surface tension

surface tension: వ‌ర్ష‌పు బిందువుల‌, Soap bubble, పాద‌ర‌స బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?

Share link

surface tension | ద్ర‌వ‌ప‌దార్థాలు ప్ర‌ద‌ర్శించే ధ‌ర్మాల‌నే త‌ల‌త‌న్య‌త అంటారు త‌ల‌త‌న్య‌త బ‌లాన్ని రెండు ర‌కాలుగా వ‌ర్గీక‌రించ‌వ‌చ్చు. 1.సంసంజ‌న బ‌లాలు 2. అసంజ‌న బలాలు. ఒకే ర‌క‌మైన అణువుల మ‌ధ్య ఉన్న ఆక‌ర్ష‌ణ బ‌లాల‌ను సంసంజ‌న బ‌లాలు అంటారు.వేర్వేరు అణువుల మ‌ధ్య ఉన్న ఆక‌ర్ష‌ణ బ‌లాల‌ను అసంజ‌న బలాలు అంటారు. ద్ర‌వంలో ఉన్న ప్ర‌తి క‌ణం త‌న చుట్టూ ఉన్న ఇత‌ర ద్ర‌వ అణువుల‌ను 10 మీట‌ర్ల ప‌రిధిలో ఆక‌ర్షిస్తుంది. కాబ‌ట్టి ద్ర‌వ అణువుల‌న్నీ ఒక దానికొక‌టి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి త‌మ‌ని తాము చిన్న చిన్న ద్ర‌వ‌బిందువుల్లా అమ‌ర్చుకోవ‌డాన్ని త‌ల‌త‌న్య‌త(surface tension) అంటారు.

surface tension ఉదాహ‌ర‌ణ‌లు

వ‌ర్ష‌పు చినుకులు, స‌బ్బు బుడ‌గ‌, పాద‌ర‌స బిందువులు గోళాకారంలో ఉండ‌టానికి కార‌ణం త‌ల‌త‌న్య‌త‌గా చెప్ప‌వ‌చ్చు. ఒక కుంచెను పెయింట్‌లో ముంచి బ‌య‌ట‌కు తీసినప్పుడు పెయింట్ అణువుల మ‌ధ్య సంసంజ‌న బ‌లాల వ‌ల్ల కేశాల‌న్నీ ఒక దానికొక‌టి ద‌గ్గ‌రా వ‌స్తాయి. త‌ల వెంట్రుక‌ల‌కు Oilను అద్దిన‌ప్పుడు త‌ల‌త‌న్య‌త(surface tension) వ‌ల్ల ఆ వెంట్రుక‌లు ఒక దానికొక‌టి ద‌గ్గ‌రా వ‌స్తాయి. నిల‌క‌డ‌గా ఉన్న నీటి ఉప‌రిత‌లం సాగ‌దీసిన పొర‌లా ప్ర‌వ‌ర్తించ‌డం వ‌ల్ల దానిపై దోమ‌లు, ఇత‌ర క్రిమికీట‌కాలు స్వేచ్ఛ‌గా చ‌లిస్తాయి.నీటి ఉప‌రిత‌లంపై గుండుపిన్నును స‌మాత‌రంగా ఉంచిన‌ప్పుడు అది కొంత సేప‌టి వ‌ర‌కూ ఆ ఉప‌రిత‌లంపై ఉండి త‌ర్వాత నీటిలో మునిగిపోతుంది.

నీటిపై ఉన్న కాగిత‌పు ప‌డ‌వ‌కు క‌ట్టిన క‌ర్పూర బిళ్ల‌ను వెలిగించిన‌ప్పుడు నీటి త‌ల‌త‌న్య‌త మార్పు చెంద‌డం వ‌ల్ల కాగిత‌పు ప‌డ‌వ క్ర‌మ‌ర‌హితంగా తిరుగుతుంది. ఒక‌దానికొక‌టి తాకుతున్న‌ట్టుగా ఉంచిన రెండు గాజు ప‌ల‌క‌ల‌పై కొంత బ‌లాన్ని ప్ర‌యోగించి వాటిని సుల‌భంగా వేరు చేయ‌వ‌చ్చు. కానీ ఆ గాజుప‌ల‌క‌ల మ‌ధ్య‌లో కొన్ని నీటి బిందువులు వేసి విడ‌దీయ‌డానికి ఎక్కువ బ‌లాన్ని ప్ర‌యోగించాలి. నీటిలో డిట‌ర్జెంట్ పౌడ‌ర్‌ను క‌లిపిన‌ప్పుడు ఆ నీటి త‌ల‌త‌న్య‌త త‌గ్గుతుంది. నిల‌క‌డ‌గా ఉన్న నీటిపై కిరోసిన్‌ను వెద‌జ‌ల్ల‌డం వ‌ల్ల ఆ నీటి త‌ల‌త‌న్య‌త త‌గ్గి, దాని ఉప‌రిత‌లం సాగిన పొర స్వ‌భావాన్ని కోల్పోతుంది.అందువ‌ల్ల ఆ నీటిపై ఉన్న దోమ‌లు, ఇత‌ర క్రిమికీట‌కాలు నీటిలో మునిగి న‌శిస్తాయి.

ద్ర‌వాలు వేడి చేసిన‌ప్పుడు ద్ర‌వాణువులు మ‌ధ్యు ఉన్న సంసంజ‌న బ‌లాలు బ‌ల‌హీన‌ప‌డ‌టం వ‌ల్ల త‌ల‌త‌న్య‌త త‌గ్తుంది. అయితే ఘ‌న‌స్థితిలోని రాగి, Cadmiumల‌ను ద్ర‌వ‌స్థితిలోని మార్చి వేడిచేసిన‌ప్పుడు మాత్రం వాటి త‌ల‌త‌న్య‌త పెరుగుతుంది.

1. Breakup of moving sheet of water bouncing off of a spoon.

2. photo of flowing water adhering to a hand. surface tension creates the sheet of water between the flow and the hand.

3. A soap bubble balance-S.T-foreces against internal pneumatic pressure.

4. S.T Prevents a coin from sinking: the coin is indisputably denser than water, so it must be displacing a volume greater than its own for buoyancy to balance mass.

5. An aluminium coin floats on the S.F of the water 10 Degree. Any extra weight would drop the coin to the bottom.

6. A daisy. The entirety of the flower lies below the level of the free surface. The water rises smoothly around its edge. S.T prevents water from displancing the air between the petals and possibly submerging the flower.

Types of Chemical bond: వివిధ ర‌కాల ర‌సాయ బంధాలు

Types of Chemical bond | అణువులోని ప‌ర‌మాణువు మ‌ధ్య ఆకర్ష‌ణ బ‌లాలుంటాయి. ఈ ఆక‌ర్ష‌ణ బ‌లాల‌నే ర‌సాయ‌న బంధం అంటారు. ప‌ర‌మాణువులు బాహ్య క‌ర్ప‌రంలో 8 Read more

Nobel Prize award: నోబెల్ బ‌హుమ‌తి గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు

Nobel Prize award డైన‌మెట్‌ను క‌నిపెట్టిన ఆల్‌ఫ్రెడ్ నోబెల్ ఈ నోబెల్ బ‌హుమ‌తి ప్ర‌దానానికి అంకురార్ప‌ణ చేశారు. ప్ర‌పంచంలో అత్యుత్త‌మ బ‌హుమ‌తిగా గౌర‌వింప‌బ‌డుతున్న‌దీ నోబెల్ ప్రైజ్. మాన‌వ Read more

Viscosity: ర‌క్తం వేగాన్ని నియంత్రించుకోవాల‌న్నా, స‌ముద్రంలో కెరటాలు తాకిడి త‌గ్గాల‌న్నా స్నిగ్థతే కార‌ణం!

Viscosity | ద్ర‌వాలు, వాయువులు ఎప్పుడూ అధిక పీడ‌నం నుంచి అల్ప‌పీడ‌నం వైపు ప్ర‌వ‌హిస్తుంటాయి. అందువ‌ల్ల వీటిని ప్ర‌వాహినులు అని అంటారు. ప్ర‌వాహినుల పొర‌ల్లో ఉన్న అణువుల Read more

UPSC Prelims Exam Result 2022 Website link

UPSC Prelims Exam Result 2022 | The Results of Civil Services Preliminary Examination, 2022 have been declared by the Union Read more

Leave a Comment

Your email address will not be published.