Yadlapati Venkatarao | గుంటూరు జిల్లాలో పేరందిన ప్రముఖ టిడిపి సీనియర్ నేత యడ్లపాటి వెంకట్ రావు సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. యడ్లపాటి వెంకటరావు 1967లో గుంటూరు జిల్లా వేమూరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978లో కాంగ్రెస్ పార్టీలో చేరి అదే సంవత్సరం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978-80 సంవత్సరంలో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు యడ్లపాటి(Yadlapati Venkatarao).
1983లో టిడిపి పార్టీలో చేరారు. 1995లో గుంటూరు జడ్పీ ఛైర్మన్గా పనిచేశారు. 1998లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. యడ్లపాటి వెంకట్రావు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
యడ్లపాటి వెంకట్రావు 1919 డిసెంబర్ 16న గుంటూరు జిల్లా అమృతలూరు మండలంలోని బోడపాడు గ్రామంలో జన్మించారు. రైతు కుటుంబంలో పుట్టిన యడ్లపాటి తల్లిదండ్రులు రాఘవమ్మ, వెంకటసుబ్బయ్య. గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలో బి.ఎ చదివి 1941 చెన్నైలో లా కాలేజీ చదువుకున్నారు. ఆంధ్రా అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేశారు. అనంతరం న్యాయవాద వృత్తిని అభ్యసించి న్యాయవాది ప్రాక్టీస్ చేశారు. అలవేలు మంగమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ