Atchannaidu Arrest : అచ్చెన్నాయుడు అరెస్టు | నిమ్మాడలో ఉద్రిక్తత
Atchannaidu Arrest : అచ్చెన్నాయుడు అరెస్టు | నిమ్మాడలో ఉద్రిక్తత అరెస్టును ఖండించిన చంద్రబాబు నాయుడు
Srikakulam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఇప్పటి వరకు మాటలతో కొనసాగిన రాజకీయం, ఇప్పుడు దాడులు చేసుకునే విధంగా రూపొందుతున్నాయి. స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ రాష్ట్రంలో ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులు ఇప్పటి నుండే ప్రారంభమయ్యాయి. తాజాగా మంగళవారం ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఉత్తరాంధ్ర ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలలో టిడిపి కార్యకర్తలు, నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు(Atchannaidu) అరెస్టును ఖండించారు. అచ్చెన్నాయుడు అరెస్టు జగన్ రెడ్డి కక్ష సాధింపునకు పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రపై సీఎం జగన్ కక్ష కట్టారని ఆరోపించారు.
40 ఏళ్లలో ఏనాడూ ఉద్రిక్తలు లేవు!
నిమ్మాడలో గత 40 ఏళ్లలో ఏనాడూ ఇలాంటి ఉద్రిక్తతలు లేవని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రశాంతమైన గ్రామంలో ఉద్రిక్తతలు సృష్టించింది ఎవరు? దువ్వాడ శ్రీనివాస్ స్వగ్రామానికి అచ్చెన్నాయుడు వెళ్లాడా? అచ్చెన్న స్వగ్రామానికి దువ్వాడ వచ్చి ఘర్షణలు రెచ్చగొట్టారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయానికి సంబంధించి ఫొటోలు, వీడియోలే సాక్ష్యాధారాలు అని అలాంటిది వాటిని పరిశీలించి దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు పెట్టకుండా అచ్చెన్నాయుడుపై తప్పుడు కేసు పెట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేవారు. ఐపిసి లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు పెడతారా? అచ్చెన్నాయుడుపై మీ కసి తీరలేదా? అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై మండిపడ్డారు.
ప్రశాంతతకు మారుపేరైన ఉత్తరాంధ్రపై పగబట్టి హింసా విధ్వంసాలు చేస్తున్నారని ఆరోపించారు. రామతీర్థం సంఘటనలో కళా వెంకట్రావుపై, నాపై, అచ్చెన్నాయుడిపై కూడా తప్పుడు కేసులు పెట్టారని చంద్రబాబు అన్నారు. కూన రవికుమార్, వెలగపూడి రామకృష్ణబాబు సహా అనేకమంది నాయకులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. సబ్బం హరి ఇంటిని, గీతం విశ్వవిద్యాలయం భవనాలను ధ్వంసం చేశారని చంద్రబాబు పేర్కొన్నారు.
Atchannaidu Arrest : అచ్చెన్నాయుడు చేసిన నేరం ఏమిటి?
గతంలో అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసు పెట్టి 83 రోజులు అక్రమ నిర్భంధం చేశారని అన్నారు. ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని అమానుషంగా 5 జిల్లాల్లో 20 గంటలు 700 కి.మీ తిప్పించి మళ్లీ ఆపరేషన్లకు కారణం అయ్యారన్నారు. అచ్చెన్నాయుడు చేసిన నేరం ఏమిటి? మీ హింసాకాండపై ధ్వజమెత్తడమే అచ్చెన్నాయుడు చేసిన తప్పిదమా? అని ప్రశ్నించారు. దీనికి తగిన మూల్యం సీఎం జగన్ రెడ్డి చెల్లించక తప్పదని అన్నారు. వైసీపీ పుట్టగతులు కూడా లేకుండా పోతుందని, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. తక్షణమే అచ్చెన్నాయుడిని బేషరత్తుగా విడుదల చేయాలని, ఆయనపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.
ఇది చదవండి:సర్వీస్ పర్సన్స్ గోడు వినాలి: ఎఐటియుసి
ఇది చదవండి: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బంధువు కిడ్నాప్,హత్య
ఇది చదవండి:పంచాయతీ తీర్పులో మాజీ సర్పంచ్‌పై కత్తితో
ఇది చదవండి:మదనపల్లె కేసు వాదనకు ముందుకొచ్చిన సుప్రీంకోర్టు న్యాయవాది
ఇది చదవండి:భారత దేశంలో కార్మిక ఉద్యమ చరిత్ర పూర్వ పరిస్థితి!
ఇది చదవండి: జగన్ సన్నిహితులను నిమ్మగడ్డ టార్గెట్ చేశారా?
ఇది చదవండి:సర్పంచ్ అభ్యర్థిగా మహిళా వాలంటీర్ పోటీ ఎక్కడంటే?
ఇది చదవండి:ఎమ్మెల్యే మామయ్యకు అరుదైన గౌరవాన్ని తెచ్చిన ఐపిఎస్ కోడలు!
ఇది చదవండి:కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే కేబినెట్ మారుస్తారా?
ఇది చదవండి:మదనపల్లె హత్యలో దిమ్మతిరిగే ట్విస్ట్