Covid Third Wave : దేశంలో కరోనా థర్డ్ వేవ్ పై సుప్రీం కోర్టు కేంద్రానికి కొన్ని ప్రశ్నలను సంధించింది. సెకండ్ వేవ్ ముప్పు పోక ముందే థర్డ్ వేవ్ పొంచి ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆక్సిజన్, వ్యాక్సిన కొరత లేకుండా చూడాలని తెలిపింది.
Covid Third Wave :న్యూఢిల్లీ: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపథ్యంలో సుప్రీం కోర్టు గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సెకండ్ వేవ్‌నే అడ్డుకోలేకపోయారు? ఇక థర్డ్‌వేవ్ ను ఎలా ఎదుర్కొంటారు? అంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. కోవిడ్ 19 మహమ్మారి 3వ దశ ప్రభంజనం మరింత వికృతంగా ఉండబోతోందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయ స్థానం అప్రమత్తం చేసింది. ఈ సమయంలో అప్రమత్తంగా ఉంటేనే రాబోయే థర్డ్ వేవ్ ప్రభంజనాన్ని ధీటుగా ఎదుర్కొనగలుతామని సూచించింది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ నిల్వలు ఎలాఉన్నాయో? పంపిణీ ఎలా జరుగుతుందో పరిస్థితులను సమీక్షించుకోవాలని తెలిపింది. ఢిల్లీ నగరానికి ఆక్సిజన్ సరఫరా కు సంబంధించి ఓ పిటిషన్‌పై విచారణ జరిపిన సందర్భంగా జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం పై విషయాన్ని గుర్తు చేసింది. ఢిల్లీలోని కరోనా రోగులకు రోజుకు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రణాళికను సుప్రీం కోర్టు పరిశీలించింది. అయితే న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను, సూచనలను, సలహాలను పాటిస్తున్నామని కేంద్రం ప్రభుత్వం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా..ద్రవ రూపంలోని మెడికల్ ఆక్సిజన్‌ను ఉపయోగించే ఢిల్లీలోని ప్రధాన ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు ఉన్నట్టు వెల్లడైందని ధర్మాసనానికి తెలియజేశారు. జస్టిస్ చంద్రచూడ్ ఈ విషయంపై స్పందిస్తూ ఇప్పుడు భారత దేశం అవసరాలకు తగిన ప్రణాళికను రూపొందించి అమలు చేసే దిశగా అడుగులు వేయాలని తెలిపారు. ఆక్సిజన్ సరఫరా, నిల్వల విషయంలో ఆడిట్ జరగాలని స్పష్టం చేశారు. ప్రస్తతుం కోవిడ్ 19 రెండో దశలో ఉన్నామని, కానీ రాబోయే మూడో దశ మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇప్పుడు సిద్ధంగా ఉంటేనే థర్డ్ వేవ్‌ను ధైర్యంగా ఎదుర్కోవచ్చని తెలిపింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఆక్సిజన్ సరఫరా, టీకా విషయంలో ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చేయాలని న్యాయస్థానం సూచించింది.
మరో 24 గంటల్లో కేరళాలో లాక్డౌన్
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుండగా ఇప్పటికే పలు రాష్ట్రాలు పూర్తి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. అదే బాటలోకి కేరళ కూడా వెళ్లేందుకు సిద్దమైంది. రాష్ట్రంలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం పినరయి విజయన్ లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉదయం మే 8 (శనివారం) నుంచి 16వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ ఉండనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం కేరళలో రాత్రి కర్ఫ్యూ 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంది. కేరళలో గడిచిన 24 గంటల వ్యవధిలో 42 వేల కరోనా కేసులు నమోదయ్యయి. దీంతో ప్రభుత్వం లాక్డౌన్ దిశగా నిర్ణయం తీసుకుంది.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి