symptoms of cough and feverకొన్ని సార్లు విడవకుండా దగ్గు వేధిస్తోంటుంది. కారణమేంటో తెలియదు. మూడు నాలుగు వారాలైనా తగ్గదు. ఇలాంటి దీర్ఘ కాలిక దగ్గు తరుచుగా కనిపించే సమస్యే. మనలో సుమారు 10-20 శాతం మంది జీవితంలో ఎప్పుడో అప్పుడు దీని బారినపడ్డవారే ! దగ్గు త్వరగా తగ్గకపోవటానికి మరో కారణమూ ఉంది. సాధారణంగా మనం దగ్గినప్పుడు గొంతులోని స్వరతంత్రులపై విపరీత ప్రభావం పడుతుంది.
దీంతో దగ్గు మరింత పెరుగుతుంది. మళ్లీ మళ్లీ వస్తుంటుంది కూడా. చాలా మంది దగ్గు అదే పోతుందిలే అని లైట్ తీసుకొని తిరుగుతుంటారు. ఇది మంచిది కాదు. మూడు వారాలైనా దగ్గు తగ్గకపోతే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. ఎందుకంటే దీని వెనుకాల ఇతరత్రా కారణాలు దాగి ఉండొచ్చు. ముందుగానే జాగ్రత్త పడితే సమస్య తీవ్రం కాకుండా చూసుకోవచ్చు. అసలు ఇలాంటి దీర్ఘకాలిక దగ్గు ఎప్పుడెప్పుడు వచ్చే అవకాశం ఉందో చూద్ధాం.


ఆస్థమా : శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలేవీ కనబడకపోయినా ఆస్థమా ఉండొచ్చు. ఇది దగ్గుకు దారితీయోచ్చు. ఆస్థమా దాడి చేయటానికి ముందు దగ్గు తలెత్తే అవకాశం ఉందని చాలామందికి తెలియదు కూడా. ఉదాహరణకు జలుబు మూలంగా ఆస్థమా ఉధృతం కావొచ్చు. దీంతో దగ్గు తలెత్తుతుంది. జలుబు తగ్గిన తర్వాత కూడా ఇది కొనసాగొచ్చు.
ముక్కు , గొంతు సమస్యలు: ముక్కు కారటం ఆగిన తర్వాత, అలాగే ముక్కు దిబ్బడ, కళ్ల దురద వంటివి దగ్గును తెచ్చిపెట్టొచ్చు. వీటికి యాంటిహిస్టమిన్ మందులు లేదా నాసల్ స్ప్రేలు బాగా పనిచేస్తాయి. ఇలాంటి వాళ్లు పడుకునే ముందు గోరు వెచ్చటి నీటితో స్నానం చేసినా మంచి ఫలితం ఉంటుంది. దీంతో అలర్జీలు తొలగిపోతుడటంతో పాటు నిద్ర కూడా బాగా (symptoms of cough and fever)పడుతుంది.


జీర్ణరసాలు గొంతులోకి రావటం: జీర్ణాశయంలోని జీర్ణరసాలు గొంతులోకి ఎగదన్నుకొని రావటం(జీఈఆర్డీ) వల్ల ఛాతిలో మంట, త్ప్రేనుల వంటివి వస్తుంటాయి. కానీ దీంతో దగ్గు కూడా వచ్చే అవకాశముంది. జీఈఆర్డీ గలవారిలో సుమారు 75% మంది ఛాతిలో మంట వంటి లక్షణాలేవీ లేకపోయినా దగ్గుతో బాధపడుతున్నట్టు ఓ అధ్యాయనంలో బయటపడింది. ఇలాంటి వాళ్లు భోజనం చేశాక మూడు నాలుగు గంటల తర్వాత పడుకోవడం మంచిది. అలాగే జీర్ణరసాలను పైకి ఎగదన్నేలా చేసే మద్యం, కెఫీన్‌తో కూడిన కాఫీ, చాక్లెట్ వంటి వాటి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.


అకారణ దగ్గు కొందరిలో స్పష్టమైన కారణమేదీ లేకుండానూ దీర్ఘకాలిక దగ్గు(ఇడియోపతిక్ కాఫ్) వేధిస్తుంటుంది. ఇలాంటి రకం దగ్గుతో బాధపడేవాళ్లూ చాలామందే ఉంటారు. ఏదేమైనా అదేపోతుందిలే అని దగ్గును నిర్లక్ష్యం చేయడం తగదు. కొన్నిసార్లు క్షయ మూలంగానూ దగ్గు రావొచ్చు. ముఖ్యంగా రాత్రిపూట జ్వరం, చెమటలు పట్టడం, బరువు తగ్గుతుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్