TDP Volunteers అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వాలంటీర్ల వ్యవస్థపైన పలు విమర్శలు చేసిన టిడిపి ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుని పార్టీ క్యాడర్లో ఉత్సహాన్ని నింపే ప్రయత్నం చేస్తుంది. వైఎస్.జగన్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామ- వార్డు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రస్తుతం వారి ద్వారానే ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే వైఎస్సార్సీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించారంటూ పలుమార్లు టిడిపి(TDP Volunteers) విమర్శించింది. ఏపీలో ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థను వాడుకుంటోందంటూ ఆరోపణలు సైతం చేసింది. టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
టిడిపి వాలంటర్లీ నియామకం
ప్రతీ 100 మంది ఓటర్ల బాధ్యతను ఒకరికి కేటాయిస్తూ టిడిపి వాలంటర్లీను నియమించనున్నట్టు తెలిపారు.జరగబోయే ఎన్నికల్లో ఆషామాషీ కాదని చెబుతూనే ఢీ అంటే ఢీ అనే విధంగా ఎదుర్కొనే వారిని పార్టీ అభ్యర్థులుగా ఉండాలని స్పష్టం చేశారు. అలా ఉండలేని వారు ప్రక్కకు వెళ్లాలని సూచించారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ వివరిస్తూనే గ్రామ, వార్డు కమిటీల నియామకం ఈ నెల 15లోగా మండల, క్లస్టర్ బూత్ కమిటీల నియామకం పూర్తి చేయాలని నిర్ణయించారు. బూత్‌లలో ప్రతి వంద మంది ఓటర్ల బాధ్యత ఒకరికి అప్పగించాలని పేర్కొన్నారు.
పూర్తి స్థాయిలో వాలంటీర్లు(TDP Volunteers) వారే!
ప్రతి బూత్ పరిధిలోని 100 మందికి సంబంధించి పార్టీ పరంగా బాధ్యతలు కేటాయించిన వారే చూసుకోనున్నారు. వారితో కనెక్టయి పార్టీకి అనుకూలంగా ఓటు వేయించటంలో వారు కీలక పాత్ర పోషించేలా పార్టీ కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు ప్రతి ప్రభుత్వ పథకం అందించడంతో పాటుగా వారి సమస్యల పైనా స్పందిస్తున్నారు. దీంతో వాలంటీర్లు తమకు కేటాయించిన వారి వరకు గుర్తింపు లభిస్తోంది. ఇప్పుడు టిడిపి సైతం వాలంటీర్ల వ్యవస్థకు పోటీగా ఆ పార్టీ వాలంటీర్లను రంగంలోకి దించే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.


రాజకీయంగా కీలకంగా మారిన వాలంటీర్లు
ఇప్పుడు ఏపీలో వాలంటీర్లే రాజకీయంగా కీలకంగా మారారు. ఇక సచివాలయం వాలంటీర్లు ఒకవైపు, టిడిపి వాలంటీర్లు ఒకవైపు ఫీల్డలో దిగనున్నారు. ఇప్పుడు పార్టీకి వాలంటీర్లుగా పనిచేసిన వారినే టిడిపి అధికారంలోకి వస్తే పనిచేసిన వారిని పార్టీ అధికారంలోకి వస్తే వారినే వాలంటీర్లుగా నియమిస్తామంటూ చెప్పాలని ఆ నాయకులకు దిశ, నిర్దేశం చేశారు పార్టీ అధినేత. అయితే ఇప్పటికే పలువురు వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రొబేషన్ పూర్తియి ఉంది. వారు అధికారికంగా ప్రభుత్వ ఉత్తర్వుల కోసం నిరీక్షిస్తున్నారు. దీనిపైన టిడిపి ఏరకమైన క్లారిటీ ఇవ్వనుందో అందుకు ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తో చూడాల్సి ఉంది.
- Company IPO: కంపెనీ ఐపిఓలను ఎందుకు జారీ చేస్తుంది?
- Technical Analysis: స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ అంటే ఏమిటి?
- trailing stop loss:ట్రైలింగ్ స్టాప్‌లాస్ ఎలా ఉపయోగించాలి? | stock market
- stock market cycle: స్టాక్ మార్కెట్ సైకిల్, స్టేజెస్
- Munugode By Elections 2022: నా త్యాగం మునగోడు అభివృద్ధికి శ్రీకారమంటున్న రాజగోపాల్ రెడ్డి!