పంచాయతీ ఏకగ్రీవాలు: నందిగామ నియోజకవర్గంలో
టిడిపి ఖాతాలోకి గోకరాజుపల్లి
Nandigama : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ అటు వైస్సార్‌సీపీలోనూ, ఇటు టిడిపి పార్టీలోనూ ఏకగ్రీవాల మద్దతు కొనసాగుతుంది. కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరులుపాడు మండలం గోకరాజు పల్లి పంచాయతీని తెలుగు దేశం పార్టీ సొంతం చేసుకుంది. నియోజకవర్గంలోని తొలి ఏకగ్రీవ


పంచాయతీగా గోకరాజుపల్లి గ్రామం టిడిపి కైవసం చేసుకుంది. సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు మల్లెల శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. మొత్తం 8 వార్డులకు గాను 8 వార్డులను టిడిపి కైవసం చేసుకుంది. సర్పంచ్‌తో పాటు పాలకవర్గానికి నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శుభాకాంక్షలు తెలిపారు.
పర్చూరు గడ్డపైన తొలి ఏకగ్రీవం
ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో గొనసపూడి పంచాయతీని తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. తొలి ఏకగ్రీవ పంచాయతీగా గొనసపూడి ఖరారు అయ్యింది. సర్పంచ్‌గా తెలుగు దేశం పార్టీ సానుభూతిపరులు విక్రమ్ దీప్తి ఎన్నికయ్యారు. సర్పంచ్, ఉప సర్పంచ్


పదవులను తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. మొత్తం 10 వార్డుల్లో టిడిపి 6 వార్డులు, వైసీపీకి 4 వార్డులు దక్కాయి. సర్పంచ్, ఉప సర్పంచ్‌లతో పాటు పాలకవర్గానికి పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు పొద వీరయ్య, బత్తుల శ్రీనివాసరావు, విక్రమ్ నారాయణ, టిడిపి నాయకులను, కార్యకర్తలను అభినందించారు.
ఇది చదవండి:భవనంపై నుంచి పసిపాపతో దూకి తల్లి ఆత్మహత్య
ఇది చదవండి:మొట్ట మొదటి సారి మెట్రోలో గుండె తరలింపు!
ఇది చదవండి: స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ (మెడిక్లాసిక్) పాలసీ గురించి తెలుసుకోండి!
ఇది చదవండి: టిడిపి నేత పట్టాభిపై కారుదాడి, గాయాలు
ఇది చదవండి: అచ్చెన్నాయుడు అరెస్టు | నిమ్మాడలో ఉద్రిక్తత
ఇది చదవండి: సర్వీస్ పర్సన్స్ గోడు వినాలి: ఎఐటియుసి
ఇది చదవండి: పంచాయతీ తీర్పులో మాజీ సర్పంచ్‌పై కత్తితో