TDP Leader Nandam Subbaiah Funeral Completed |నందం సుబ్బయ్య అంతిమ యాత్రలో పాల్గొన్న నారా లోకేష్ Proddatur: సంచలనం సృష్టించిన టిడిపి నేత నందం సుబ్బయ్య అంత్యక్రియలు కడప జిల్లా ప్రొద్దుటూరులో గురువారం ఉదయం జరిగాయి. ఇంటి నుంచి స్మశానం వరకు సుబయ్య అంతిమయాత్ర సాగింది. ఈ అంతిమ యాత్రలో టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. యాత్రలో దారిపొడవునా సుబ్బయ్య అమర్‌రహే అంటూ నినాదాలు చేశారు. హత్యకు పాల్పడిన నిందితలను శిక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో సంచలనమైన టిడిపి నేత నందం సుబయ్య హత్య ఘటన తెలుసుకున్న పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులను ఫోనులో పరామర్శించారు. పార్టీ పరంగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం నారా లోకేష్ సుబ్బయ్య కుటుంబ సభ్యులను బుధవారం స్వయంగా వెళ్లి పరామర్శించారు. మీకు మేము ఉన్నామంటూ కుటుంబ సభ్యలను ఓదార్చారు. హత్యకు కారుకులైన నిందితుల జాబితాలో ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది బంగారురెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాధ పేర్లను చేర్చాలంటూ ఆందోళన నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు ఆందోళన కొసాగించారు.
అనంతరం లోకేష్ తో పోలీసులు చర్చలు జరిపి సుబ్బయ్య భార్య వద్ద స్టేట్మెంట్ నమోదు చేశారు. కోర్టు ద్వారా ఈ ముగ్గురి పేర్లను నిందితుల జాబితాలో చేర్చేందుకు అంగీకరించారు. అనంతరం ఆందోళన విరమించిన లోకేష్ రాత్రి అక్కడే బస చేశారు. అనంతరం గురువారం సుబ్బయ్య అంత్యక్రియల్లో పాల్గొన్నారు.


నందం సుబ్బయ్య అంతిమ యాత్రలో
పాల్గొన్న నారా లోకేష్
సంచలనం సృష్టించిన టిడిపి నేత నందం సుబ్బయ్య అంత్యక్రియలు కడప జిల్లా ప్రొద్దుటూరులో గురువారం ఉదయం జరిగాయి. ఇంటి నుంచి స్మశానం వరకు సుబయ్య అంతిమయాత్ర సాగింది. ఈ అంతిమ యాత్రలో టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. యాత్రలో దారిపొడవునా సుబ్బయ్య అమర్‌రహే అంటూ నినాదాలు చేశారు. హత్యకు పాల్పడిన నిందితలను శిక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో సంచలనమైన టిడిపి నేత నందం సుబయ్య హత్య ఘటన తెలుసుకున్న పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులను ఫోనులో పరామర్శించారు. పార్టీ పరంగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అనంతరం నారా లోకేష్ సుబ్బయ్య కుటుంబ సభ్యులను బుధవారం స్వయంగా వెళ్లి పరామర్శించారు. మీకు మేము ఉన్నామంటూ కుటుంబ సభ్యలను ఓదార్చారు. హత్యకు కారుకులైన నిందితుల జాబితాలో ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది బంగారురెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాధ పేర్లను చేర్చాలంటూ ఆందోళన నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు ఆందోళన కొసాగించారు. అనంతరం లోకేష్ తో పోలీసులు చర్చలు జరిపి సుబ్బయ్య భార్య వద్ద స్టేట్మెంట్ నమోదు చేశారు. కోర్టు ద్వారా ఈ ముగ్గురి పేర్లను నిందితుల జాబితాలో చేర్చేందుకు అంగీకరించారు. అనంతరం ఆందోళన విరమించిన లోకేష్ రాత్రి అక్కడే బస చేశారు. అనంతరం గురువారం సుబ్బయ్య అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
నాకు ఎటువంటి సంబంధం లేదు: మున్సిపల్ కమిషనర్
టిడిపి నేత నందం సుబయ్య హత్య కేసులో నిందితుల జాబితాలో పేరు చేర్చడంతో మున్సిపల్ కమిషనర్ అనురాధ మీడియా ఎదుటకు వచ్చారు. సుబ్బయ్య హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. హత్య జరిగినప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న అనురాధ గురువారం మీడియా ఎదుట హాజరయ్యారు. హత్యకు ముందు సుబ్బయ్య తనకు ఫోన్ చేశారని, సుబ్బయ్య వచ్చే సమయానికి సభాస్థలికి దగ్గరలోనే ఉన్నానని చెప్పారు.ఇళ్ల పట్టాల విషయానికి సంబంధించి సుబ్బయ్య తనతో మాట్లాడింది వాస్తవమేనని అన్నారు. గతంలో కూడా సుబ్బయ్య అనేక సార్లు సమస్యలపై తనను కలిశారని అనురాధ తెలిపారు. అయితే ఈ హత్యకు, తనకు ఎటువంటి సంబంధం లేదని, తన పేరు చెప్పడం చాలా అన్యాయమని అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది చదవండి: 2020లో కరోనా రాని దేశాలు!