swiss bank news: స్విస్ బ్యాంకుల్లో మూడింతలు పెరిగిన భారతీయుల సంపద
swiss bank news భారతీయులు, భారత కంపెనీల సంపద స్విస్ బ్యాంకుల్లో 2020 చివరికి వార్షికంగా మూడు రెట్లు పెరిగి 2.55 బిలి యన్ స్విస్ ఫ్రాంక్స్‌కు (దాదాపు రూ.20,700 కోట్లు) చేరింది. ఇది 2019 ముగిసే నాటికి ఈ విలువ 899 మిలియన్ల స్విస్ ఫ్రాంక్స్ (దాదాపు రూ.6,625 కోట్లు) గా ఉంది. రెండు సంవత్సరాల దిగువముఖం తర్వాత 2020లో తిగిరి ఇండియన్ కెంట్స్ నిధులు ఏకంగా 13 సంవత్సరాల గరిష్టానికి (swiss bank news)చేరాయి.
బాండ్లు, తత్సంబంధ పథకాలలో ఉంచిన సంపద భారీగా పెరగడం దీనికి కారణం. కాగా, కస్టమర్ డిపాజిట్లు మాత్రం 2020లో పడిపోయాయి. భారత్ కేంద్రంగా పనిచేస్తున్న బ్రాంచీలు, ఇతర ఫైనాన్షియల్ సంస్థల ద్వారా భారతీయులు భారత్ కంపెనీలు స్విస్ బ్యాంకుల్లో ఉంచిన నిధుల గణాంకాలను స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ 2021 జూన్ 17న విడుదల చేసింది.
గణాంకాలలోని కొన్ని ముఖ్యాంశాలు:
2006 లో స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, భారత కంపెనీల నిధులు 6.5 బిలియన్ డాలక్లు. 2011, 2013, 2017 సహా కొన్ని సంవత్సరాలను మినహాయిస్తే మిగిలిన కాలాల్లో ఈ పరిమాణాలు తగ్గుతూ వచ్చాయి. 2020లో కస్టమర్ అకౌంట్ డిపాజిట్లు 503.9 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్ (రూ.4,000 కోట్లు), 2019 లో ఈ మొత్ం 550 మిలియన్ ఫ్రాంక్స్. గణాంకాల ప్రకారం, 2020 చివరి నాటికి స్విట్జర్లాండ్ లో 243 బ్యాంకులు పనిచేస్తున్నాయి.

తొలి రెండు స్థానాల్లో బ్రిటన్, అమెరికా
అన్ని స్విస్ బ్యాంకుల్లో కస్టమర్ల డిపాజిట్లు 2020 లో దాదాపు 2 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్స్ కు చేరాయి. ఇందులో 600 బిలియన్ డాలర్లు ఫారన్ కస్టమర్ డిపాజిట్లు, 377 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ తో బ్రిటన్ ముందు నిలిచింది. 152 బిలియన్లలో అమెరికా రెండవ స్థానంలో నిలిచింది. 100 మిలియన్ ఫ్రాంక్స్పైన నిలిచిన దేశాలు ఈ రెండే.
- Jajimogulali Song Lyrics | Rudrangi Movie
- Lut gaya lyrics | Jubin Nautiyal | Emraan Hashmi
- Pasoori Lyrics in English | Hindi
- shiv tandav lyrics in English
- Kesineni Nani: అర్జునుడిని ఇలా చూడటం బాధాకరం!