baby ear piercing studs: మీ పిల్లలకు చెవులు కుట్టిస్తున్నారా? అయితే ఒక్కసారి తెలుకోండి!
Gbaby ear piercing studsపిల్లలకు సంబంధించిన అపురూపమైన వేడుకల్లో చెవులు కుట్టించడం కూడా ఒకటి. అది పెద్దలకు వేడుకే కానీ, పిల్లలకు మాత్రం నొప్పి పుట్టించే పని. చెవులు కుట్టించేటప్పుడు తల్లులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. లేదంటే చెవులకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. -పిల్లలకు చెవులు కుట్టించడానికి ముందు వారికి తలస్నానం చేయించాలి. తరువాత ఓ వారంపాటు చెవులపై నీళ్లు పడకుండా జాగ్రత్తగా స్నానం చేయించాలి. వీలైనంతవరకూ చెవులకు చల్లటి నీళ్లు తగలకుండా చూడాలి. …