tamil smugglers

tamil smugglers: చెన్నైకు ర‌వాణాకు సిద్ధం ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ ముఠా అరెస్టు

Andhra Pradesh
Share link

tamil smugglers అనంత‌పురం: చెన్నైకు ర‌వాణా చేయ‌డానికి సిద్ధంగా ఉన్న 11 ఎర్ర‌చంద‌నం దుంగ‌ల‌తో పాటు పైల‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న నాలుగు మోటారు సైకిళ్లు, ఒక ఇన్నోవా కారు టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌త్యేక క‌థ‌నం ప్ర‌కారం దుంగ‌ల‌ను టాటాఏసీ వాహ‌నంలో ర‌వాణా చేస్తుండ‌గా అనంత‌పురం రేంజ్ డిఐజి కాంతి రాణా టాటా నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ ఎస్పీ మేడా సుంద‌ర‌రావు ఆదేశాల మేర‌కు డిఎస్పీ ముర‌ళీధ‌ర్ కు స‌మాచారం అందించింది. వెంట‌నే డీఎస్పీ ఆర్ ఐ సురేష్ కుమార్ రెడ్డి టీం, ఆర్ ఎస్ ఐ సురేష్ బృందం తో ఆదివారం తెల్ల‌వారుజామున పుత్తూరు రోడ్డు త‌నిఖీలు (tamil smugglers)నిర్వ‌హించారు.

వ‌డ‌మాపేట మండ‌లం అంజార‌మ్మ క‌నుమ‌లో మాటు వేయ‌గా, రెండు మోటారు సైకిళ్లు వ‌చ్చాయ‌ని డిఎస్పీ ముర‌ళీధ‌ర్ తెలిపారు. వారిని అడ్డ‌గించి విచార‌ణ చేప‌ట్టే క్ర‌మంలో వ‌రుస‌గా టాటా ఏసీ, ఇన్నోవా వాహ‌నాలు వ‌చ్చాయ‌ని, టాటా ఏసీలో ఎర్ర చంద‌నం దుంగ‌లు ల‌భించాయ‌ని తెలిపారు. ఈ వాహ‌నాలు ఇక్క‌డ నిలిచి ఉండ‌టంతో మ‌రో రెండు మోటారు సైకిళ్లు వ‌చ్చాయ‌ని, వాళ్లు కూడా ఇదే ముఠాకు చెందిన వారుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నామ‌ని చెప్పారు. అదుపులోకి తీసుకున్న వారంద‌రూ త‌మిళ‌నా డుకు చెందిన వారేన‌ని అన్నారు. వీరిని త‌మిళ‌నాడు శీర్కాలికి చెందిన బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం(29), తిరువ ళ్లూరు జిల్లా పాకాశాలైకు చెందిన జె.శ‌ర‌వ‌ణ‌న్‌(34), ప‌ల్లిప‌ట్టుకు చెందిన ఎన్‌.రమేష్ (47), ఎస్ ఎం. సంజీవ (27), సి.రాంకీ (29), చెన్నై తిరువేర్కాడుకు చెందిన ఏ.శ్రీ‌జిత్ (43)లుగా గుర్తించిన‌ట్టు తెలిపారు.

వీరు శేషాచ‌లం నుంచి ఎర్ర‌చంద‌నం దుంగ‌లు సేక‌రించి చెన్నై త‌రలిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. వీరి ద్వారా మరింత స‌మాచారాన్ని తెలుసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. వీరి ద్వారా మ‌రింత స‌మాచారాన్ని తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కేసును సిఐ చంద్ర‌శేఖ‌ర్ న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ స‌మావేశంలో డీఎస్పీ తో పాటు, ఆర్ ఐ సురేష్ రెడ్డి, సిఐ చంద్ర‌శేఖ‌ర్‌, ఎఫ్ఆర్ఓ ప్ర‌సాద్‌, ఎస్ఐ మోహ‌న్ నాయ‌క్‌, ఆర్ఎస్ ఐలు సురేష్‌, వినోద్ కుమార్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

See also  Bulla Vijay Kumar: బెజ‌వాడ‌లో నాడు ఎన్టీఆర్ ఫార్ములాను టిడిపిలో మ‌ళ్లీ అమ‌లు చేయ‌నున్నారా?

Leave a Reply

Your email address will not be published.