీయ పరిస్థితుల్లో ఉన్న తల్లీ పిల్లల జీవన స్థితి గతులను చూసి చలించిపోయారు.
తన క్యూ న్యూస్ ఛానల్ ద్వారా సమాజానికి ఆ తల్లి పడుతున్న బాధలను బహిరంగంగా తెలియజేశారు. ప్రతి రోజూ తీన్మార్ మల్లన్న వార్తలు చూస్తున్న ప్రజలు, అభిమానులు తమ వంతుగా ఆ కుటుంబం పడుతున్న బాధలు చూశారు. ఆ తల్లికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్కు డబ్బులు పంపించారు. ఒక్క తీన్మార్ మల్లన్న పిలుపు కు యావత్తు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ స్పందన వచ్చింది. ఆ తల్లి ఇల్లు కట్టుకునేందుకు కావాల్సిన డబ్బులు సమకూరాయి. మళ్లీ ఆ కుటుంబం తీన్మార్ మల్లన్నకు ధన్యవాదాలు తెలిపేందుకు రెండ్రోజుల అనంతరం మల్లన్నను కలిసింది. తీన్మార్ మల్లన్న ఆమెకు ఇల్లు కట్టుకునేందుకు కావాల్సిన సామాగ్రిని తీసుకొచ్చుకునేందుకు తన వంతుగా సహాయం చేశారు. అప్పుడు ఆ ఒంటరి తల్లి తాను ఇల్లు కట్టుకున్న తర్వాత ప్రారంభించడానికి రావాలని కోరింది.
గృహ ప్రవేశం చేపించిన తీన్మార్ మల్లన్న
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న తీన్మార్ మల్లన్న ఆ నిరుపేద కుటుంబానికి ఇల్లు నిర్మాణానికి సహాయ పడ్డారు. ఆదివారం ఆమె ఇంటి గృహ ప్రవేశానికి తీన్మార్ మల్లన్న సైన్యంకు ఆహ్వానం పలకడంతో తీన్మార్ మల్లన్న వెళ్లి రిబ్బన్ కటింగ్ చేశారు. తొలుత గృహంలోకి అడుగు పెట్టగానే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా.బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం కొత్త ఇంటిలోకి ప్రవేశించిన ఆ నిరుపేద కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేశారు. తీన్మార్ మల్లన్న చేసిన మేలుకు ఆ నిరుపేద తల్లి భావోద్వేగంతో ఆనంద భాష్పాలు రాల్చింది. తీన్మార్ మల్లన్న సైన్యం ఆ ఇంటిలో కుటుంబంతో కలిసి భోజనం చేసి వారి జీవితాల్లో తన వంతు వెలుగును నింపారు. అనంతరం తీన్మార్ మల్లన్న చేసిన కృషికి యావత్తు తెలుగు రాష్ట్రాల ప్రజలు, అభిమానులు తీన్మార్ మల్లన్నకు జేజేలు పలికారు. ఈ అద్భుతమైన దృశ్యం హైదరాబాద్ నగరంలో నాగోలులోని సాయినగర్ బస్తీలో కనిపించిన పండగ వాతావరణంగా చెప్పవచ్చు.
సాయం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు: తీన్మార్ మల్లన్న
తన పోరాడానికి మద్దతు తెలుపుతూ నిత్యం తనకు అండగా ఉన్న ప్రజలకు, అభిమానులకు తీన్మార్ మల్లన్న ధన్యవాదాలు తెలిపారు. ఓ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని తన క్యూన్యూస్ ద్వారా ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు స్పందించిన తీరు ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ రోజు ప్రజల కృషి వల్లనే ఈ నిరుపేద కుటుంబం ఒక మంచి ఇంటిలో ఉన్నదని చెప్పారు.
ఆ నిరుపేద కుటుంబాన్ని ఆదుకునేందుకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిరుపేద ఇంటికి తెలంగాణ సీఎం కేసీఆర్ కు అంకింతం చేస్తున్నానని అన్నారు.ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి ఇలాంటి నిరుపేదల బాధలను చూడాలని, వారి సమస్యలను పట్టించుకోవాలని కోరారు. ఎంతో మంది అభ్యాగులు నిరాశ్రయులుగా మిగిలి ఉన్నారని, వారందరికీ ఇళ్లు కట్టుకునేందుకు స్థలం ఇచ్చి పట్టాలు ఇవ్వాలన్నారు.
అనంతరం తీన్మార్ మల్లన్న సాయినగర్ బస్తీ రావడంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. సమీప ప్రజలు, స్థానికులు తీన్మార్ మల్లన్నకు ధన్యవాదాలు తెలిపారు. స్థానికుల సమస్యలను తీన్మార్ మల్లన్న వద్ద చెప్పుకున్నారు. తమకు న్యాయం చేసేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇది చదవండి: తెలంగాణ రైతు గళం వినిపిద్ధాం : రేవంత్ రెడ్డి