techie women suicideనెల్లూరు: ఆసుపత్రిలో సాప్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏపీలోని నెల్లూరు జిల్లా రాజేంద్రన గర్లో చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ సిఐ కనకయ్య కథనం మేరకు నెల్లూరుకు చెందిన సుదీప్తి (27) అవివాహిత. బండ్లగూడజాగీర్లోని అపార్ట్మెంట్లో ఉంటూ ఓ కంపెనీలో సాప్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఈ నెల 6న అనారోగ్యంతో ఆమె స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లింది. మూడు రోజులుగా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె ఆసుపత్రి నుండి డిశ్చార్జి కావాల్సి(techie women suicide) ఉంది.
ఆ రోజు ఉదయం 9 గంటల సమయంలో సుదీప్తి గదిలోకి నర్సు వెళ్లగా లోపలి నుంచి తలుపు గడియపెట్టుకొని ఉంది. సిబ్బంది తలుపు బద్దలు కొట్టి లోపలికెళ్లి చూశారు. సుదీప్తి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి తల్లి బెంగళూరులో ఆమె సోదరుడు దగ్గర ఉంటోంది. వెంటనే ఆసుపత్రి నిర్వాహకులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!