Swamiji Murder In Chittoor | Chittoor Crime News | హ‌త్య‌కు గురైన స్వామీజీ? వివాద‌మే కార‌ణమా?

Spread the love

Swamiji Murder In Chittoor | Chittoor Crime News | హ‌త్య‌కు గురైన స్వామీజీ? వివాద‌మే కార‌ణమా?Chittoor : స్వామీజీ హ‌త్య‌కు గురైన సంఘ‌ట‌న చిత్తూరు జిల్లా ఐరాల మండ‌లం, చుక్క‌వారి ప‌ల్లి గ్రామంలో మంగ‌ళ‌వారం రాత్రి చోటుచేసుకుంది. చిత్తూరు నుండి పీలేరు వెళ్లే రోడ్డు లో చుక్క‌వారిప‌ల్లి గ్రామంలో ఉన్న శివాల‌యంలో అచ్యుతానంద స్వామి ఉంటున్నారు. నిన్న రాత్రి గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హ‌త్య చేసిన‌ట్టు తెలుస్తోంది.

భూ వివాద‌మే ప్రాణం తీసింది: సోదరుడు ఆవేద‌న

శ్రీ‌వారి భ‌క్తుల‌కు అన్న‌దానం చేసేందుకు అచ్యుతానంద స్వామి కొనుగోలు చేసిన భ‌వ‌న వివాద‌మే ఆయ‌న ప్రాణం తీసింద‌ని సోద‌రుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చిన్న‌త‌నంలోనే స‌న్యాసం స్వీక‌రించిన స‌చ్చిదానంద స్వామి, ఆ త‌ర్వాత ఐరాల మండ‌లం, చుక్క‌వారిప‌ల్లి గ్రామంలో సిద్ధ‌గిరి క్షేత్రం రామ‌తీర్థంలో చేరార‌న్నారు. ఇటీవ‌ల శ్రీ‌వారి భ‌క్తుల‌కు అన్న‌దానం కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మిట్టూరులో ఒక భ‌వ‌నాన్ని కొనుగోలు చేశారు. సంవ‌త్స‌రాలు గ‌డిచినా ఇంటిని ఖాళీ చేయ‌క‌పోవ‌డంతో ప‌లుమార్లు స్వామి వారిని సంప్ర‌దించార‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలోనే గ‌త రాత్రి గుర్తు తెలియ‌ని వ్య‌క్తి స్వామి పై దాడి చేసి హ‌త్య చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. భ‌వ‌నాన్ని విక్ర‌యించిన వ్య‌క్తి ఈ హ‌త్య‌కు పాల్ప‌డి ఉంటాడ‌ని స్వామి సోద‌రుడు శ్రీ‌రాముల రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు.


Swamiji Murder In Chittoor
రోడ్డు ప్ర‌మాదం లో మృతి చెందిన విద్యార్థి

రోడ్డు ప్ర‌మాదంలో విద్యార్థి మృతి

Prakasam: గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీకొని విద్యార్థి మృతిచెందిన సంఘ‌ట‌న ప్ర‌కాశం జిల్లా కొమ‌రోలు మండ‌లం అయ్య‌వారిప‌ల్లి గ్రామ స‌మీపంలో బుధ‌వారం చోటు చేసుకుంది. బొంత‌ప‌ల్లి గ్రామానికి చెందిన బాదుల్లా ఇంట‌ర్ ద్వితీయ సంవ‌త్స‌రం చ‌దువు తున్నాడు. ద్విచ‌క్ర‌వాహ‌నంపై వెళ్తున్న విద్యార్థిని గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీకొట్టి ఆగ‌కుండా వెళ్లిపోయింది. ప్ర‌మాదం స్థ‌లంలోనే విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు అప్ర‌మ‌త్త‌మై వాహ‌నాన్ని క‌నుగొనే ప‌నిలో ఉన్నారు. విష‌యం తెలుసుకున్న కుటుంబ స‌భ్యులు విద్యార్థి మృత దేహం వ‌ద్ద కు చేరుకుని క‌న్నీటి ప‌ర్యాత‌మ‌య్యారు.

ఇది చ‌ద‌వండి:ఈ ఎన్నిక‌ల‌కు మీరు దూరంగా ఉండాలి: ఎస్ఈసీ

ఇది చ‌ద‌వండి: క‌రోనా సేవ‌ల‌కుగాను సీఐకి ప్ర‌శంసాప‌త్రం అంద‌జేత‌

ఇది చ‌ద‌వండి: ఏపీలో పంచాయ‌తీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌

ఇది చ‌ద‌వండి:పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రిగే జిల్లాలు, రెవెన్యూ డివిజ‌న్ల వివ‌రాలు 

ఇది చ‌ద‌వండి:నూత‌న స‌చివాల‌యం నిర్మాణ ప‌నులు ప‌రిశీలించిన సీఎం కేసీఆర్‌

 

Sai DharamTej: మెగా హీరో సాయి ధ‌ర్మ‌తేజ్‌కు రోడ్డు ప్ర‌మాదం అప‌స్మార‌క స్థితిలో హీరో!

Sai DharamTejహైద‌రాబాద్: మెగా హీరో సాయి ధ‌ర్మ‌తేజ్‌కు శుక్ర‌వారం రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. స్పోర్ట్స్ బైక్‌పై ప్ర‌యాణిస్తున్న ఆయ‌న ప్ర‌మాద‌వ‌శాత్తూ కింద‌ప‌డిపోయారు. ఈ ఘ‌ట‌న‌లో సాయి ధ‌ర్మ‌తేజ్‌కు Read more

Car accident: రాఖీ పండుగ రోజున క‌లచివేసిన ఘ‌ట‌న…సంతోషంగా గ‌డిపిన క్ష‌ణాల్లోనే రోడ్డు ప్ర‌మాదంలో క‌బ‌ళించిన మృత్యువు!

Car accident: పెద్ద‌ప‌ల్లి : చెరువులో కారు.. విగ‌త‌జీవిగా క‌నిపిస్తున్న యువ‌కుడి మృత‌దేహం…ఈ దృశ్యం చూసిన వారి మ‌న‌సుల‌ను క‌లిచివేసింది. రాఖీ పండుగ రోజున ఆదివారం ఆ Read more

Road accident: మృత్యురూపంలో కారుపై దూస‌కొచ్చిన లారీ..ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

Road accident: వికారాబాద్ జిల్లాలో సోమ‌వారం ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మ‌రొక‌రి ప‌రిస్థితి Read more

Road Accident : విషాదం: క‌రోనాను జయించిన‌ప్ప‌టికీ క‌న్నెర్ర జేసిన విధి!

Road Accident : గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీ కొని ఇద్ద‌రు న‌వ దంప‌తులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఈ ఘ‌ట‌న విజ‌య‌న‌గ‌రం జిల్లాలో విషాదం రేపింది. Read more

Leave a Comment

Your email address will not be published.