Tampering Allegations

Tampering Allegations: మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌పై ట్యాంప‌రింగ్ ఆరోప‌ణ‌లు?

Telangana

Tampering Allegations హైద‌రాబాద్: తెలంగాణ లో మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌పై ట్యాంప‌రింగ్ ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈసీ వెబ్‌సైట్‌ను ట్యాంప‌రింగ్ చేశార‌ని ఫిర్యాదు రావ‌డంతో పాటు వెబ్‌సైట్‌లో 2 అఫిడ‌ఫిట్స్ అప్‌లోడ్ చేసిన‌ట్టు ఆరోప‌ణ‌లు చేస్తూ మంత్రిపై ఫిర్యాదు వ‌చ్చింది. దీనిపై ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ విచార‌ణ చేప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. 2018 మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో శ్రీ‌నివాస్‌గౌడ్ అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్టు శ్రీ‌నివాస్ గౌడ్‌పై కొంద‌రు ఆరోప‌ణ‌లు చేస్తూ ఫిర్యాదు చేసిన‌ట్టు ఇప్పుడు హాట్ టాపిక్‌గా(Tampering Allegations) మారింది.

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా రెండు అఫిడ‌విట్లు ఆ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన‌ట్టు మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌పై ఫిర్యాదు చేశారు కొంద‌రు. లోపాల‌తో ఉన్న మొద‌టి అఫిడ‌విట్‌ను వెబ్‌సైట్ నుండి తొల‌గించి, నెల‌న్న‌ర త‌ర్వాత స‌వ‌రించిన మ‌రో అఫిడ‌విట్‌ను అప్‌లోడ్ చేసిన‌ట్టు మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. స్థానిక ఎన్నిక‌ల అధికారుల‌తో కుమ్మ‌క్కై ఈసీ వెబ్‌సైట్‌ను ట్యాంప‌రింగ్ చేసిన‌ట్టు ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు అందింది. దీనిపై సీఈఓ కార్యాల‌యం నుంచి కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న్ రిపోర్టు తెప్పించుకున్న‌ట్టు తెలుస్తోంది. అయితే ట్యాంప‌రింగ్ జ‌రిగిందా? లేదా? అనేది సీఈఓ ఇచ్చిన నివేదిక‌ను బ‌ట్టి తెలియాల్సి ఉంది.

మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌

ఈ నివేదిక‌ల ఆధారంగా అంత‌ర్గ‌తంగా సాంకేతిక నిపుణ‌ల‌తో కేంద్ర ఎన్నిక‌ల సంఘం విచార‌ణ జ‌రిపిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఒక వేళ ట్యాంప‌రింగ్‌ను నిజ‌మేన‌ని టెక్నిక‌ల్ బృందం తేలిస్తే ఐపీసీ ఐ.టి చ‌ట్టాల ప్ర‌కారం తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌పై చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంది. గ‌త ఏడాది ఆగ‌ష్టు 2022లో ఇచ్చిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న్ ఇప్పుడు చ‌ర్య‌లు తీసుకోబోతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *