Sunday Holiday

Sunday Holiday History: ఇంత‌కీ ఆదివారం రోజు సెలవు ఎలా వ‌చ్చింది?

Special Stories

Sunday Holiday History : మ‌నిషి జీవించ‌డానికి వారంలో 5 రోజుల నుంచి 6 రోజులు క‌ష్ట‌ప‌డుతుంటాడు. ఆ త‌ర్వాత విశ్రాంతి తీసుకోవ‌డానికి ఆదివారం ఎప్పుడు వ‌స్తుందా? అని ఎదురు చూస్తుంటాడు. ఈ ఆదివారం సెల‌వు(Holiday) అనేది ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాలు జ‌రుపుకుంటాయి. ఇంత‌లా ఆదివారాన్ని ఇష్ట‌ప‌డే మీరు అస‌లు ఆదివారం సెలువు ఎందుకు వ‌చ్చింది? ఎప్పుడు వ‌చ్చింద‌ని గ‌మ‌నించారా?

Sunday Holiday History | ఆదివారం సెలువు ఎలా వ‌చ్చిందంటే?

అస‌లు ఆదివారం సెలువు ఎందుకు వ‌చ్చింద‌ని ఎవ‌రినైనా అడిగితే వారి వ‌ద్ద నుంచి స‌మాధానం రావ‌డం చాలా వ‌ర‌కు క‌ష్టం అని చెప్ప‌వ‌చ్చు. అన్ని మ‌తాల వారు ప్ర‌తి రోజూ ఒక విశిష్ట‌త‌ను పొందుప‌ర్చుకుంటారు. వాటిలో హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం అయితే ఆదివారాన్ని ర‌వి వారం(Sunday) అని కూడా పిలుస్తుంటారు. ఆదివారానికి అధిప‌తి సూర్యుడ‌ని పురాణాలు చెబుతున్నాయి. అందువ‌ల్ల సూర్య భ‌గ‌వాణ్ని మ‌రొక పేరు అయిన ర‌విని తీసుకొని ర‌వి వారంగా పిలుస్తున్నారు. సూర్యుడుని ప్ర‌త్య‌క్షంగా కొలిచే మ‌న హిందూ సాంప్ర‌దాయంలో ఆయ‌న అనుగ్ర‌హం పొంద‌డానికి ప్ర‌త్యేక పూజ‌లు, ఉప‌వాసాలు చేసేవారు.

అలాగే క్రైస్త‌వుల‌కు ప‌విత్ర గ్రంథ‌మైన బిబైల్ లో కూడా ఆదివారానికి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. క్రైస్త‌వ మ‌తానికి మూల పురుషుడు అయిన ఏసుక్రీస్తు చ‌నిపోయిన మూడో రోజు స‌మాధిలో నుండి తిరిగి బ్ర‌తికాడ‌ని బైబిల్ చెబుతున్న‌ది. క్రీస్తును స‌మాధిలో పాతిపెట్టింది శుక్ర‌వారం అయితే, మూడో రోజు ఆకాశంలో మేఘాసీనుడ‌య్యారు. దాని కార‌ణంగా సండే ప‌విత్ర దినంగా క్రైస్త‌వులు భావిస్తారు. అందుకే ప్ర‌తి సంవ‌త్స‌రం గుడ్‌ప్రైడే త‌ర్వాత వ‌చ్చే సండేను ఈస్ట‌ర్ సండేగా పిలుస్తుంటారు. ఈ విధంగా ఆదివారం క్రైస్త‌వ మ‌తం వారికి ప్ర‌త్యేక‌త సంత‌రించుకుంది.

ఇదిలా ఉంటే ద‌ళితులంద‌రూ కుటుంబ‌మంతా ప్ర‌తి రోజూ ప‌నికి వెళ్ల‌డం వ‌ల్ల దైవారాధ‌న‌పై శ్ర‌ద్ధ చూప‌డం లేద‌ని భావించిన క్రైస్త‌వ్య మ‌త పెద్ద‌లు వారంలో ఒక రోజు సెలువు ఇవ్వాల‌ని భావించారు. దీంతో కుటుంబ స‌భ్యులు అంతా క‌లిసి భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో దైవారాధ‌న‌లో గ‌డ‌పాల‌ని, సంతోషంగా ఆది వారాన్ని జ‌రుపుకోవాల‌ని సండే సెలవుగా ప్ర‌క‌టించారు. త‌ర్వాత కాలంలో ప్ర‌తి దేశంలో క్రైస్త‌వ్యం వ్యాప్తి చెందిన ప్ర‌దేశాల్లో ఆదివారం సెలువు దినంగా ప్ర‌క‌టించ బ‌డింది.

భార‌త దేశంలో ఆదివారం సెల‌వు

మ‌న దేశాన్ని బ్రిటీష్ వారు ఆక్ర‌మించుకోక మునుపు ఆదివారాన్ని ఓ ప‌విత్ర మైన రోజుగా భార‌తీయులు కొలిచేవార‌ని, సెలువు మాత్రం ఉండేది కాదంట‌. దీనికి ప్ర‌ధాన కార‌ణం పూర్వం మ‌న దేశంలో వ్య‌వసా యం చేసేవారు ఎక్కువుగా ఉండేవారు కాదు. కానీ భార‌త దేశంలో బ్రిటీష్ వారు అడుగు పెట్టాక మ‌న భార‌తీయుల‌ను వారు కూలీలుగా పెట్టుకున్నారు. రోజుకు ఎంతో కొంత డ‌బ్బు రావ‌డం వల్ల చాలా మంది ప్ర‌జ‌లు బ్రిటీష్ వారి వ‌ద్ద ప‌ని చేస్తుండే వారు. ఆ క్ర‌మంలో సంఘంలో జ‌రిగే ఘ‌ట‌న‌ల విషయంలో ఎవ‌రూ కూడా ప్ర‌తిఘ‌టించే వారు కాదు. అప్ప‌టి మ‌న సంఘంలో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకోవ‌డానికి అంద‌రికీ ఒక సెలువు ఉండాల‌ని ఆశించారు.

ఆదివారం

ఆ సెలువు రోజు ప్ర‌తి ఒక్క‌రూ సంఘ సంస్క‌ర‌ణ‌కు పాటు ప‌డాల‌ని అప్ప‌టి అభ్యుద‌య నాయ‌కుడు నారాయ‌ణ్ మేఘాజీ భార‌త దేశంలో ఆదివారం సెలువు కావాల‌ని బ్రిటీష్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఆయ‌న డిమాండ్‌కు బ్రిటీష్ వారు కూడా ఒకే చెప్పారు. దీంతో భార‌త దేశంలో కూడా ఆదివారం సెలువు దినంగా ప్ర‌క‌టించ‌బ‌డింది. ఆ విధంగా ఆదివారం రోజూ సెలువుగా ప్ర‌తి ఒక్క‌రూ అంగీక‌రించి అమ‌లు చేస్తున్నారు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *