TDP Leader Murder in Kadapa

TDP Leader Murder in Kadapa at Proddatur| TDP Leader Nandam Subbaiah Murdered టిడిపి నేత దారుణ హ‌త్య‌

Spread the love

TDP Leader Murder in Kadapa

TDP Leader Murder in Kadapa at Proddatur| TDP Leader Nandam Subbaiah Murdered టిడిపినేత దారుణ హ‌త్య‌Proddatur: టిడిపి నేత దారుణ హ‌త్య‌కు గురైన సంఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గంలో సోమ‌ల‌వారి ప‌ల్లి పంచాయ‌తీ ప‌రిధిలో మంగ‌ళ‌వారం చోటుచేసుకుంది. టిడిపి నేత‌ను ప్ర‌భుత్వ ఇళ్ల స్థ‌లాల ప్లాట్ల వ‌ద్ద దుండ‌గులు అతి కిరాత‌కంగా న‌రికి చంపారు. అత్యంత మార‌ణాయుధాల‌తో దాడి చేయ‌డంతో నందం సుబ్బ‌య్య త‌ల చిద్ర‌మైంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని ప‌రిశీలిస్తున్నారు.
నందం సుబ్బ‌య్య క‌డ‌ప టిడిపి జిల్లా అధికార ప్ర‌తినిధిగా వ్య‌వ‌హ‌రిస్తూ రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు చేస్తూ ఇటీవ‌ల సామాజిక మాధ్య‌మాల్లో పోస్టులు పెట్టారు. అదే విధంగా రెండు రోజుల క్రితం టిడిపి ఆధ్వ‌ర్యంలో ప్రెస్‌మీట్ పెట్టి ప్ర‌భుత్వం ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ఆరోప‌ణ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో నందం సుబ్బ‌య్య దారుణంగా హ‌త్య‌కు గురికావ‌డం జిల్లా వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. రాజ‌కీయ కోణంలోనే హ‌త్య జ‌రిగిన‌ట్టు స్థానిక పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్ర‌శ్నించినందుకే హ‌త్య: చంద్ర‌బాబునాయుడు

టిడిపి నేత నందం సుబ్బ‌య్య హ‌త్య‌కు గుర‌వ్వ‌డంతో పార్టీ అధినేత దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. హ‌త్య‌ను తీవ్రంగా ఖండించారు. చేనేత కుటుంబానికి చెందిన సుబ్బ‌య్య హ‌త్య కిరాత‌క చ‌ర్య అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల నాయ‌కుల‌ను భౌతికంగా మ‌ట్టుపెట్ట‌డమే వైసీపీ ల‌క్ష్యంగా పెట్ట‌కుంద‌ని మండిప‌డ్డారు.

ఇసుక అక్ర‌మ ర‌వాణా, క్రికెట్ బెట్టింగ్ లో వైసీపీ ఎమ్మెల్యే, ఆయ‌న బావ‌మ‌రిది పాత్ర‌ను బ‌హిర్గ‌తం చేశాడ‌న్న క‌క్ష‌తోనే సుబ్బ‌య్య‌ను హ‌త‌మార్చార‌ని ఆరోపించారు. ఇళ్ల పట్టాల కార్య‌క్ర‌మం వ‌ద్ద‌కు వెళ్లిన టిడిపి నాయ‌కుడిని హ‌త్య చేయ‌డం సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి సిగ్గు చేట‌ని విమ‌ర్శించారు. జ‌గ‌న్ సీఎం అయ్యాక రాష్ట్రంలో ప్ర‌జ‌లు ప్రాణాల‌కు భ‌ద్ర‌త లేకుండా పోయింద‌ని ఆరోపించారు.

19 నెల‌ల పాల‌న‌లో రాష్ట్రంలో అనేక మంది టిడిపి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లను బ‌లిగొన్నార‌ని విమ‌ర్శించారు. రాష్ట్రాన్ని క్రిమిన‌ల్స్‌కు అడ్డాగా మార్చార‌ని మండిప‌డ్డారు. సుబ్బ‌య్య‌ను హ‌త్య చేసిన వారిని వెంట‌నే ప‌ట్టుకొని క‌ఠినంగా శిక్షించాల‌ని ఆయ‌న కుటుంబానికి న్యాయం చేయాల‌ని చంద్ర‌బాబు నాయుడు డిమాండ్ చేశారు.

TDP Leader Murder in Kadapa

చేనేత వ‌ర్గాల‌కు ర‌క్ష‌ణ లేదు : అనురాధ‌

రాష్ట్రంలో చేనేత వ‌ర్గానికి చెందిన వారికి ర‌క్ష‌ణ లేద‌ని టిడిపి నాయ‌కురాలు అనురాధ అన్నారు. చేనేత వ‌ర్గానికి చెందిన నందం సుబ్బ‌య్య దారుణ హ‌త్య‌కు గుర‌వ్వ‌డంతో వైసీపీ పార్టీపై మండిప‌డ్డారు. వైసీపీ నేత‌లు ఇసుక మాఫియాకు పాల్ప‌డి కోట్ల‌కు కోట్లు దండుకుంటుంటే ఆ విష‌యాన్ని ప్ర‌శ్నించినందుకు సుబ్బ‌య్య‌ను హ‌త్య చేశార‌న్నారు. అదే విధంగా క్రికెట్ బెట్టింగ్‌లు పెట్టి యువ‌త‌ను నాశ‌నం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించినందుకు, ఇళ్ల ప‌ట్టాల పంపిణీ పేరుతో కోట్ల‌కు కోట్లు కొల్ల‌గొడుతున్నార‌ని ప్ర‌శ్నించినందుకు వైసీపీ నాయ‌కులు హ‌త్య చేశార‌ని విమ‌ర్శించారు. వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక రాష్ట్రంలో చేనేత వ‌ర్గంపై దాడులు పెరిగాయ‌ని ఆరోపించారు. ఈ హ‌త్య‌ను తాము తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని అనురాధ‌ అన్నారు.సీఎం జ‌గ‌న్ ఎక్కువ కాలం ప్ర‌భుత్వంలో ఉండ‌లేర‌ని, చేనేత వ‌ర్గం ప్ర‌భుత్వంపై క‌చ్చితంగా పోరాడుతుంద‌ని అన్నారు. వైసీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త పెరిగింద‌ని, త‌మ‌కు ఒక రోజు వ‌స్తుంద‌ని అనురాధ విమ‌ర్శించారు.

అనురాధ మాట్లాడుతున్న వీడియో-

ఇది చ‌ద‌వండి: అభిమానులూ క్ష‌మించండి: ర‌జ‌నీకాంత్‌

 

 

Kurnool News: కర్నూల్ జిల్లాలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం

Kurnool News: క‌ర్నూల్ జిల్లా కౌతాళం మండ‌ల ప‌రిధిలోని కామవ‌రం గ్రామంలో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఓ భూవివాదంలో వైసీపీ, బిజేపీ వ‌ర్గీయులు ప‌ర‌స్ప‌రం దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. Read more

Thota Chandraiah Murder: ఏక‌ద‌శి రోజున‌ మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో ర‌క్తంతో ఎగిసిప‌డ్డ వేట‌కొడ‌వ‌ళ్లు!

Thota Chandraiah Murder: మాచ‌ర్ల: పండుగ వేళ ఏపీలో రాజ‌కీయ హ‌త్య చోటు చేసుకోవ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. గుంటూరు జిల్లాలోని మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి నేత Read more

teacher murderd: క‌దిరిలో బ‌రితెగించిన దొంగ‌లు..ఉపాధ్యాయురాలు హ‌త్య‌

teacher murderd: అనంత‌పురం: క‌దిరిలో దొంగ‌ల బీభ‌త్సం అక్క‌డ ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేస్తోంది. ఓ ఇంట్లోకి ప్ర‌వేశించి ఓ ఉపాధ్యాయురాల‌ని చంపారు దుండ‌గులు. క‌దిరి ప‌ట్ట‌ణంలోని మంగ‌ళ‌వారం Read more

Engineering Student Murdered:ఎట్ట‌కేల‌కు నిందితుడు దొరికాడు..పోలీసుల‌ను చూసి బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మ‌హ‌త్య‌య‌త్నంకు ప్ర‌య‌త్నం!

Engineering Student Murdered:గుంటూరులో బి.టెక్ విద్యార్థిని ర‌మ్య హ‌త్య కేసులో నిందితున్ని అరెస్టు చేసిన‌ట్టు డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ అన్నారు. హ‌త్య జ‌రిగిన 24 గంట‌ల్లోపే గుంటూరు Read more

Leave a Comment

Your email address will not be published.