Agriculture

Agriculture : లోతు దుక్కుల వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు? | Summer Deep Polugh Uses

Spread the love

Agriculture : వ్య‌వ‌సాయ భూముల్లో వేస‌వి కాలం ట్రాక్ట‌ర్ల ద్వారా వేసే లోతు దుక్కులు వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏమిటి? ఆ లోతు దుక్కు వ‌ల్ల భూమికి ఎంత లాభం?


Agriculture : సాధార‌ణంగా రైతులు రెండు పంట‌లు వేసిన త‌ర్వాత వేస‌వి కాలంలో భూమి పొడిగా, గ‌ట్టిగా త‌యార‌వుతుంది. ఇదే స‌మ‌యంలో పంట కాలం ముగిసిన‌ తర్వాత వేస‌వి కాలంలో ఎండిపోయిన పంట అవ‌శేషాల‌ను ఒక‌చోట కుప్ప‌గా చేసి అగ్నితో కాల్చివేస్తారు. ఇది గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా రైతులు చేస్తున్న పద్ధ‌తిగా చెప్ప‌వ‌చ్చు. అయితే త‌ర్వాత పంట దిగుబ‌డిపై ఈ ప్ర‌భావం కూడా ప‌డుతుంద‌ని వ్య‌వ‌సాయ నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా పంట అవ‌శేషాల‌ను కాల్చ‌డం వ‌ల్ల పొగ కాలుష్యం పెరిగి ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ‌తినే ప‌రిస్థితి వ‌స్తుంది త‌ప్ప పంట భూమికి మేలు చేసే ప్ర‌క్రియ మాత్రం త‌గ్గుతుంది.

ప‌శువుల ఎరువు (Livestock manure)మేలు!

వేస‌వికాలంలో మ‌న ప‌ల్లెటూళ్ల‌లో ఉండే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేక‌ల మంద‌ల‌ను పొలాల్లో తిప్ప‌డం వ‌ల్ల వాటి నుంచి వ‌చ్చే పేడ, వ్య‌ర్థాలు భూమికి ఎంతో పోష‌ణ అందిస్తాయి. కొంత మంది రైతులు ఇలా గొర్రెల‌ను, మేక‌ల‌ను రోజుల త‌ర‌బ‌డి పొలాల్లో పెంట‌కాయిస్తుంటారు. ఈ ప‌శువుల ఎరువు భూమిలోకి ఇంకి పోష‌క విలువుల‌ను పెంచుతాయి. త‌ద్వారా త‌ర్వాత వేసే పంట‌కు సార‌వంత‌మైన పోష‌క బ‌లం అందుతుంది.

లోతు దుక్కి వ‌ల్ల ప్ర‌యోజ‌నం!

క‌రీఫ్‌, యాసంగి పంట కాలం ముగిసిన త‌ర్వాత పొడిబారిన నేల‌లో వేస‌వి కాలంలో ట్రాక్ట‌ర్ల(tractor) ద్వారా పొడి దుక్కి వేయ‌డం ఎంతో మేలుక‌ర‌మైన ప‌ద్ధ‌తి. ఇలా లోతు దుక్కి వేయ‌డం వ‌ల్ల భూమికి సూక్ష్మ పోష‌కాలు అందుతాయి. అదే విధంగా లోతు దుక్కులు వ‌ల్ల పంట‌కు న‌ష్టం క‌లిగించే భూమిలో ఉండే పురుగులు నేల‌పైకి వ‌స్తాయి. ఎండ తీవ్ర‌త‌కు అవి చ‌నిపోతాయి. ఆ పురుగుల‌ను ప‌క్షులు తింటాయి. అంతే కాకుండా లోతు దుక్కి వ‌ల్ల ప‌త్తి పంటకు న‌ష్టం చేసే గులాబి, ఎర్ర పురుగుల స‌మ‌స్య‌ల‌ను అరిక‌ట్ట‌వ‌చ్చు. వ‌ర్షాకాంలో నీటి నిల్వ‌లు పెరుగుతాయి. లోతు దుక్కి వ‌ల్ల అంత‌కు ముందు ఉన్న క‌లుపు మొక్క‌ల గింజ‌లు, వేళ్లు పైకి వ‌చ్చి ఎండ‌కు ఎండిపోతాయి. భూమి పొర‌ల్లో గ‌ట్టిగా ఉండే ప్ర‌దేశాలు పెకిలించ‌డంతో పాటు భూమి పొర‌లు తెగి నేల సార‌వంతంగా మారుతుంది. నేల కోత‌కు గురికాకుండా ఉంటుంది. నేల గుల్ల పారుతుంది. ఈ లోతు దుకుల‌ను కూడా Mould Board Plough లేదా disk plough నాగ‌ళ్ల‌తో 25 సెంమీ. నుంచి 75 సెం.మీ లోతు వ‌ర‌కు దున్నుకోవాలి. దున్న‌డం కూడా వాలుగు అడ్డంగా దున్నాలి.

Banking Services : ఇక రైతు భ‌రోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ సేవ‌లు

Banking Services : ప్రస్తుత కాలంలో వ్య‌వ‌సాయం చేసే రైతుల‌కు రుణాల కోసం బ్యాంకులు చుట్టూ తిర‌గ‌డం పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. రోజుల త‌ర‌బ‌డి ప‌ట్ట‌ణాల్లో ఉంటున్న Read more

Amaravati Farmers : ఎమ్మెల్యే శ్రీ‌దేవికి రాజ‌ధాని సెగ‌!

Amaravati Farmers : గుంటూరు : తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవికి రాజ‌ధాని సెగ త‌గిలింది. శ‌నివారం మంద‌డం నూత‌న స‌చివాల‌యం ప్రారంభోత్స‌వానికి వ‌చ్చిన ఎమ్మెల్యేను మార్గ‌మ‌ధ్య‌లో Read more

summer safety tips : వేస‌విలో ప‌సిబిడ్డ‌లు ప‌దిలం(baby care) కోసం తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు

summer safety tips : ఈ వేస‌వి కాలంలో ఎండ‌లు తీవ్రంగా ఉన్నాయి. చిన్న పిల్ల‌ల మొద‌లు ముస‌లివారు వ‌ర‌కు ఎండ వేడిమి త‌ట్టుకోలేక ఇబ్బందులు ప‌డుతున్నారు. Read more

Telangana లో Summer Holidays ప్ర‌క‌టించిన విద్యాశాఖ‌

Telangana లో Summer Holidays ప్ర‌క‌టించిన విద్యాశాఖ‌ Summer Holidays : తెలంగాణా రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాల‌కు అనుగుణంగా రాష్ట్రంలో ఏప్రిల్‌ 27 నుంచి మే Read more

Leave a Comment

Your email address will not be published.