Symptoms of Zika Fever: ఒక్కప్పుడు జికా వైరస్ బ్రెజిల్ దేశంలో దాదాపు 10 లక్షల మందిని చుట్టబెట్టి కలకలం రేపింది. ఆమెరికా, ఐరోపా ఖండాలు జికా వైరస్‌తో గజగజలాడాయి. దోమకాటుతో మనుషులకు వ్యాప్తి చెందే ఈ వైరల్ వ్యాధి వల్ల ఎవరిలోనూ పెద్ద సమస్యలేమీ కనపడనప్పటికీ గర్భిణీ(pregnancy) స్త్రీలకు మాత్రం పెద్ద ప్రమాదంగా మారాయి. ఎందుకంటే ఈ వైరస్ సోకితే వారికి పుట్టే బిడ్డలకు తీవ్ర మెదడు లోపాలు తలెత్తున్నాయని ఇప్పటికే పరిశోధనల్లో తేలిపోయింది. జికా పేరు వింటేనే ప్రపంచానికి కంగారు పట్టుకున్న సంఘటనలూ (Symptoms of Zika Fever) ఉన్నాయి.
నేటి ప్రపంచంలో దేశాలన్నీ వైరస్ దెబ్బ తిన్నవే. ఒకటి తర్వాత ఒకటి వస్తున్న వైరస్(Zika Fever)ల వల్ల జన జీవనానికి పెద్ద సవాల్‌గా మారింది. బ్రెజిల్ కేంద్రంగా జికా విజృంభణ మొదలవ్వడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని నిలువరించే వ్యూహాలపై భారీ కసరత్తు చేసింది.
ఇప్పటి వరకూ దీన్ని అడ్డుకోవడానికి టీకాలు లేవు. దీనికి ప్రత్యేకించి చికిత్సా కూడా లేదు. ఇది ఈడిసి ఈజిప్టై రకం దోమల ద్వారా వ్యాపిస్తోంది. ఈ దోమలు మన ప్రాంతంలో విపరీతంగా ఉన్నట్టు తెలుస్తోంది. మన ప్రభుత్వాలు దోమలను నిర్మూలించేందుకు చెత్త, మురికినీటి నిల్వలను తొలగించడం, ఫాగింగ్ వంటి విస్తృత చర్యలు ఆరంభించడం ఉత్తమం అని వైద్యులు చెబుతున్నారు.

గర్భిణీలూ జాగ్రత్త!
గర్భిణులకు జికా వైరస్ జ్వరం వస్తే వారికి పుట్టే బిడ్డలకు మెదడు సరిగా పెరగక పోవడం వంటి సమస్యలు వస్తున్నట్టు గుర్తించారు. జికా విస్తృతంగా ఉన్న బ్రెజిల్లో సుమారు 4 వేల మంది పిల్లలు తల చిన్నగా, మెదడు లోపంతో పుట్టినట్టు అంచనా. జికా సమస్య తీవ్రంగా ఉన్న దేశాల్లో స్త్రీలు గర్భధారణను కొంతకాలం వాయిదా వేసుకోవాలని, విదేశాల నుంచి గర్భిణులు ఆ దేశాలకు వెళ్లొద్దని అప్పట్లో నిపుణులు సిఫార్సు చేసిన ఘటనలు ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే మన దేశంలో ఒకటి, రెండు కేసులు మినహా పెద్దగా ఎక్కా నమోదు అయినట్టు లేదు. ప్రతి ఒక్కరూ దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటే జికా వైరస్‌తో పాటు డెంగీ, చికున్‌గున్యా, మలేరియా వంటి వ్యాధులు రాకుండా నివారించొచ్చు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ