Endometrial Cancer Symptoms: 40 ఏళ్లు పైబడితే గర్భసంచిలో క్యాన్సర్ లక్షణాలు గుర్తించడం ఎలా?
Endometrial Cancer Symptoms: స్త్రీలలో గర్భసంచి ముఖద్వారం సంబంధించిన క్యాన్సర్, ఒవేరియన్(ovarian) క్యాన్సర్ తర్వాత ఎక్కువుగా కనిపించేంది గర్భాశయ క్యాన్సర్. దీనినే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని కూడా అంటారు. గర్భసంచిలో ఒక పొరమాదిరిగా ఉండి గర్భం దాల్చనప్పుడు మందంగా తయారైతుంది. గర్భం ధరించకపోతే నెలసరిలో స్రవించబడేదే ఎండోమెట్రియం. సగటున ఎండోమెట్రియం 6-7 మిల్లీమీటర్ల మందంతో ఉంటుంది. మనోపాజ్ దశలో ఎంటోమెట్రియం పలుచగా మారుతుంది. గర్భధారణ సమయంలో మందంగా తయారయ్యే ఎండోమెట్రియం(Endometrial) ద్వారానే పిండానికి పోషకాలు, ఆక్సిజన్ అందుతాయి. …