road accident : Chittoor: దైవదర్శనానికి వెళుతూ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రక్కన టాటా ఏసీ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ఒకరు మృతి చెందారు. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా ములకల చెరువు మండల పరిధిలోని ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లి మండలం పెంచుపాడు, పిటిఎం మండలం వద్ద కాయలవాళ్లపల్లి కి చెందిన వారు మదనపల్లి నుండి ఆదివారం ఉదయం అనంతపురం జిల్లా కదిరిలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు బయలు దేరారు.
ములకలచెరువు సమీపంలోని జాతీయ రహదారిలో రైల్వే రెండవ గేటు వద్ద వీరు ప్రయాణిస్తున్న టాటా ఏసీ వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న చుట్టుప్రక్కల వారు గాయాలైన వారిని 108 ద్వారా మదనపల్లి, ములకలచెరువులోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. తీవ్ర గాయాలైన నారాయణ (70)ని బెంగుళూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

గాయాలైన వారిలో గోపాల్, అరుణ, జోత్స్న, రామలక్ష్మి, కృష్ణమ్మ, అమరావతి, వెంకట్, లక్ష్మీనరసమ్మ, నరిసింహులు, మోహన్, సునీతలు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న ఎస్ఐ రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయాలు పాలైన వారి బంధువులకు సమాచారం అందజేశారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు తెలిపారు.
ఇది చదవండి:చాపకింద నీరులా సెకండ్ స్ట్రెయిన్ ముప్పు!
ఇది చదవండి:పీఎస్ఎల్వీ సీ-51 రాకెట్ ప్రయోగం విజయవంతం
ఇది చదవండి:బ్రిందలో అరుదైన శస్త్ర చికిత్స
ఇది చదవండి:రైతు గొప్పతనాన్ని తెలిపిన శ్రీకారం మూవీ సాంగ్ సూపర్!
ఇది చదవండి:వెంకన్న సన్నిధిలో భక్తులకు పెద్దపీట!
ఇది చదవండి:బ్లాక్ మెయిల్‌కు పాల్పడిన విలేకర్లు అరెస్టు
ఇది చదవండి:ప్రస్తుతం డిమాండ్ ఎక్కువుగా ఉన్న వాల్ పెయింటింగ్ గురించి తెలుసుకోండి!