Talanoppi Chitkalu | అతి సాధారణమైన సమస్యల్లో తలనొప్పి ఒకటి. ఆ సమస్య ఎదురైనప్పుడు ఏదో ఒక మాత్ర వేసుకుంటాం కానీ, దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. నుదురు కణతలు, మాడు, తల వెనుక భాగం ఇలా తలలోని ఏ భాగంలోనైనా నొప్పి(Talanoppi Chitkalu) రావచ్చు. తల బరువుగా ఉండటం, దిమ్ముగా అనిపించడం, సుత్తితో కొట్టినట్టు ఉండటం, నొక్కేసినట్టు అనిపించడం తలనొప్పి(Headache) సంకేతాలు.
సమయానికి ఆహారం తీసుకోకపోయినా, శరీరానికి సరిపోయినంత నీరు తాగకపోయినా, మానసిక ఒత్తిడి, ఎండలో తిరగడం, కళ్లకి ఎక్కువగా శ్రమ కలగడం వంటి అనేక కరాణాల వల్ల Talaనొప్పి వస్తుంది. సైనస్, కంటి సమస్యలు, అధిక రక్తపోటు కూడా Talanoppiకి కారణాలే. నిద్రలేమి, కొన్ని రకాల మందుల వల్ల తలనొప్పి రావచ్చు.
ఆహరం సమయానికి తీసుకోవడం తప్పనిసరి. రోజూ 10 గ్లాసుల నీరు తాగాలి. ఒకేసారి కాకుండా, గంటగంటకీ గ్లాస్ నీళ్లు చొప్పన తాగుతూ ఉండాలి. తేలికగా జీర్ణమయ్యే ఆకుకూరలు, కాయకూరలు, సూపులు, పులుసు, చారువంటివి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. మసాలాలు ఎక్కువగా తినకూడదు. గ్రేవీకూరలకు దూరండా ఉండాలి. ఆహారాన్ని వేడివేడిగా తినాలి.
తగినంత నిద్ర తప్పనిసరి. అక్కర్లేని ఆందోళనలు, ఆలోచనలు తగ్గించుకోవాలి. అనులోమ, విలోమ ప్రాణాయామం, భ్రమరీ ప్రాణయామం, శవాసనం, సూర్యభేరి ప్రాణాయామం ఉపయోగపడతాయి. టివీ ఎక్కువగా చూడటం, అలాగే Computerపై అధిక సమయం పనిచేయడం వల్ల కళ్లు శ్రమకు లోనవుతాయి. వీటికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది. కంప్యూటర్‌పై పనిచేయడం తప్పని సరి అయితే దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Talanoppi Chitkalu | తలనొప్పికి గృహవైద్యం
తలకు నువ్వుల నూనె, కొబ్బరి నూనె, లేదా ఆముదం ఇలా ఏదో ఒక నూనెతో మృదువుగా మర్ధనా చేసుకోవాలి.
లేత తమలపాకులను నుదిటిపై పెట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
శొంటి కొమ్ముని పాలతో అరగదీసి నుదిటిపై లేపనంగా వేసుకుంటే Noppi తగ్గుముఖం పడుతుంది.
లవంగాలు, దాల్చిన చెక్క, బాదం ఈ మూడింటిని చూర్ణంగా చేసి, సమాన భాగాలుగా తీసుకోవాలి. తరువాత కొన్ని నీళ్లు కలిపి ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నుదుటిపై పూతలా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
వాము మూకుట్లో వేసి నల్లగా మాడనివ్వాలి. దాని నుంచి వచ్చే పొగని పీలిస్తే తలనొప్పి తగ్గుతుంది.
పాలల్లో కొద్దిగా శొంఠి పొడిని వేసి బాగా కాయాలి. అందులో కొంచెం పటిక బెల్లం కలిపి వేడివేడిగా తాగినా తలనొప్పి తగ్గుతుంది.