Swaeroes International | హనుమకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్శిటీ మొదటి గేట్ వద్ద స్వేరోస్ ఇంటర్నేషనల్ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. అక్షరం ,ఆరోగ్యం ,ఆర్థికం అనే మూడు లక్ష్యాలతో చదువే ఒక ఆయుధం గా అందరూ చదవాలి, అందరూ ఎదగాలన్నారు.
Swaeroes International
వివక్షకు గురవుతున్న ప్రజలకు కుల మతాలకు అతీతంగా అండగా నిలబడాలనే లక్ష్యం తో విద్యాభివృద్ధికి కృషి చేయాలని, 12 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన స్వేరోస్ ఇంటర్నేషనల్ సంస్థ అని గుర్తు చేశారు. ఈ నెల 31వ తేదీన సిద్దిపేట లో నిర్వహించ తలపెట్టిన జ్ఞాన సంకల్ప సభ బహిరంగ సభ కు సంబంధించిన వాల్ పోస్టర్ లను హనుమకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్ ముందు బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ బి.ఎస్.ఎఫ్ కేయూ అధ్యక్షులు మన్నే దినాకర్ ఆధ్వర్యంలో విడుదల చేశారు.
అనంతరం స్వేరోస్ ఇంటర్నేషనల్(Swaeroes International) హన్మకొండ జిల్లా అధ్యక్షులు శనిగరపు రాజేంద్ర ప్రసాద్, బి.ఎస్.ఎఫ్ కేయూ ఇంచార్జి, హన్మకొండ జిల్లా అధ్యక్షులు బొట్ల మనోహర్ మాట్లాడుతూ స్వేరో జ్ఞాన సంకల్ప సభకు చీఫ్ గెస్ట్ గా స్వేరోస్ ఇంటర్నేషనల్ ఫౌండర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొంటున్నారు.కావున బహుజన మేధావులు,విద్యార్థులు,యువత,ఉద్యోగులు,మహిళలు అధిక సంఖ్యలో వేలాది గా తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ వాల్ పోస్టర్ ఆవిష్కరణలో వరంగల్ జిల్లా మాజీ జాయింట్ సెక్రటరీశనిగారపు శాజన్,బి.ఎస్.ఎఫ్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఉపాధ్యక్షులు రాజబాబు,గర్ల్స్ కన్వీనర్ హేప్సిబా, త్రివేణి, కల్యాణి, శ్రావణి,లాలూ ప్రసాద్,శ్రీకాంత్, సంపత్, బీరప్ప షఫీ తదితరులు పాల్గొన్నారు.