- హత్య కేసులో పోలీసులు విచారణ
- తుపాకీల తయారీ గుట్టు రట్టు
- చెన్నైలో నేర్చుకున్న నిందితుడు
Gun Manufactures: పశ్చిమ గోదావరి జిల్లా తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇటీవల వీరంపాలె గ్రామంలో కుటుంబ గొడవల వల్ల తమ్ముడు అన్నయ్యను తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు కృష్ణ మోహాన్ను పోలీసులు అరెస్టు చేశారు. అతను వినియోగించిన తుపాకీ గురించి విచారించారు.
ఈ క్రమంలో తుపాకీ గురించి పోలీసులకు అసలు నిజం బయటకు చెప్పాడు. పెదవేగి మండలం కొండలరావు పాలెం గ్రామానికి చెందిన రెడ్డి కృపావరం అను అతను తుపాకీ అమ్మినట్టు చెప్పాడు. రంగంలోకి దిగిన పోలీసులు రెడ్డి కృపావరంను అరెస్టు చేసి అతడిని విచారించారు.
ఏలూరుకు చెందిన సింగు వెంకటేష్ తుపాకులు (Gun Manufactures)తయారు చేసి అమ్ముతున్నాడని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు కృష్ణమోహన్ రూ.13,000/- వేలకు తుపాకీ కొని దానిని రూ.16,000/- వేలకు అమ్మినట్టు కృపావరానికి చెప్పాడు.


తాజాగా మంగళవారం పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు.. చింతలపూడి సిఐ ఏలూరులోని చెంచుల కాలనీలో వెంకటేష్ ఇంటి వద్దకు వెళ్లి అతన్ని పట్టుకొని అరెస్టు చేశారు. అతడిని విచారించగా వెంకటేష్ చెన్నై వెళ్లి తుపాకులు మరియు వాటిలో వాడే పేలుడు పదార్థాలు తయారు చేయడం నేర్చుకున్నట్టు విచారణలో తెలిపాడు.
చెన్నై నుండి వాటిని తయారు చేయడానికి కావల్సిన పదార్థాలను తీసుకొచ్చి ఇంట్లో తయారు చేస్తున్నట్టు తెలిపాడు. ఎవరికైనా కావాలంటే అమ్మేందుకు ఇంట్లో ఉంచినట్టు పేర్కొన్నాడు. పోలీసుల సోదాల్లో వెంకటేష్ ఇంట్లో ఉన్న 12 తుపాకులు, సగం తయారుచేసి ఉన్న ఆర్తి బట్లు 7 ఇనుప గొట్టాలు బ్యారెలు, పేల్చడానికి వాడే నల్ల మందు, 2.1 కేజీలు, చిన్న చినుప గుండ్లు 31.3 కేజీలను స్వాధీనం చేసుకున్నారు.
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?