Tangirala sowmya: Nandigama ఏమైనా మీ జాగీరా అంటూ ఫైర్ అయ్యారు నందిగామ మాజీ ఎమ్మెల్యే, టిడిపి నాయకురాలు తంగిరాల సౌమ్య. నిన్న నందిగామలో బాధుడే..బాధుడు కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు నాయుడును టార్గెట్‌గా చేసి రాయి విసిరారు. ఇది కాస్త పక్కన ఉన్న చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ కట్టమంచి మధుసూదన్ రావుకు తగిలి గాయమైంది.
నందిగామలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా #చంద్రబాబు నాయుడు పర్యటనలో వైసీపీ గుండాలు పథకం ప్రకారం దాడి చేశారని తంగిరాల సౌమ్య ఆరోపించారు. ఈ మేరకు శనివారం నందిగామ డిఎస్పీని కలిసి నిందితులను వెంటనే శిక్షించాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు పర్యటన ఖరారు అయిన దగ్గర నుడి స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎలాగైనా పర్యటనను అడ్డుకోవాలని చూశారన్నారు.
పోలీసుల మీద తీవ్ర ఒత్తిడి తెచ్చి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు. కానీ సంకల్పం గొప్పది అయితే ప్రకృతి కూడా సహకరిస్తుందని మళ్లీ నిరూపించిందని, చంద్రబాబు బహిరంగ సభ విజయవంతమైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క టిడిపి నాయకునికి, కార్యకర్తకు పాదాభివందనం అంటూ ధన్యవాదాలు తెలిపారు.
అరుణ్ కుమార్ భయపడ్డారు!:Tangirala sowmya
మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్‌పై విమర్శలు చేశారు. నిన్న అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ చూస్తేనే అర్థం అవుతుందని ఎంత భయపడ్డారోనని హెద్దేవా చేశారు. అభివృద్ధి చేసే సంసృతి మాదని, దోచుకునే సంస్కృతి మీదని అన్నారు. తడిగుడ్డలతో గొంతులు కోసే రకం మీరు అని మీ పార్టీ నాయకులే చెబుతున్నారని ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని తంగిరాల సౌమ్య ప్రశ్నించారు.
మూడున్నరేళ్లలో ఏం చేశారు?
తాము సుబాబుల్ రైతులకు టన్నుకు రూ.3500 ఇచ్చే సమయంలో రూ.5000 ఇస్తాం అని పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే ఈ మూడున్నరేళ్లలో ఏం చేశారని సౌమ్య ప్రశ్నించారు. మీరు తలకిందులుగా తపస్సు చేసినా ఈ జనంరారని పేర్కొన్నారు. మా సభకు వచ్చిన జనం బిర్యానీ ప్యాకెట్లకు లేదా రూ.500 కోసం ఆశపడి ఎవరూ రాలేదని అన్నారు. పూల వ్యాపారుల దగ్గర కూడా వసూలు చేసిన చరిత్ర మీదని Tangirala sowmya ఆరోపించారు.

తెలంగాణ నుండి అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్న దాంట్లో అరుణ్ వాటా ఎంత? అని ప్రశ్నించారు. నందిగామ మీ జాగీరు కాదు గుర్తుపెట్టుకోవాలని, సీఎం రోడ్డు చరిత్ర తెలుసుకోవాలని, ఆ రోజు స్వర్గీగ దేవినేని వెంకట రమణ శ్రమదానం పేరిట మొదలు పెట్టి పూర్తి చేసిన రోడ్డు ఇదని నిప్పులు చెలిగారు.