talk skills | మాట్లాడటం ఒక కళ అయితే వినడం అంతకంటే గొప్ప కళ. మాట్లాడేవారి మనసు మంచిగంధంలా గుబాళిస్తే, వినేవారి హృదయం ఆ మాటల సువాసనలో వికసిస్తుంది. మాట్లాడే ప్రతిమాట(talk skills), ఇచ్చే ప్రతి సలహా విలువైనదిగా ఉండాలి. ఇరుగు పొరుగుతో, బంధుమిత్రులతో, సహోద్యోగులతో పరస్పర అభిప్రాయాలను భావాలను, ఆలోచనలను పంచుకోవడం ఎంతో సహజం. సాధారణంగా ఎవరైనా తమ అనుభవాలు ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడతారు. అదే సందర్భంలో ఆ అనుభవాల నుండి తాము ఏం నేర్చుకున్నామో చెప్పి, కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇస్తుంటారు.
ఇతంతా ఎదుటి వారికి ఉపయోగపడతాయనే ఆలోచనతోనే చేస్తారు. అయితే కొన్నిసందర్భాల్లో ఇది కూడా ప్రమాదమే కావచ్చు. ఎదుటి వారి పరిస్థితిని, సందర్భాన్ని, ఆలోచనను బట్టి మాట్లాడటం అందరికీ చేతనైన విద్య కాదు. సలహాలివ్వడం అన్ని సందర్భాల్లో పనికి రాదు. దీనివల్ల కొన్నిసార్లు అనుకూల స్పందనలు వస్తే, మరికొన్ని సార్లు ప్రతికూల స్పందనలు ఎదురవుతుంటాయి. వివేకం, పట్టుదల, విజ్ఞత ఉన్నవారు సొంతంగా ఆలోచించి, తమ నిర్ణయాలను ఆచరణలో పెట్టగలరు. స్థిరమైన అభిప్రాయం లేనివారు సంశయంతో ఎదుటి వారు చెప్పిన దానిమీద నమ్మకంతో గుడ్డిగా వారి Adviceను పాటిస్తారు.
మాట్లాడటమూ ఒక కళే
మరికొంత మంది తమ సొంత తెలిపి తేటల్ని, ఇతరులు చెప్పింది విని, రెండింటిని బేరీజు వేసుకుని ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా సలహా ఇచ్చేముందు వ్యక్తులను, సందర్భాన్ని గమనంలో పెట్టుకోవాలి. Friendsతో కబుర్లు చెప్పడం, మాట్లాడటం, సమస్యలు చర్చించడం సహజం. ఎన్నోసార్లు మంచి మంచి విషయాలు మాట్లాడుకున్న స్నేహితుల మధ్య ఒక్కోసారి అనుకోకుండానే ఏదో ఒక విషయం మీద విభేదాలు రావచ్చు. అది Parsonal విషయమైతే వారి మధ్య దూరం పెరిగే ప్రమాదమూ ఉంది. అందుకే సున్నితమైన వ్యక్తిగత అంశాలని మాట్లాడేటప్పుడు ఎవరికి వారు కొన్ని పరిమితులు విధించుకోవాలి.

భార్యాభర్తల బంధం, స్నేహ సంబంధం ఎంతో సున్నితమైనది. ఏదో సలహా ఇచ్చేసి మధ్యలో ఇరుక్కోకూడదు. అనుమానం అనర్థానికి మూలం. ఇలాంటి విషయాల్లో రెండువైపులా కథనం తెలియకుండా సంభాషణలో పాల్గొనటం, సలహాలు ఇవ్వడం ఎంతమాత్రం మంచిది కాదు. అనవసరమైన నిందలు భరించాల్సి ఉంటుంది. ఒకేలాంటి సమస్యతో బాధపడేవారితో ఆలోచనలు పంచుకుంటే వారి మధ్య స్నేహం బలపడటమే కాకుండా సానుకూల ప్రభావం, ఒకరి సలహాలు ఒకరికి ఉపయోగపడే అవకాశమూ ఉంటుంది. అయితే మితిమీరిన జోక్యం, సలహాలు ఇవ్వడం ఎప్పుడూ పనికిరాదు.
విషయ పరిజ్ఞానం లేకుండా వ్యాఖ్యానించరాదు
కొత్తగా Marriage అయిన వారి విషయంలోనూ సలహాలివ్వడం కూడదు. ఎందుకంటే వారికింకా సర్ధుకునే తత్వం అలవడదు. తానే ఎందుకు వినాలి అనే ఆలోచనతో ఉంటే ఇతరులు ఇచ్చే సలహాలు మొదటికే మోసం తెస్తాయి. అలాగే పిల్లల పెంపకం, వారి చదువు, పెళ్లి, వైద్యం, వ్యక్తిగతం, ఆర్థిక విషయాల్లో ఎదుటివారి ఆలోచన, అభిప్రాయం, ఆసక్తి తెలియకుండా సలహాలివ్వడం అపార్తాలకు దారి తీస్తుంది. కార్యాల యాల్లో Boss, డెడ్‌లైన్స్, జీతభత్యాలు వంటి మామూలు అంశాలపై చర్చించడం సహజం. ఉద్యోగాలు మారే విషయంలో, జీతాల పెరుగుదలపై అభిప్రాయాలు వెలిబుచ్చే విషయంలో జాగ్రత్త ఎంతో అవసరం. తగినంత విషయ పరిజ్ఞానం లేకుండా వ్యాఖ్యానించకూడదు.
ఎంత సన్నిహితులైనా అభిప్రాయ బేధాలు, అపార్థాలు వంటివి కొన్ని సందర్భాల్లో తప్పవు. అటువంటి సమయంలో కొన్ని చిన్న చిన్న సలహాలే ప్రాణ స్నేహితులకి, అయివారికి దూరాన్ని పెంచుతాయి. సలహాలు కొన్ని సందర్బాల్లో మంచి చేస్తే, మరికొన్ని సందర్భాల్లో సంబంధాల విచ్ఛిన్నానికి దారితీస్తాయి. ఎవరినైనా, ఏదైనా అర్థం చేసుకోవడం కష్టం, అపార్తం చేసుకోవడం సులువు. సలహాలు అనుకూలమైన ఫలితాలు ఇవ్వకపోతే అంత వరకు ఉన్న సత్సంబంధాలు కాస్త వికటిస్తాయి. కాబట్టి సలహాలు, పరిచయాలు పదికాలల పాటు నిలవాలంటే మాట తీరులో, సలహాలిచ్చే పద్ధతిలో ఎంతో జాగ్రత్త పాటించాలి.

సలహాలు ఇస్తున్నారా?
ఏదైనా సలహా ఇచ్చేముందు సందర్భాలు వేరు, వ్యక్తులు వేరని గమనించాలి. సముద్రం చెలియలికట్ట దాడకూడదు అనేది నానుడి. చేనుకు కంచె, చెరువుకు గట్టు, అలాగే మాటకు, సలహాకు ఒక హద్దు. వ్యక్తుల ప్రవర్తన, మాటతీరు హద్దులో ఉండేనే అందం. సమయాసమయాలు గుర్తించకుండా, ఎదుటివారి ఆలోచనలు, మనోభావాలు గమనించకుండా తోచినట్టు మాట్లాడేసి, ఉచిత సలహాలు ఇచ్చేస్తుంటే మొదటికే మోసం వస్తుంది. అందుకే ఆచితూటి మాట్లాడాలి అంటారు. సంభాషణని ఎక్కడ ప్రారంభించాలి? ఎక్కడిదాకా కొనసాగించాలి. ఎక్కడ ముగించాలి? అనే విషయాలు గమనంలో ఉంచుకోవాలి. అంటే నొప్పించక తానొవ్వక అన్నట్టుగా సంభాషణ తీరు ఉండాలి. సందర్భానుసారంగా మాట్లాడినప్పుడు మాత్రమే ఎదుటివారికి మనకి కూడా అన్ని విధాల మంచిది.