tech updates | ఇండియాలో టెక్నాలజీ వార్తలు అప్డేట్స్ గురువారం ఇలా ఉన్నాయి. సెర్చ్ ఇంజన్ అయిన గూగుల్ కొన్ని కాల్ రికార్డింగ్ యాప్‌లపై నిషేధం విధించింది. ఎయిర్టెల్ యూజర్లు(tech updates) అలెర్ట్‌గా ఉండాలని సూచించింది. జియో పైబర్ గుడ్ న్యూస్ తెలిపింది.
కాల్ రికార్డింగ్ యాప్‌లపై Google నిషేధం
థర్డ్ పార్టీకి చెందిన కాల్ రికార్డింగ్ యాప్‌లపై గూగుల్ నిషేధం విధించనుంది. May 11th నుంచి థర్డ్ పార్టీ యాప్‌లపై నిషేధం అమల్లోకి రానుంది. ఇటీవల ప్లేస్టోర్ పాలసీలో మార్పులు చేసిన గూగుల్. థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్‌లపై నిషేధం విధించాలని నిర్ణయించింది. దీంతో Play store నుంచి ఆ యాప్‌లను తొలగించడంతో పాటు మే 11 నుంచి వాటిల్లో కాల్ రికార్డింగ్‌లు చేసుకోకుండా గూగుల్ చేయనుంది.
స్టార్టప్స్ కోసం Microsoft Special Program
స్టార్టప్స్ కోసం చేయూత అందించేందుకు టెక్ దిగ్గజం మైక్రోసాప్ట్ 2 ప్రత్యేక కార్యక్రమాలు తీసుకొచ్చింది. మైక్రోస్టాప్ట్ AI ఇన్నోవేట్ సెకండ్ ఎడిషన్‌లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే, సాప్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ స్టార్టప్స్ నుంచి నామినేషన్లు ఆహ్వానిస్తోంది. 10 వారాల పాటు నిర్వహించే కార్యక్రమంలో ఆయా విభాగాల్లో Skill Dovelopment, స్టార్టప్ కార్యకలాపాల విస్తర్ణపై సూచనలు, శిక్షణ ఇవ్వనుంది.
Airtel యూజర్లకు అలెర్ట్
తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను సవరించిన ఎయిర్టెల్, ఆయా ప్లాన్లలో భాగంగా ఉచితంగా అందించే అమోజాన్ ఫ్రైమ్ సబ్స్క్రిప్షన్ గడువును తగ్గించింది. రూ.499, రూ.999, రూ.1199, రూ.1599 ప్లాన్లలో ఇకపై 6 నెలలు మాత్రమే అమోజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ అందనుంది. ఏప్రిల్ 1 తర్వాత రీఛార్జ్ చేసుకున్న వారికి ఈ నిబంధనలు అమలు కానుండగా, ఏప్రిల్ 1 కంటే ముందు రీఛార్జ్ చేసుకున్న వారికి మాత్రం పాత రూల్స్ వర్తించనున్నాయి.
గుడ్‌న్యూస్ చెప్పిన JIO FIBER
వినియోగదారులను ఆకర్షించేలా జియో ఫైబర్ తీపికబురును అందించింది. పోస్ట్‌పెయిడ్ విభాగంలో ఎంట్రీ ఫీజుతో పాటు ఇన్స్టలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీనికి తోడు రూటర్, ఇన్స్టలేషన్ ఉచితంగా ఇస్తామని తెలిపింది. అటు నెలకు రూ.399, రూ.699 ప్రత్యేక ప్లాన్లను తీసుకొచ్చిన జియో ఫైబర్ అదనంగా రూ.100 చెల్లించి ఆరు Appsలు, రూ.200 చెల్లించి 14 యాప్‌లను వాడుకోవచ్చని పేర్కొంది.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి