Bathroomలో Current తో జాగ్రత్త! ఏఏ పద్ధతులు పాటించాలి?
Bathroom : ఇంట్లో బాత్రూమ్కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. కానీ బాత్రూమ్ శుభ్రత విషయంలో చాలా మంది అజాగ్రత్త చేస్తుంటారు. దీంతో పాటు బాత్రూమ్లో ఉండే ఎలక్ట్రిక్ వస్తువుల గురించి చూసీచూడనట్టు కొందరు వదిలేస్తుంటారు. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయి. కొందరు దురదృష్టవశాత్తు బాత్ రూమ్(Bathroom)లో కరెంట్ షాక్ తగిలి మరణించిన సంఘటలను ఎన్నో వార్తల్లో, టీవీల్లో చూస్తూనే ఉంటా. ఎక్కువుగా ఇంటిలో వాడే కరెంట్ వైర్లు పరిశీలిస్తాం కానీ బాత్ రూమ్‌లో ఉన్న కరెంట్ సమస్యలపై త్వరగా దృష్టిపెట్టం. కాబట్టి బాత్రూమ్లో కరెంట్ షాక్‌కు తావు లేకుండా ఉండాలంటే తప్పని సరిగా కొన్ని పద్ధతులు పాటించాలి.


ఈ పద్ధతులు పాటించండి!
- ముందు బాత్రూమ్ బయటే విద్యుత్ గృహోపకరణాలు అమర్చుకోవాలి. బాత్రూమ్లో వాటర్ హీటర్‌ను వాడకపోవడం మంచిది.
- బాత్రూమ్లో ఎలక్ట్రిక్ షేవర్, హైర్ డ్రయర్స్, ఎలక్ట్రికల్ హీటర్ వాడటం అంత శ్రేయస్కరం కాదు.
- చేతులు తడిగా ఉన్నప్పుడు విద్యుత్ ఉపకరణాలను, స్విచ్‌లను తగలకూడదు.
- కిచెన్ లేదా బాత్రూమ్లో తేమశాతం ఎక్కువ ఉన్న స్థలంలో పాత కరెంటు వైర్లని, బోర్డులని తొలగించాలి.
- ఎక్స్టెన్షన్ యూనిట్లను, అడాప్టర్స్ని బాత్రూమ్లో వాడకండి.
వాటర్ హీటర్ ని ఎలా వాడాలంటే?
- ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ లైసెన్స్డు ప్లంబర్ లేదా నిపుణుడితో మాత్రమే బిగించాలి.
- వాటర్ హీటర్‌కు సంబంధించిన బోర్డు, వేడి నీళ్లు వచ్చే పైప్, ఉష్ణతాకం, ప్రెజర్ రిలీఫ్ వాల్వుని ముందుముందు ఏ సమస్యా రాకుండా ముందుగానే జాగ్రత్తగా పిట్ చేయించుకోవాలి.
- వాటర్ హీటర్ వాడిన తర్వాత స్విచ్ఛాఫ్ చేయడం మర్చిపోకండి.
- స్టీమ్‌లో ఏదైనా తేడా వచ్చిందని గమనించిన వెంటనే నిపుణుల సహాయంతో సమస్యను పరిష్కరించుకోండి.
- వాటర్ హీటర్ ని మైంటైన్ చేయడం, రిపేర్లు వచ్చినపుడు చూసుకునే వారు దాని గురించి ప్రాథమిక విషయాలు తెలుసుకోకుండా దాని జోలిక వెళ్లడం ప్రమాదకరం.


చిన్న పిల్లలుంటే జాగ్రత్త!
- చిన్న పిల్లలు స్నానం చేసేటప్పుడు ఆటలాడనివ్వొద్దు.
- 120 డిగ్రీల కంటే ఎక్కువ నీళ్ల ఉష్ణోగ్రత ఉండకూడదు.
- పాప లేదా బాబుని ఒంటరిగా బాత్రూమ్లో వదిలేసి బయటకు వెళ్లకూడదు.
- టబ్‌లో మొదట చల్లని నీళ్లు నింపాలి, తర్వాతనే వేడినీళ్లు పోయాలి.
- పిల్లలకి అందేట్లు షాంపూలు, హెయిర్ కలర్స్, డ్రయర్స్ లాంటివి ఉంచరాదు.
- చాలా మంది బాత్రూమ్లో బకెట్లో హీటర్ వేసి తమ పనిలో నిమగ్నమవుతారు. పిల్లలకు వెంటనే చేయిపెట్టి కరెంట్ షాక్‌కు గురయ్యే ప్రమాదముంది.
- డోర్‌కు, గోడలకు మేకులు, బోల్టులు ఉంటే తీసేయండి.
- Impact of Social Media in our Life
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం