CDS Gen Bipin Rawat: ఆసక్తికరంగా మారిన 17 తుపాకుల వందనం.. రావత్ అంత్యక్రియల్లో 800 మంది సర్వీస్ సిబ్బంది
CDS Gen Bipin Rawat న్యూఢిల్లీ: తమిళనాడు రాష్ట్రంలో దురదృష్టవశాత్తు హెలికాఫ్టర్ ప్రమాదంలో కన్ను మూసిన భారత మొదటి సీడిఎస్ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం జరిగాయి. తొలుత ఆర్మీ సైనిక సిబ్బంది సందర్శనార్థం రావత్, ఆయన సతీమణి మధులిక పార్ధివ దేహాలను కామ్రాజ్ మార్గ్‌లోని వారి నివాసంలో ఉంచారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుండి అంతిమయాత్ర కార్యక్రమం చేపట్టారు. సాయంత్రం 4 గంటలకు బ్రార్ స్వ్కేర్ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాల …