Core Web Vitals Assessment: tamilnadu high court: ఇలా ఉచిత ప‌థ‌కాలు ఇస్తే మీ వ‌ల్లే వారు బ‌ద్ధ‌క‌స్తుల‌వ

tamilnadu high court: ఇలా ఉచిత ప‌థ‌కాలు ఇస్తే మీ వ‌ల్లే వారు బ‌ద్ధ‌క‌స్తుల‌వుతారేమో హైకోర్టు

tamilnadu high courtత‌మిళ‌నాడు: మా పార్టీని గెలిపిస్తే ఇంటికో washing machine..! నన్ను గెలిపిస్తే మ‌హిళ‌ల‌కు ఉచితంగా gold ఇస్తాం! మా అభ్య‌ర్థిని సీఎం చేస్తే ప్ర‌తి ఇంటికీ నెల‌కు రూ.10 వేలు..! ఎన్నిక‌ల్లో ఇలాంటి ఉచిత హామీలు ఎక్కువ‌య్యాయి క‌దా! ప్ర‌స్తుతం ఏ Political Parite చూసినా ఉచితాలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇక త‌మిళ‌నాడులో అయితే లెక్కే లేదంట‌.

ఉచిత T.V ఉచిత A.C, ఉచిత సైకిల్‌, ఉచిత బైక్‌, మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం, ఉచిత కేబుల్ క‌నెక్ష‌న్‌, ఇలా ఒక్క‌టా రెండా, అక్క‌డ అన్నీ (tamilnadu high court)ఉచితాలేనంట‌. ఈ ఉచిత హామీల‌పై మ‌ద్రాస్ హైకోర్టు మండిప‌డింది. ఉచిత ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల‌ను బ‌ద్ధ‌క‌స్తులుగా మారుస్తున్నార‌నీ, ఏ ప‌నీ చేయ‌కుండా త‌యారు చేస్తున్నార‌ని అసంతృప్తి వ్య‌క్తం వ్య‌క్తం చేసింది. త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పార్టీ ప్ర‌క‌టించిన ఉచిత హామీల‌కు వ్య‌తిరేకంగా హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌ల‌య్యింది. ఉద్యోగాలు, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, విద్య‌, వైద్య రంగ అభివృద్ధి, ర‌వాణా, వ్య‌వ‌సాయ రంగాల‌ను ప‌క్క‌న పెట్టి, ఉచిత హామీల‌పైనే అభ్య‌ర్థులు focus పెడుతున్నాని పిటిష‌న్ వాదించారు.

వీటికి క‌ళ్లెం వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. దానిపై విచారించిన జ‌స్టిస్ ఎన్‌.కిరుబ‌క‌ర‌న్‌, జ‌స్టిస్ బి.పుగ‌లెంతినేతృత్వంలోని ధ‌ర్మాస‌నం, ఉచిత ప‌థ‌కాల‌ను తీవ్రంగా త‌ప్పు బ‌ట్టింది. ఉచిత ప‌థ‌కాల వ‌ల్ల ప్ర‌జ‌లంతా సోమ‌రి పోతులుగా మారుతున్నార‌ని అభిప్రాయ‌ప‌డింది. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థులు త‌క్కువ లో త‌క్కువ రూ.20 కోట్లు ఖ‌ర్చు పెడుతున్నార‌ని,biryani, beer కోసం ఓటు వేస్తే, మీ నాయ‌కుడిని ప్ర‌శ్నించే నైతిక హ‌క్కు మీకు ఎక్క‌డుంటుంద‌ని ప్ర‌శ్నించింది. ప్ర‌జా స్వామ్యంలో త‌మ‌కు న‌చ్చిన నాయ‌కుడిని ఎన్నుకునే స్వేచ్చ ప్ర‌జ‌లకుంద‌ని స్ప‌ష్టం చేసింది. త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉచిత colour tv, fan, మిక్స‌ర్ గ్రైండ‌ర్లు, laptop.. వంటి హామీలు ఎక్కువుగా వినిపిస్తున్నాయి.

Anna DMK పార్టీ ఉచిత వాషింగ్ మెషీన్ హామీ కూడా ఇచ్చింది. డీఎంకె, అన్నాడీఎంకే పార్టీలు మ‌హిళ‌ల‌కు రేష‌న్ కోసం ఆర్థిక సాయం చేస్తాయ‌ని కూడా ప్ర‌క‌టించాయి. ఐతే ఈ ఉచిత హామీల సంప్ర‌దాయం కొన‌సాగడం ప్ర‌జ‌ల‌కు ఎంత మాత్ర‌మూ మంచిది కాద‌ని tamilnadu high court అభిప్రాయ‌ప‌డింది. రానున్న రోజుల్లో అన్నం కూడా వండి తినిపిస్తారేమోన‌ని సెటైర్లు వేసింది. ఉచిత హామీల‌ను అవినీతి వ్య‌వ‌హారంగా ప‌రిగ‌ణించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, వీటి వ‌ల‌న ఓట‌ర్లు ప్ర‌భావిత‌మ‌వుతున్నార‌ని అభిప్రాయ‌ప‌డింది. ఉచిత ప‌థ‌కాల వ‌ల్ల త‌మిళ ప్ర‌జ‌లు బ‌ద్ధ‌క‌స్తులుగా మారిపోయార‌ని, అందుకే hotels, సెలూన్‌లు, చివ‌ర‌కు పొలాల్లో ప‌నిచేసేందుకు కూడా ఇత‌ర రాష్ట్రాల నుంచి కూలీల‌ను ర‌ప్పించుకోవ‌ల్సిన ప‌రిస్థితి నెల‌కొంద‌ని మద్రాస్ హైకోర్టు తెలిపింది.

రానున్న రోజుల్లో ఇక్క‌డ స్థిర‌, చ‌రాస్థుల‌కు వ‌ల‌స కార్మికులే య‌జ‌మానులుగా మారిన ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అభిప్రాయ‌ప‌డింది. ఉచిత ప‌థ‌కాలకు సంబంధించి పిటిష‌న‌ర్ పేర్కొన్న 20 ప్ర‌శ్న‌ల‌కు కేంద్ర‌, ఎన్నిక‌ల సంఘం స‌మాధానం చెప్పాల‌ని హైకోర్టు ఆదేశించింది. ఉచిత హామీల‌కు అడ్డుక‌ట్ట వేసే దిశ‌గా ఎలాంటి చ‌ర్య‌లు చేప‌డ‌తారో ఏప్రిల్ 26లోగా చెప్పాల‌ని స్ప‌ష్టం చేసింది.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *