టిడిపి 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
TDP Formation Day : ”సరిగ్గా 40 ఏళ్ల కిందట ఇదే రోజున (సోమవారం) స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. ఆయన కేవలం అధికారం కోసమే పార్టీని స్థాపించలేదు. తెలుగు వారి గుర్తింపు కోసం, తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలని పార్టీని ఏర్పాటు చేశారు. నాడు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలుగు దేశం పార్టీని స్థాపించి ప్రజల ఆదరణలో 9 నెలల్లోనే అధికారం సాధించిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు.” అంటూ జాతీయ అధ్యక్షులు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
సోమవారం టిడిపి 40వ ఆవిర్భావ దినోత్సవ(TDP Formation Day) వేడుకల్లో ఆయన ప్రసగించారు. ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి అని కొనియాడారు. రాజకీయాల నిర్వహచనం మార్చాలనే సంకల్పంతో పాటు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా నాడు అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. నేడు అవే దేశానికి ఆదర్శమయ్యాయన్నారు.


రూ.2 కిలో బియ్యం!
నాడు ఎన్టీఆర్ రూ.2 కిలో బియ్యం ప్రవేశపెడితే నేడు కేంద్రం అదే స్ఫూర్తితో వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోందన్నారు. నాడు ఎన్టీఆర్ రైతులకు అందించే విద్యుత్ కు శ్లాబ్ రేట్ రూ.50 లకి తీసుకువస్తే నేడు వాటన్నింటికి చిల్లు పెట్టి జగన్ మోటర్లకు మీటర్లు పెట్టి రైతులపై భారం మోపేందుకు సిద్ధమయ్యారన్నారు. గుడెసెలో ఉండే ప్రతి పేద వాడికి పక్కా ఇళ్ల నిర్మాణానికి ఎన్టీఆర్ శ్రీకారం చుడితే నేడు కేంద్రం అదే బాటలో ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మాణం చేపడుతోందన్నారు. నాడు మెజారిటీలో ఉన్న ప్రభుత్వాన్ని కుట్రతో రద్ధు చేస్తే కేవలం 30 రోజుల్లో ఎన్టీఆర్ ను మళ్లీ గద్దెనెక్కించిన జాతి మన తెలుగు జాతి అని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రాంతీయ పార్టీ కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా పని చేయడం ప్రతి ఒక్క తెలుగు వాడికి గర్వకారణమన్నారు.
ప్రజల్లో ఆత్మవిశ్వాన్ని పెంచాం!
తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచామని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ప్రారంభించి తెలుగు జాతి కోసం సంపద సృష్టించామన్నారు. యువత భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఐటీని అభివృద్ధి చేసి తద్వారా సైబరాబాద్ నిర్మాణం చేయగలిగామన్నారు. అవుటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టు, జీనోమ్ వ్యాలీలు నేడు రాష్ట్రానికి వచ్చాయంటే నాడు టిడిపి వేసిన బీజాలే నేడు పెరిగి పెద్దదై ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాయన్నారు. జీనోమ్ వ్యాలీ నేడు కోవిడ్ సమయంలో ఉపయోగపడిందంటే దానికి మన ముందు చూపే కారణమన్నారు.
వైసీపీ పాలన దుర్భరంగా మారింది!
ఒకప్పుడు ఏపీలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 3 ఎకరాలు కొనుక్కనేవారు. కానీ నేడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో రెండు ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందని తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడటం చూస్తే వైసీపీ పాలనలో రాష్ట్ర పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థమవుతుందని విమర్శించారు. అమరావతి ద్వారా యువతకు ఉద్యోగాలు, పోలవరం ద్వారా రైతులకు నీళ్లు అందించే విధంగా సంకల్పించి పనులు వేగిరం చేశామన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లామన్నారు. ఒక మనిషి పుట్టక నుంచి చనిపోయేంత వరకూ అనేక పథకాలను అందించామన్నారు. నాడు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మీద ఒత్తిడి తెచ్చామన్నారు.


త్యాగ వీరుల కుటుంబ టిడిపి!
ఈ 39 ఏళ్లలో పార్టీ కోసం ఎందరో కార్యకర్తలు ప్రాణాలు త్యాగం చేశారని చంద్రబాబు నాయుడు అన్నారు. టిడిపి పార్టీ రాష్ట్రం కోసం త్యాగవీరుల కుటుంబమని, కొంత మంది కార్యకర్తలు ఆస్తులమ్ముకున్నారని, జెండాలు మోశారని అయినా పార్టీని వీడలేదని ప్రసగించారు. వారి త్యాగాలను పార్టీ ఎప్పటికీ మరువదని పేర్కొన్నారు. పార్టీ స్థాపించిన 39 ఏళ్లలో 22 ఏళ్లు అధికారంలో ఉన్న ఏకైక పార్టీ తెలుగు దేశం అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నో సందర్భాల్లో వీరోచితంగా పోరాడామన్నారు. చరిత్ర ఉన్నంత వరకూ టిడిపి తెలుగు వారి గుండెల్లో ఉంటుందన్నారు. త్వరలో ఎన్టీఆర్ 100 సంవత్సరాల జన్మదినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరుపుకోనున్నట్టు తెలిపారు.
అప్పు భారం మోపిన వైసీపీ ప్రభుత్వం!
భావితరాల భవిష్యత్ కోసం అధికార పార్టీ పాలన చేయాలి గానీ, దోచుకునేందుకు ప్రయత్నాలు చేయడం బాధకరమని చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 20 నెలల్లోనే లక్షా 70 వేల కోట్లు అప్పు చేసి ప్రతి కుటుంబం మీద రూ.2 లక్షల 50 వేల భారం మోపారని పేర్కొన్నారు. నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ , కరెంట్, విద్యుత్, ఇంటి పన్ను, వృత్తి పన్నులు పెంచారని విమర్శించారు. ఇలా అన్నింటినీ పెంచుకుంటూ పోతూ ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. కోవిడ్ కేసులు పెరిగే రాష్ట్రాల్లో ఏపీ నాల్గో స్థానంలో ఉండటం ఆందోళనకరమన్నారు. ప్రజలకు నాడు ఉచితంగా దొరికే ఇసుక నేడు బంగారమయ్యిందన్నారు.


రాజమండ్రిలో వైసీపీ ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు దళిత డాక్టర్‌ను పిచ్చివాడిగా ముద్ర వేసి అక్రమ కేసులు పెట్టి వేధించారన్నారు. చీరాలలో మాస్క్ పెట్టుకోలేదని మరో దళిత యువకుడిని కొట్టి చంపారన్నారు. మద్యం రేట్లు పెరిగాయని వీడియో పెట్టిన వ్యక్తిని ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించి అతను ఆత్మహత్య కు పాల్పడే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో కనిపించకుండా చేశారన్నారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంంఘన జరుగుతోందన్నారు. రౌడీయిజం రాజ్యమేలుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ఏకపక్షం చేసుకున్నామని విర్రవీగుతున్నారని, నలుగురిని బెదిరించి పార్టీలో చేర్చుకున్నంత మాత్రానా అది బలం కాదని విమర్శించారు. ఒక నాయకుడు పార్టీని వీడితే 100 మంది నాయకుల్ని తాయరు చేసుకునే సత్తా తెలుగుదేశానిదని తెలిపారు.
రాష్ట్రం జగన్ రెడ్డి తాత జాగీరు కాదు!
రెండు బడ్జెట్ లను ఆర్డినెన్స్‌ల ద్వారా ప్రవేశ పెట్టిన ప్రభుత్వాన్ని నా జీవిత చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఎంత ఖర్చు చేశారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? రాష్ట్రం జగన్ రెడ్డి తాత జాగీరు కాదని విమర్శించారు. జవాబుదారీ తనంగా ఉండాల్సిన ప్రభుత్వం అసెంబ్లీలో కనీసం బడ్జెట్ కూడా పాస్ చేసుకోలేక పోతున్నారని పేర్కొన్నారు. 5 రాష్ట్రాల్లో ఎన్నికలున్నా కేంద్రం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు. కానీ జగన్ రెడ్డి మాత్రం అసెంబ్లీలో బడ్జెట్ పెడితే తాము చేసిన అప్పులు, తప్పులు ఎక్కడ బయటపడతాయోనని ఆర్డినెన్స్ తెచ్చారన్నారు. ఏ ఆశయాలతో ఎన్టీఆర్ పార్టీ పెట్టారో ఆ ఆశయాలతో పనిచేస్తామన్నారు. యువత మేలుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతుందో తెలుసుకోవాలని సూచించారు. మరో 30 ఏళ్లకు సరిపడే విధంగా ఈ 3 ఏళ్లలోనే పార్టీని తీర్చిదిద్దుతామన్నారు.
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started