Section 144: తాడేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్లుండి (సోమవారం) తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి ఏపీ నిరుద్యోగ విద్యార్థి ఐకాస పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నిరుద్యోగ సంఘాలు తలపెట్టిన ఛలో తాడేపల్లికి అనుమతి నిరాకరించినట్టు గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. 144 సెక్షన్ (Section 144)అమల్లో ఉన్నందున అనుమతి లేదని స్పష్టం చేశారు. శాంతి యుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. కానీ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారి విధులకు ఆటంకం కలిగిడంచడం నేరమని తెలిపారు. రాజ్‌భవన్ హైకోర్టు సచివాలయం సీఎంఓ ముట్టడిం చడం నేరమని పేర్కొన్నారు. నిరుద్యోగుల ముసుగులో సంఘవిద్రోహ శక్తులు ప్రవేశించే ప్రమాదం ఉందన్నారు. కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉందన్నారు. అనుమతి లేకుండా ఆందోళన చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా మన్నారు. విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!