Technical Analysis

Technical Analysis: స్టాక్ మార్కెట్ టెక్నిక‌ల్ అనాల‌సిస్ అంటే ఏమిటి?

stock market course
Share link

Technical Analysis: ఏ Stock ను ఎప్పుడు కొనాలి? ఎప్పుడు అమ్మాలి? ఎందుకు కొనాలి? మ‌నం కొన్న స్టాక్‌ను ఎంత కాలం త‌రువాత అమ్మాలి? మొద‌ల‌గు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలిపేది టెక్నిక‌ల్ అనాల‌సిస్‌. ఏ స్టాక్‌ను అనాలోచితంగా కొని, న‌ష్టాలు పాలు కాకుండా కాపాడే సాధ‌నం Technical Analysis అనిశ్చిత‌మైన ర‌హ‌దారిలో మ‌నం నిర్ధిష్ట‌మైన గ‌మ్యానికి చేర‌డానికి కారులో ప్ర‌యాణిస్తుంటే, కారుకి హెడ్‌లైట్స్ ఎంతో అస‌వ‌రం.

ఈ హెడ్‌లైట్స్ లేకుంటే మ‌న కారు దారి త‌ప్ప‌డం కాని, ఏదైనా వాహ‌నాన్ని ఢీ కొన‌డం కాని జ‌రుగుతుంది. అదే విధంగా Technical Analysis కూడా మార్కెట్‌లో మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. ఇంకా వివ‌రంగా చెప్పాలి అంటే ఒక స్టాక్ యొక్క Price ఇప్పుడు ఏ విధంగా ఉంది. గ‌తంలో ఏలా ఉంది, భ‌విష్య‌త్తులో ఎలా ఉండ‌గ‌ల అవ‌కాశం ఉన్న‌దో మొద‌ల‌గు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌గ‌లిగేదే టెక్నిక‌ల్ అనాల‌సిస్ ఈ టెక్నిక‌ల్ అనాల‌సిస్ అనేది చాలా విస్తృత‌మైన స‌బ్జెక్ట్‌.

టెక్నిక‌ల్ అనాల‌సిస్‌లో ముఖ్య‌మైన‌వి ట్రెండ్ లైన్స్‌, స‌పోర్టు మరియు రెసిస్టెన్స్‌, ఛార్ట్ పాట‌ర్న్స్‌, క్యాండిల్ స్టిక్ ఛార్ట్ పాట‌ర్న్స్ మూవింగ్ అవ‌రేజ‌స్‌, ఫిజోనస్సి రేషియో మ‌రియు Technical Indicators, వీటిలో ఒక్కొక్క‌రు ఒక విధ‌మైన ప‌ద్ధ‌తిని ఎన్నుకొని దాని ద్వారా మార్కెట్‌లో మంచి లాభాలు పొందుతుంటారు. మీరు ఏ ప‌ద్ధ‌తిని ఎన్నుకున్నా దానిలో నిష్టాతులు ఐన‌చో మంచి లాభాలు పొంద‌డానికి వీలు ఉంటుంది. ఈ టెక్నిక‌ల్ అనాల‌సిస్ గురించి మీరు మ‌రింత వివ‌రంగా తెలుసుకోవాలి. అంటే నేను వ్రాసిన‌, టెక్నిక‌ల్ అనాల‌సిస్ ఛార్ట్ పాట‌ర్న్స్‌, టెక్నిక‌ల్ అనాల‌సిస్ క్యాండిల్ స్టిక్ ఛార్ట్ పాట‌ర్న్స్ 1, 2 పుస్త‌కాల‌ను చ‌ద‌వండి.

See also  Make Money in Stock Market : స్టాక్ మార్కెట్ నుండి డ‌బ్బు సంపాదించాల‌నుకునే వారికి చ‌క్క‌టి విశ్లేష‌ణ‌!

Leave a Reply

Your email address will not be published.