Razole Constituency : పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాకు టిడిపి మ‌ద్ద‌తు!

Razole Constituency : పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో

జ‌న‌సేనాకు టిడిపి మ‌ద్ద‌తు!

Razole:  తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు నియోజ‌క‌వ‌ర్గం మ‌గ‌ట‌ప‌ల్లి గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌లో తెలుగుదేశం పార్టీ జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. జ‌న‌సేన నాయ‌కులు బొలిశెట్టి జ‌గ‌దీష్ స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి ఈ గ్రామ స‌ర్పంచ్ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ గ్రామంలో టిడిపి అభ్య‌ర్థిని పోటీకి నిల‌ప‌కుండా జ‌న‌సేన అభ్య‌ర్థికి రాష్ట్ర టిడిపి కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి, జిల్లా ప‌రిష‌త్ మాజీ ఛైర్మ‌న్ నామ రాంబాబు మ‌‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌న్నాహ‌క స‌మావేశంలో నామ‌న రాంబాబు ప్ర‌సంగం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

జ‌న‌సేన‌కే నా మ‌ద్ద‌తు : రాంబాబు

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఓట‌మి పాలైనా రాజోలు(Razole Constituency)లో జ‌న‌సేనను గెలిపించుకుని స‌త్తా చాటిన జ‌న‌సైనికుల‌ను ఆయ‌న అభినందించారు. గ‌త ఎన్నిక‌ల‌లో జ‌న‌సేన‌తో పొత్తు లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే టిడిపి ఓడిపోయింద‌ని ఆయ‌న గుర్తు చేశారు. జ‌న‌సేన‌తో పొత్తు లేక‌పోతే తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల్లో టిడిపి అభ్య‌ర్థుల‌కు డిపాజిట్లు కూడా ద‌క్క‌వ‌ని, తాను, చిన రాజ‌ప్ప ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు కు కూడా చెప్పామ‌ని తెలిపారు. ప్ర‌తి పంచాయ‌తీలోను టిడిపి అభ్య‌ర్థుల‌ను పోటీ పెట్టాల‌ని చంద్ర‌బాబు నాయుడు చెబుతున్నార‌ని, అయినా తాను జ‌న‌సేన‌కే మ‌ద్ద‌తు ఇస్తాన‌ని రాంబాబు చెప్పారు. అవ‌స‌ర‌మైతే త‌న ప‌ద‌వికి కూడా రాజీనామా చేస్తాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఇది చ‌ద‌వండి: ఎమ్మెల్యే ధ‌ర్మారెడ్డిపై అట్రాసిటీ కేసు న‌మోదు చేయాలి

ఇది చ‌ద‌వండి:గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్‌గా Vivek Yadav బాధ్య‌త‌లు స్వీక‌ర‌ణ‌

ఇది చ‌ద‌వండి: వైద్య అవినీతిపై సీఎస్ ఆదిత్య‌నాధ్ దాస్‌ ఆరా?

ఇది చ‌ద‌వండి: 7న రాష్ట్ర‌ప‌తి రామ‌నాథ్ కోవింద్ రాక‌

ఇది చ‌ద‌వండి:యూనివ‌ర్శిటీ వైస్ చాన్స‌ల‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయాండి: గ‌వ‌ర్న‌ర్‌

ఇది చ‌ద‌వండి:తెలంగాణ స‌ర్కార్ బంప‌ర్ ఆఫ‌ర్‌

ఇది చ‌ద‌వండి:నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి ఖాతాలోకి గోక‌రాజుప‌ల్లి

ఇది చ‌ద‌వండి:మొట్ట మొద‌టి సారి మెట్రోలో గుండె త‌ర‌లింపు!

ఇది చ‌ద‌వండి: స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ (మెడిక్లాసిక్‌) పాల‌సీ గురించి తెలుసుకోండి!

 

చ‌ద‌వండి :  Defamation : ఆంధ్ర‌జ్యోతిపై ప‌రువు న‌ష్టం దావా | Andhra Jyothi Daily Paper

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *