Suryapet to Mumbai bus

Suryapet to Mumbai bus ఇక రైట్‌..రైట్‌..!

Telangana
Share link

Suryapet to Mumbai bus సూర్యాపేట: తెలంగాణ ముఖ్య‌మంత్రి ఆదేశానుసారం, టిఎస్ ఆర్టీసీ ఎండీ వి.సి స‌జ్జ‌నార్ సూచ‌న‌ల మేర‌కు స‌రిగ్గా ప‌ది సంవ‌త్స‌రాల త‌ర్వాత మ‌ళ్లీ సూర్యాపేట నుంచి ముంబైకి బ‌స్ సౌక‌ర్యం ప్రారంభ‌మైంది. సూర్యాపేట నుంచి ముంబై కి వెళ్లీ టిఎస్ ఆర్టీసీ బ‌స్‌ను డిపో మేనేజ‌ర్ వి.శివ‌శంక‌ర్ శుక్ర‌వారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. ఇక నుంచి సూర్యాపేట నుంచి ముంబై(Suryapet to Mumbai bus)కి ప్ర‌తిరోజూ ఉద‌యం 8.30 గంట‌ల‌కు సూర్యాపేట నుంచి బ‌య‌లు దేరి మరుస‌టి రోజు ముంబైకి ఉద‌యం 6.30 ల‌కు చేరుకుంటుంద‌ని తెలిపారు. సీఎం కేసీఆర్ చొర‌వ‌తో ప‌ది సంవ‌త్స‌రాల త‌ర్వాత బ‌స్ స‌ర్వీసు ముంబైకి ప్రారంభ‌మైంద‌న్నారు. ఎండీ వి.సి స‌జ్జ‌నార్ ఆర్‌టిసి సంస్థ‌ను అభివృద్ధి చేయ‌డంలో భాగంగా అనేక కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. ఏ ఊరికి స‌ర్వీసు లేక‌పోయినా ప్ర‌యాణికులు ఎక్కేవారు ఉంటే ఆ వూరి డైరెక్టుగా తెలంగాణ ఆర్‌టిసి బ‌స్ స‌ర్వీసు కొన‌సాగుతుంద‌ని అన్నారు. ఈ ప్రారంభ కార్య‌క్ర‌మంలో అసిస్టెంట్ మేనేజ‌ర్ వెంక‌టమ్మ‌, అసిస్టెంట్ మెకానిక‌ల్ ఇంజ‌నీర్ హ‌నుమాన్ నాక్‌, ఎన్‌.సి సైదులు, డ్రైవ‌ర్లు తాళ్ల శేఖ‌ర్ రెడ్డి, ముస్కు సైదులు, ఆర్‌టీసీ సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

See also  TRS Plenary Meeting: ప‌ద‌వులు రాగానే గంజిలో ఈగ‌ల్లాగా ఎగిరిప‌డుతున్నారు

Leave a Reply

Your email address will not be published.