T201 Series India Win : టీ20లో కోహ్లీసేన విజయం
T201 Series : భారత్ మరియు ఇంగ్లాడ్ మధ్య జరిగిన టీ20(T201) ఐదు సిరీస్ మ్యాచ్‌లో 5వ టీ20లో భారత్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. 225 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రెండు జట్లు ఇంగ్లాడ్ 20 ఓవర్లలో 8 వికేట్లు కోల్పోయింది. ఇంగ్లాడ్ జట్టు 188 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లాడ్ ఓపెనర్ జేసన్ రాయ్ ఏమీ పరుగులు తీయకుండానే ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ అయిన జాస్ బట్లర్, డేవిడ్ మలన్ 130 పరుగుల ఇద్దరి భాగస్వామ్యంతో ఇంగ్లాండ్ 225 పరుగులు చేసింది.
డేవిడ్ మలన్ (68), జాస్ బట్లర్ (52) ఇంగ్లాండ్ జట్టులో టాప్ స్కోరర్లుగా నిలిచారు. మిగతా ఆడగాళ్లైన బెన్‌స్టోక్స్ (14), క్రిస్ జోర్డాన్ (11, శామ్ కరన్ (14 నాట్ అవుట్) స్కోర్ చేయగలిగారు. చివరి రెండు ఓవర్లలో 60 పరుగులు చేయాల్సి ఉండగా ఇంగ్లాండ్ కు ఓటమి ఖాయమైంది. చివరి ఆరు బంతుల్లో ఇంగ్లాండ్ విజయం కోసం 57 పరుగులు చేయాల్సి వచ్చింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు చివరి ఓవర్లో 3 సిక్సులు కొట్టినప్పటికీ ఫలితం లేదు.

భారత్ బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ (3), భువనేశ్వర్ కుమార్ (2), హార్థిక్ పాండ్య, టి. నజరాజన్ చెరో వికెట్ పడగొట్టారు. చివరి టీ20లో విజయంతో 5 టీ20ల సిరీస్‌ను భారత్ 3-1 తో సొంతం చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాంటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 2 వికేట్లు కోల్పోయింది. 224 పరుగులు చేసింది. ఇంగ్లండ్ జట్టుకు గెలవడానికి 225 పరుగుల లక్ష్యం ముందున్నప్పటికీ, బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు పరుగులేమీ చేయలేదు. మొదట్లోనే తొలి వికెట్ కోల్పోయింది.
భారత్ జట్టు నుంచి ఓపెనర్ జేసన్ రాయ్ భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్లో రెండో బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 10వ ఓవర్లో ఇంగ్లాండ్ 100 పరుగులు చేసింది. డేవిడ్ మలన్ హాఫ్ సెంచరీ చేశాడు. 33 బాల్స్‌కు 8 ఫోర్లు, 2 సిక్సర్లుతో 52 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ జాస్ బట్లర్ కూడా అర్థ సెంచరీ పూర్తి చేశాడు. 30 బాల్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. 52 పరుగుల చేసిన జాస్ బట్లర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో హార్థిక్ పాండ్యకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, హార్థిక్ పాండ్య నాటౌట్‌గా నిలిచారు. కోహ్లీ 52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు, పాండ్య 17 బంతుల్లో 2 సిక్సర్లు , 4 ఫోర్లతో 39 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ (64), సూర్య కుమార్ యాదవ్ (32) పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అదిల్ రషీద్, బెన్ స్టోక్స్ చెరో వికట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో భారత్ తరపున రోహిత్ శర్మతో పాటు, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనర్లగా దిగారు. మొదటి నుంచి పోటాపోటీగా ఆడిన రోహిత్ శర్మ 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్ 50 పరుగుల్లో 4 సిక్స్‌లు, 3 ఫోర్లు కొట్టాడు. 34 బంతుల్లో 64 పరుగులు చేసిన రోహిత్ శర్మ బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కోహ్లీ 36 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 19వ ఓవర్లో భారత్ 200 పరుగు మైలు రాయిని చేరింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ కోసం నాల్గో టీ 20లో వరుసగా విఫలమవుతున్న కేఎల్ రాహుల్ స్థానంలో అదనపు బౌలర్‌గా టి.నటరాజన్‌కు చోటు కల్పించాడు. ఇంగ్లాడ్ జట్టు మాత్రం ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. ఇప్పటి వరకూ జరిగిన నాల్గు టీ 20 మ్యాచీల్లో విజయం సాధించిన రెండు జట్లు 2-2 తో సమానంగా ఉన్నాయి.
- Online class : చెట్టు కింద చదువులు ఆ ఉపాధ్యాయురాలి ఆలోచనకు జేజేలు!
- Guntur జిల్లాలో అమానుషం! వృద్ధురాలిపై అత్యాచారం!
- Myanmar Capital : ఆ రాజధానిని దెయ్యాల నగరంగా ఎందుకు పిలుస్తారు?
- khammam Municipal Election 2021: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ ఇక ప్రచారానికి రెఢీ!
- Covid 19 ను తరమాలంటే! మాస్కే మార్గం! సామాజిక దూరమే శరణ్యం!