TDP President

TDP President: ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని ప్ర‌వ‌ర్తించండి లేక‌పోతే..?అంటున్న అచ్చెన్న‌!

Spread the love

TDP President: అమ‌రావ‌తి: కృష్ణాజిల్లా నూజివీడులో టిడిపి కార్య‌క‌ర్త‌లు మంచోడు జీబీ మ‌ణి, కుంకునోళ్ల నాగ‌బాబుపై వైసీపీ గుండాలు చేసిన దాడిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్య‌క్షులు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ముష్క‌రులు ఒళ్ళు ద‌గ్గ‌ర పెట్టుకుని ప్ర‌వ‌ర్తించాల‌ని హెచ్చ‌రించారు. ముష్క‌రుల మాదిరిగా దారి కాచి టిడిపి కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. త‌క్ష‌ణ‌మే నిందితుల‌పై కేసు న‌మోదు చేసి శిక్షించాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. వైసీపీ నేత‌ల‌కు ప‌ట్టిన దాడుల దాహాన్ని త్వ‌ర‌లోనే తీరుస్తామ‌ని అచ్చెన్నాయుడు అన్నారు.

టిడిపి వారితో ఎందుకు పెట్టుకున్నామా? అని దిగులు ప‌డే రోజులు ద‌గ్గ‌ర్ల‌లోనే ఉన్నాయ‌ని అన్నారు. బాధితులు దాడి చేసిన వారిపై కేసు పెడితే పోలీసులు కేసు న‌మోదు చేయ‌క‌పోవ‌డం ఆక్షేప‌నీయ‌ మ‌న్నారు. తిరిగి బాధితుల‌పైనే కేసులు పెట్టే వింతైన సాంప్ర‌దాయానికి ఏపీ పోలీసులు నాంది ప‌లికార‌న్నారు. పోలీసులు వేసుకుంది నీలి చొక్కాలు కాద‌ని, ఖాకీ చొక్కాల‌న్న విష‌యం గుర్తుంచుకోవాల‌న్నారు. శాంతి భ‌ద్ర‌త‌ల ప‌ట్ల డీజీపీకి విశ్వాసం ఉంటే ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అరాచ‌కాల‌పై విచార‌ణ జ‌రిపి నిందితుల‌ను శిక్షించాల‌ని అచ్చెన్నాయుడు అన్నారు.

Nuzvid Covid Cases: నూజివీడు డివిజన్ లో కొత్తగా 168 కోవిడ్ కేసులు

Nuzvid Covid Cases నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు డివిజన్ లో 28వ తేదీన కోవిడ్ కేసులు పెద్దఎత్తున నమోదయ్యాయి. 28వ తేదీ ఒక్కరోజే 168 కోవిడ్ Read more

sheep thief: ప‌ది రూపాయ‌ల బ‌జానాతో 135 గొర్రెలు అప‌హ‌ర‌ణ ఎక్క‌డంటే?

sheep thief నూజివీడు: కృష్ణాజిల్లా లో వింత మోసం వెలుగు చూసింది. జిల్లాలోని విస్స‌న్న‌పేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో 10 రూపాయ‌ల బ‌జానా ఇచ్చి రూ.15 ల‌క్ష‌ల Read more

road accidents: చిత్తూరు-అన్న‌మ‌య్య జిల్లాలో రోడ్డు ప్ర‌మాదాలు!

road accidents | చిత్తూరు-అన్న‌మ‌య్య జిల్లాల్లో గురువారం జ‌రిగిన వేర్వేరు రోడ్డు ప్ర‌మాదాల్లో ప‌లువురి గాయ‌ప‌డ‌గా ఇద్ద‌రు మృతి చెందారు. ఈ ప్ర‌మాదాల్లో గాయ‌ప‌డిన వారిని ఆసుప‌త్రుల‌కు Read more

Nandigama Circle: చీర‌తో బిగించి నిండు గ‌ర్భ‌ణీ భార్య‌ను హ‌త్య చేసిన భ‌ర్త‌

Nandigama Circle | ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండ‌లం Gollamudi గ్రామంలో హ‌త్య ఘ‌ట‌న సంచ‌ల‌నం రేపింది. గ్రామానికి చెందిన భూ ల‌క్ష్మికి అనారోగ్యం బాగాలేద‌ని కార‌ణంతో Read more

Leave a Comment

Your email address will not be published.