Synonym for positive attitudeరేపు అంతా మంచే జరుగుతుంది అని ఆశగా ఎదురుచూడటం మనిషి సహజ లక్షణం. ఇదేమీ అంత చెడ్డది కాదు. మంచిదే! హృద్రోగులకు అయితే మరీ మంచిది అంటోంది ఒక కొత్త పరిశోధన. యూనివర్శిటీ ఆఫ్ మిచ్‌గాన్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా చేపట్టిన ఈ పరిశోధన లో పలు విషయాలు వెలుగుచూశాయి. సుమారు 7 వేల మంది హృద్రోగుల మీద ఈ పరిశోధన జరిగింది. వీరిలో ఎవరైతే ఆశావహంగా ఆలోచిస్తారో వారు గుండెపోటు ముప్పును తప్పించుకుంటున్నట్టు పరిశోధకు లు తేల్చారు. నెగిటివ్ థింకింగ్ దరికి చేరనీయకపోవడం, పాజిటివ్‌గా ఆలోచించడం, ఆశావహ దృక్పథం తో జీవితాన్ని ఆహ్లాదకరంగా కొనసాగించడం, వంటివన్నీ శరీరం మీద, గుండె మీద వెరసి ఆయుష్షు మీద కూడా తీవ్ర ప్రభావం చూపించినట్టు తేలింది. హృద్రోగుల్లో ముప్పావు వంతు ఆశావహులే ఆరోగ్యంగా ఉన్నారట. అందులోను ఇలాంటి వాళ్లే చక్కటి వ్యాయామం, యోగా(Yoga), ధ్యానం(meritnation), మంచి ఆహారం తీసుకుంటున్నట్టు గుర్తించారు. కాబట్టి మీరు కూడా ఇదే దృక్ఫథాన్ని అలవర్చుకుంటే(Synonym for positive attitude) బెటర్.
ఈ తప్పులు చేస్తున్నారా?
ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం పోషకాహారం ఒక్కటి తీసుకుంటే సరిపోదు. జీవన శైలి కూడా ఓ క్రమ పద్ధతిలో ఉండాలి మరి అది సాధ్యం కావాలంటే నిద్ర వేళల్ని తప్పనిసరిగా పాటించాలి. పొద్దున్నే లేవడం వల్ల జీవక్రియ మెరుగ్గుగా ఉంటుంది. లేవడం వరికే కాదు, ఆహారం తీసుకునే విషయంలోనూ ఈ నియమాన్నే పాటించాలి. లేదంటే రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రాత్రిపూట ఆలస్యంగా భోంచేయడం, అతిగా తినడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రోజులో కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తినడం మంచి అలవాటు.
ఉదయం అల్పాహారంలో ఘాటైన పదార్థాలూ, పుల్లని పండ్ల రసాలూ తీసున్నప్పుడు తప్పనిసరిగా కాసిని నీళ్లతో పుక్కిలించాలి. ఘాటైనవీ, పుల్లనవీ దంతాల మీదున్న ఎనామిల్ పూతపై దుష్ఫ్రభావాన్ని చూపుతాయి. కొన్నిసార్లు దంతాల రంగూ మారే ప్రమాదం ఉంది.
పండుకోవడానికి ముందు రేడియేషన్‌ని(radiation) వెదజల్లే కంప్యూటర్లూ, సెల్ఫోన్లూ ఎంత దూరం ఉంటే అంత మంచింది. రాత్రిపూట వాటి ప్రభావంతో సరిగా నిద్రపట్టదు. దీర్ఘకాలంలో గుండె సంబంధిత సమస్యలు బాధించే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

జీవితం అంటే..
-ఖరీదైనవస్త్రము దరించినా విడువక తప్పదు.
-ఎంత పంచామృతాలు తిన్నా విసర్జించక తప్పదు.
-ఎంత ఖరీదైన కారు ఎక్కినా దిగినడవక తప్పదు.
-ఎంత ఎత్తుకువెళ్లినా తిరిగి నేలపైకి రాక తప్పదు.
-ఎంత గొప్ప ప్రదేశాలు చూచినా తిరిగి నీ సొంత గూటికి రాక తప్పదు.
-ఎంత గొప్ప అనుభూతి పొందినా తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి