Supreme Court : రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1950 సంవత్సరం జనవరి 28న ఫెడరల్ కోర్టు స్థానంలో సుప్రీం కోర్టు ఏర్పాటు చేశారు. సుప్రీం కోర్టులో ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి సహా 34 మంది న్యాయమూర్తులు ఉన్నారు.
సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య సవరణ చట్టం-2019 ప్రకారం 33 మంది న్యాయమూర్తులు ఉంటారు. ప్రస్తుతం Supreme Courtలో నలుగురు మహిళా న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. వారు ఇందిరా బెనర్జీ, హిమా కోహ్లీ, బి.వి.నాగరత్న, బేలా త్రివేది.
కోలకత్తా హైకోర్టు జడ్జి సీఎస్ కర్ణన్‌కు 2017 మేలో సుప్రీంకోర్టు 6 నెలల Jail శిక్ష విధించింది. దేశ చరిత్రలో కోర్టు ధిక్కరణ నేరం కింద పదవిలో ఉండగా జైలు శిక్షకు గురైన తొలి High Court జడ్జి సీఎస్ కర్ణన్. సుప్రీంకోర్టు ప్రత్యేక ప్రారంభం అధికార పరిధిలోకి సమాఖ్య, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలు వస్తాయి.
అప్పీళ్ల విచారణ అధికార పరిధిలోకి రాజ్యాంగ, సివిల్, Criminal వివాదాలు వస్తాయి. నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి తన నేరాన్ని అంగీకరిస్తే, కోర్టు అతనికి చట్ట ప్రకారం విధించాల్సిన శిక్ష కంటే తక్కవ శిక్ష విధించడాన్ని ప్లీ బార్గేయినింగ్ అంటారు.
దేశంలో మరేతర న్యాయస్థానం, Tribunal ఇచ్చే తీర్పుకు విరుద్ధంగా సుప్రీంకోర్టులో కేసు నమోదు చేసే అవకాశాన్ని Supreme Court స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా కల్పిస్తుంది. ఇది విచక్షణాధికారం. కోర్టు మార్షల్, సైనిక ట్రిబ్యునల్ తీర్పులకు వర్తించదు.
న్యాయస్థానం తీర్పును ఉద్దేశపూర్వకంగా విమర్శిం చడం, తిరస్కరించడం సివిల్ ధిక్కారం కిందకు వస్తుంది. న్యాయస్థానం తీర్పుకు విరుద్ధంగా గానీ కోర్టు గౌరవాన్ని భంగపరిచేలా గానీ న్యాయస్థాన పాలనకు ఆటంకపరిచేలా గానీ ఏదైనా సమాచారం ప్రదర్శించడం క్రిమినల్ ధిక్కారం కిందకు వస్తుంది.
2002లో సుప్రీం కోర్టు క్యూరేటివ్ పిటిషన్ విధి విధానాలను రూపొందించింది. రాజ్యాంగంలో క్యురేటివ్ పిటిషన్ ప్రస్తావన లేదు. ప్రభుత్వ విభాగాల నిర్ణయాలు, చర్యలు రాజ్యాంగానికి లోబడి ఉండే, ఇంట్రా వైర్స్ అని వాటిని Supreme Court కొనసాగిస్తుంది. ఒక వేళ రాజ్యాంగానికి విరుద్దంగా ఉంటే అల్ట్రావైర్ అని వాటిని కొట్టివేస్తుంది.
ఆర్టికల్ 32 ప్రకారం ప్రాథమిక హక్కుల పరిరక్షణలో భాగంగా సుప్రీంకోర్టుకు రిట్లను జారీ చేసే అధికారం రాజ్యాంగం కల్పించింది. ఇందులో భాగంగా హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కోవారటో, సెర్సి యోరరీ అనే రిట్లను జారీ చేస్తుంది.